oxyzen
-
‘ఆక్సిజన్ మ్యాన్’ ఎవరు? ఎందుకాపేరు వచ్చింది?
నిస్వార్థంగా సేవ చేయడానికి సిద్ధమయ్యే యువత చాలా అరుదుగా కనిపిస్తుంది. అయితే దీనికి భిన్నంగా ప్రకృతిని అమితంగా ప్రేమిస్తూ, పర్యావరణ పరిరక్షణకు నిరంతరం పాటుపడుతున్న సునీల్ యాదవ్ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఒకవైపు జాతీయ స్థాయి కబడ్డీలో రాణిస్తూ, మరోవైపు పర్యావరణ పరిరక్షణలోనూ తన భాగస్వామ్యం ఉందంటున్న సునీల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సునీల్ తన 25 ఏళ్ల వయసుకే పదివేలకు పైగా మొక్కలు నాటి రికార్డు సృష్టించాడు. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన సునీల్ యాదవ్ పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ, పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. 2018-2019లో ఉత్తరప్రదేశ్ నుండి కబడ్డీ జూనియర్ జట్టులో ఆడి మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. ఆ తర్వాత 2020లో రెండోసారి రాష్ట్ర స్థాయిలో కబడ్డీ ఆడాడు. ఓవరాల్‌గా ఇప్పటి వరకు ఐదుసార్లు రాష్ట్ర స్థాయిలో ఆడాడు. ఒకవైపు క్రీడారంగంలో ఎదుగుతూనే మరోవైపు ప్రకృతిని కాపాడేందుకు కృషి సాగించాడు. లాక్డౌన్ సమయంలో జనమంతా ఇంట్లో ఉన్నప్పుడు సునీల్ ఉదయాన్నే నిద్రలేచి పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటేవాడు. తరువాత వాటిని సంరక్షించేవాడు. ఈ నేపధ్యంలోనే సునీల్ వినూత్న ప్రచారాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎవరినైనా అభినందిస్తూ పుష్పగుచ్ఛాలు ఇచ్చేందుకు బదులుగా ఔషధ మొక్కలు బహుమతిగా ఇవ్వాలనే ఆలోచన అందరిలో కల్పించాడు. తద్వార పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని భావించాడు. ఈ నేపధ్యంలో సునీల్ యాదవ్ ‘ఆక్సిజన్ మ్యాన్’గా గుర్తింపు పొందాడు. సునీల్ ఇప్పటివరకూ దేశంలోని మూడు రాష్ట్రాలలో సైకిల్ యాత్ర చేపట్టి, జనం మరింతగా మొక్కలు నాటేలా చైతన్యపరిచారు. సునీల్ చేపడుతున్న ప్రచారం నిరంతరం కొనసాగుతోంది. సునీల్ సుమారు 20 నుంచి 30 గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విరివిగా మొక్కలు నాటాడు. -
Guntur: ఆక్సిజన్ ప్లాంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత
-
ఆక్సిజన్ డిమాండ్‌పై రగడ: బీజేపీ, ఆప్ పరస్పరం విమర్శలు
న్యూఢిల్లీ: ఢిల్లీలో కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో తీవ్ర ఆక్సిజన్ కొరత ఏర్పడటంపై సుప్రీం కోర్టు ప్యానెల్ అంద జేసిన నివేదికలోని అంశాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఆ ఆడిట్ రిపోర్టు మధ్యంతర నివేదిక మాత్రమేనని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా శనివారం స్పష్టం చేయగా.. దీనిని రాజకీయం చేయడం మాని, కోవిడ్ థర్డ్ వేవ్ రాకుండా కలిసికట్టుగా పనిచేయాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కోరారు. సెకండ్ వేవ్ సమయంలో ఢిల్లీలో ఆక్సిజన్ అవసరాలను నాలుగింతలు చేసి చూపారంటూ నివేదికలో పేర్కొనడంపై శనివారం బీజేపీ, ఆప్ పరస్పరం విమర్శలు చేసుకోగా, ఆక్సిజన్ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొట్లాడుకుంటుంటే కరోనాయే గెలుస్తుందని శనివారం కేజ్రీవాల్ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. ‘సెకండ్ వేవ్‌లో తీవ్ర ఆక్సిజన్ కొరత ఏర్పడింది. థర్డ్ వేవ్‌లో అలా జరక్కూడదు. మనలో మనం పోరాడుకుంటుంటే కరోనాయే గెలుస్తుంది. మనం కలిసి పోరాడితే దేశం గెలుస్తుంది’అని చెప్పారు. కాగా, ఈ వ్యవహారంపై గులేరియా స్పందిస్తూ.. ‘అది మధ్యంతర నివేదిక మాత్రమే. ఆ అంశం కోర్టు పరిధిలో ఉంది. ఆక్సిజన్ డిమాండ్ అనేది స్థిరంగా ఉండదు. రోజుకో తీరుగా మారుతుంటుంది’ అని చెప్పారు. సుప్రీంకోర్టు నియమించిన ఐదుగురు సభ్యుల ప్యానెల్‌కు గులేరియా నేతృత్వం వహించిన విషయం తెలిసిందే. చదవండి: నన్ను జైల్లోనే ఉంచేందుకు కుట్ర జాతికి కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలి: బీజేపీ -
జాతికి కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలి: బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ : ఆక్సిజన్ సిలిండర్ల వినియోగంలో కేజ్రీవాల్ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పత్ర ఆరోపించారు. కేజ్రివాల్ అబద్ధాలతో ఇతర రాష్ట్రాలు ఇబ్బంది పడ్డాయని మండిపడ్డారు. ఢిల్లీ ముఖ్యమంత్రి జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, సెకండ్ వేవ్ సందర్బంగా ఢిల్లీ ప్రభుత్వం అవసరమైన ఆక్సిజన్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ డిమాండ్ చేసిందని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఆడిట్ ప్యానెల్ తేల్చింది. ఏప్రిల్, మే నెలలో ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ సిలిండర్లు ఢిల్లీకి అందాయని, రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసిన మేరకు ఇతర రాష్ట్రాలకు తగ్గించి మరీ ఢిల్లీకి సరఫరా చేయాల్సి వచ్చిందని తెలిపింది. ఢిల్లీకి 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవరసం ఉండగా.. ప్రభుత్వం 1200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను డిమాండ్ చేసిందని పేర్కొంది. -
కానిస్టేబుల్ థెరిసా.. రెహానా!
కరోనా సెకండ్ వేవ్ ప్రారంభంలో మహారాష్ట్ర, దేశ ఆర్థిక రాజధాని ముంబై చిగురుటాకుల్లా వణికిపోవడంతో.. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ, ఆపదలో సాయం అడిగిన ప్రతి ఒక్కరికి సాయమందించి ‘అభినవ మదర్ థెరిసా’ గా గుర్తింపు తెచ్చుకున్నారు ముంబైకి చెందిన పోలీసు కానిస్టేబుల్ రెహానా షేక్. విపత్కర పరిస్థితులో తనని సాయం అడిగిన వారందరికి రెహానా ఆక్సిజన్, ప్లాస్మా, బ్లడ్, బెడ్స్ ఏది కావాంటే అది ఏర్పాటు చేసి వారి సమస్యలను పరిష్కరించారు. దీంతో రెహానా భర్త, తన తోటి ఉద్యోగులు, తెలిసిన వారు మదర్ థెరిసాగానేగాక ఆమెను మంచి సామాజిక కార్యకర్తగా పిలుస్తున్నారు. కరోనా సమయంలో మానవత్వం తో వ్యవహరించిన రెహానాను పోలీసు కమిషనర్ ఎక్స్‌లెన్స్ సర్టిఫికెట్తో సత్కరించారు. అంతేగాక అందరు పిలుస్తున్నట్లుగానే మదర్ థెరిసా అవార్డు వరించడం విశేషం. మదర్ థెరిసాగా.. 2000 సంవత్సరంలో ముంబై పోలీసు కానిస్టేబుల్‌గా బాధ్యతలు చేపట్టిన రెహానా మంచి వాలీబాల్ ప్లేయర్, అథ్లెట్ కూడా. 2017లో శ్రీలంకలో జరిగిన పోటీల్లో ఆమె రజత, స్వర్ణ పతకాలను గెలుచుకున్నారు. ఆటలు, డ్యూటీలో చురుకుగా ఉండే రెహానా సామాజిక సేవలోనూ ముందుంటారు. ఈ క్రమంలోనే గతేడాది మే 13న తన కూతురు పదహారో పుట్టినరోజు సందర్భంగా రాజ్‌గఢ్ లోని వాజే తాలుకాలో ఉన్న డయానై సెకండరీ స్కూల్ సందర్శించి అక్కడ చదువుతోన్న విద్యార్థులకు స్వీట్లు పంచారు. ఆ సమయంలో స్కూలు ప్రిన్స్‌పాల్‌తో మాట్లాడిన ఆమె.. స్కూల్లో చదువుతోన్న ఎక్కువమంది విద్యార్థులు నిరుపేద కుటుంబాలకు చెందిన వారని, వారిలో కొందరికి కనీసం కాళ్లకు వేసుకోవడానికి చెప్పులు కూడా లేవని తెలుసుకున్నారు. దీంతో తన కూతురి పుట్టిన రోజుకోసం ఖర్చు చేద్దామని కేటాయించిన డబ్బులు, ఈద్ కోసం ఖర్చుచేసే మొత్తం డబ్బులను స్కూలు పిల్లలకోసం ఇచ్చేశారు. అంతేగాక యాభై మంది పిల్లలను పదోతరగతి వరకు చదివిస్తానని మాట ఇచ్చారు. కోవిడ్ సమయంలో ఆసుపత్రిలో బెడ్ల ఏర్పాటు, ప్లాస్మా, రక్త దానం, ఆక్సిజన్ సరఫరా చేసి 54 మందిని ఆదుకున్నారు. దీంతో ఆమె మంచి సామాజిక వేత్తగా గుర్తింపు పొందారు. తోటి ఉద్యోగులకుసైతం.. తన తోటి కానిస్టేబుల్ తల్లికి ఇంజెక్షన్ దొరకక ఇబ్బంది పడుతున్నారని తెలిసి.. పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి సంబంధిత ఇంజెక్షన్ ఎక్కడ దొరుకుతుందో తెలిసేంత వరకు కాల్స్ చేసి ఇంజెక్షన్‌ను ఏర్పాటు చేశారు. ఇది తెలిసిన పోలీసు యంత్రాంగంలోని కొంతమంది బ్లడ్, ప్లాస్మా, ఆసుపత్రిలో తమ బంధువులకు బెడ్లు కావాలని అడగడంతో ఆమె బ్లడ్ డోనార్స్ వాట్సాప్ గ్రూపుల్లో చేరి రక్తదాతలకు మెస్సేజులు చేసి కావాల్సిన బ్లడ్‌ను ఏర్పాటు చేశారు. అంతేగాక క్యాన్సర్ రోగులకు అవసరమైన సాయం చేస్తున్నారు. ఉద్యోగంతోపాటు తోటి వారి సమస్యలు తీర్చే రెహానా లాంటి వారు అరుదుగా కనిపిస్తారు. -
చివరి చూపు అయినా దక్కాలి కదా!
వలస కార్మికులు ఇళ్లు చేరడానికి సహాయపడుతున్నాడు. ఆకలి బాధ తీరుస్తున్నాడు. ఆరోగ్యం బాగాలేకపోతే ఆపరేషన్ చేయిస్తున్నాడు. ఊపిరి (ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల సరఫరా) పోస్తున్నాడు. మనిషిని బతికించడానికి చేతనైంత చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకో సాయంతో ముందుకు వచ్చాడు.. మనిషి చనిపోతే.. వేరే ఊర్లో ఉండే అయినవాళ్లు వచ్చేలోపు భౌతికకాయాన్ని భద్రపరిచే వీలు లేక అంత్యక్రియలు చేస్తుంటే.. భద్రపరచడానికి ఫ్రీజర్ బాక్సులు ఇవ్వాలనుకున్నాడు. రీల్ లైఫ్‌లో సోనూ సూద్ విలన్. రియల్ లైఫ్‌లో హీరో. ఇవన్నీ చేయడానికి సోనూ వెనక ఉన్నది ఎవరు? ఏ పొలిటికల్ పార్టీ ఉంది? ‘సాక్షి’కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో సోనూ సూద్ పలు విషయాలు చెప్పారు. ► మనిషి తన ఇల్లు చేరుకోవడానికి, ప్రాణాపాయంలో ఉంటే బతికి బయటపడటానికి మీకు చేతనైన సహాయం చేస్తున్నారు. ఇప్పుడు మనిషి కన్నుమూశాక కుటుంబ సభ్యులకు ‘చివరి చూపు’ దక్కాలనే ప్రయత్నం మొదలుపెట్టారు.. ఈ కొత్త సహాయం గురించి? సోనూ సూద్: నేను చిన్న టౌన్ (పంజాబ్‌లోని మోగా) నుంచి వచ్చాను. నగరాలతో పోల్చితే పట్టణాల్లో, గ్రామాల్లో సౌకర్యాలు తక్కువగా ఉంటాయని తెలిసినవాడిని. ముఖ్యంగా ఈ లాక్డౌన్ టైమ్‌లో ఒకచోటు నుంచి ఇంకో చోటుకి వెళ్లడం ఎంత ఇబ్బందో తెలిసిందే. గ్రామాల్లో ఉన్నవాళ్లు చనిపోతే సిటీలో ఉంటున్న వాళ్ల దగ్గర బంధువులు వెళ్లడానికి ఆలస్యం అవుతోంది. ఈలోపు భౌతికకాయన్ని భద్రపరిచే సౌకర్యం లేకుండా అల్లాడుతున్నారు. అయినవాళ్లు రాకముందే అంత్యక్రియలు జరిపించేస్తున్నారు. ‘చివరి చూపు’ అయినా దక్కాలి కదా! అది కూడా దక్కకపోతే ఆ బాధ జీవితాంతం ఉండిపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది మాకు ఈ విషయం గురించి ఫోన్ చేసి చెప్పారు. అందుకే ‘డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్స్’లను పంపాలనుకున్నాం. అడిగినవాళ్లకు అడిగినట్లు పంపే ఏర్పాట్లు చేస్తున్నాం. ► దేశవ్యాప్తంగా ఆక్సిజన్ అందజేయాలనే ఆలోచన గురించి? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కువమంది కరోనా బాధితులు ఆక్సిజన్ దొరక్క కన్నుమూస్తున్నారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కోసం దేశవ్యాప్తంగా మాకు మెసేజ్‌లు వస్తున్నాయి. అందుకే ప్యాన్ ఇండియా ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీ గురించి ఆలోచించాం. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరతను తగ్గించి కోవిడ్ బాధితులకు సహాయం చేయడానికి దాదాపు 20కి పైగా ఆక్సిజన్ ప్లాంట్స్‌ను ఆరంభించనున్నాం. ► గొప్ప నాయకుడు భగత్ సింగ్ పుట్టిన ప్రాంతానికి చెందిన మీరు హిందీలో తొలి చిత్రం ‘షాహిద్–ఇ–అజామ్’లో భగత్ సింగ్ పాత్ర చేశారు. ఈ కరోనా క్లిష్ట పరిస్థితుల్లో మీరు చేస్తున్న సేవా కార్యక్రమాల దృష్ట్యా మిమ్మల్ని చాలామంది భగత్ సింగ్‌తో పోల్చడంపై మీ ఫీలింగ్? నన్ను గొప్ప గొప్ప వ్యక్తులతో పోలుస్తున్నారు. దాన్ని నేను గౌరవంగా భావిస్తున్నాను. అలాగే ప్రజల నమ్మకం నా బాధ్యతను ఇంకా పెంచుతోంది. నా సాయం కోరుకున్నవారు ఏ మారుమూల ప్రాంతాన ఉన్నా వారిని చేరుకోవాలనే నా సంకల్పాన్ని మరింత బలపరిచింది. ► సహాయ కార్యక్రమాలు చేయడానికి మా అమ్మానాన్న స్ఫూర్తి అని పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఏ విధంగా వారిని చూసి స్ఫూర్తి పొందారో ఉదాహరణ చెబుతారా? నా చిన్నతనం నుంచే మా అమ్మనాన్నల ద్వారా ఇతరులకు సాయం చేయడాన్ని నేర్చుకున్నాను. ఇతరులకు సహాయపడటానికి ఇద్దరూ ఎప్పుడూ ముందుండేవారు. అలా నా కళ్ల ముందే నాకో మంచి ఉదాహరణ ఉంది. నాలోనే కాదు.. నా భార్య, నా కొడుకులో కూడా పరోపకార గుణం ఉంది. ప్రతి ఒక్కరం మన సామర్థ్యం మేరకు ఇతరులకు సాయం చేయాల్సిన సమయం ఇది. ఈ కరోనా టైమ్‌లో ‘గివింగ్ బ్యాక్ టు సొసైటీ’ గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. ► ఇతరులకు సహాయపడాలంటే గొప్ప మనసు మాత్రమే కాదు.. ఆర్థిక బలం కూడా ఉండాలి. మీకు ఎక్కడ్నుంచి ఆర్థిక బలం వస్తోంది? తోటివారికి సాయపడాలంటే మనం సంపన్నులమై ఉండాల్సిన అవసరం లేదు. కాస్త మంచి మనసు ఉంటే చాలు. మనం చేస్తున్న హెల్ప్‌ను చూసి ఎవరైనా స్ఫూర్తి పొంది, సహాయం చేస్తే అది మనకు సంతోషాన్ని ఇస్తుంది. ఎవరికి సాయం చేయాలో తెలియక? ఎలా చేయాలో తెలియక కొందరు మా ‘సోనూ సూద్ చారిటీ ఫౌండేషన్’కు డబ్బు అందజేస్తున్నారు. చూపు లేని ఓ అమ్మాయి తన ఐదు నెలల పెన్షన్ 15000 రూపాయలు, రైల్వేస్‌కు చెందిన మరో హ్యాండీకాప్డ్ పర్సన్ 60 వేల రూపాయలను మా ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చారు. దీన్నిబట్టి మన చుట్టూ ఎంతమంది మంచివాళ్లు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ► మీ సాయం పొందినవాళ్లల్లో కొందరు వాళ్ల పిల్లలకు మీ పేరు పెట్టుకున్నారు.. ‘ఐయామ్ నాట్ ఎ మెస్సయ్య’ (మహాపురుషుడు, దేవుడు, దేవ దూత వంటి అర్థాలు) అని మీరు పుస్తకం రాసినా మీకు కొందరు గుడి కట్టారు. ఎలా ఉంది? నా తల్లిదండ్రులు భౌతికంగా లేరు. వాళ్లు ఎక్కడ ఉన్నా ఇదంతా చూసి, ఆనందపడతారు. నాక్కూడా జీవితంలో ఏదో సాధించాననే ఫీలింగ్ కలిగింది. కానీ ప్రయాణించాల్సిన దూరం చాలానే ఉంది. ఇది ఆరంభం మాత్రమే. ఇక నా పుస్తకం ‘ఐయామ్ నాట్ ఎ మెస్సయ్య’ విషయానికి వస్తే.. అవును.. నేనేం దేవుణ్ని కాదు. ఐయామ్ ఎ కామన్‌మ్యాన్. ఓ సామాన్య వ్యక్తిగా ప్రజలతో నేను కనెక్ట్ అయ్యాను. ► ఇలా విరివిగా సేవా కార్యక్రమాలు చేసేవాళ్లు భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావడానికే ఇలా చేస్తారని కొందరు భావిస్తారు. మరి.. మీకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందా? నిజమే... నేను రాజకీయాల్లోకి రావడం కోసమే ఇవన్నీ చేస్తున్నానని కొందరు ఊహించుకుంటున్నారు. ఇంకొందరు నేను రాజకీయాల్లోకి వస్తే ఇంకా మంచి చేయగలనని చెబుతున్నారు. కానీ మంచి పనులు చేయడానికి, ఇతరులకు సహాయం చేయడానికి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని నేను నమ్ముతున్నాను. కానీ భవిష్యత్‌లో ఎవరు ఏం అవుతారో? ఏం జరుగుతుందో అంచనా వేయలేం. చూద్దాం.. రాబోయే రోజుల్లో నా జీవితం ఏ దారిలో వెళుతుందో! ► మీ ఈ సేవల వెనక ఓ రాజకీయ పార్టీ ఉందనే అభిప్రాయం చాలామందిలో ఉంది.. మీ సేవా కార్యక్రమాలు చూస్తున్న ప్రజలు మీరు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటే.. ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్లు సేవ చేయాలనే గుణం ఉంటే వెనక ఎవరైనా ఉంటారా? వస్తారా? అనే ఆలోచన రాదు. సహాయం చేయడం మొదలుపెట్టేస్తాం. మనం కామన్ మ్యాన్‌గా ఉన్నప్పుడే ఎంతో చేయగలుగుతున్నాం.. అదే రాజకీయాల్లో ఉంటే ఇంకా చేయొచ్చు. కానీ నేను పాలిటిక్స్ గురించి ఇప్పుడేమీ ఆలోచించడంలేదు. అలాగని నాకు రాజకీయాల మీద వ్యతిరేక భావన లేదు. ప్రజలు కోరుకున్నట్లు జరుగుతుందేమో భవిష్యత్ చెబుతుంది. ► అరుంధతి, సీత వంటి సినిమాల్లో ఓ విలన్‌గా హీరోయిన్లను చాలా ఇబ్బందులపాలు చేశారు. ఇప్పుడు చాలామంది అమ్మాయిలు మిమ్మల్ని సోదరుడిలా భావిస్తున్నారు... నా సోదరీ మణులకు థ్యాంక్స్. ఆ చిత్రాల్లో ఆ పాత్ర లను నాకు ఆ సినిమాల దర్శకులు ఇచ్చారు. కానీ రియల్ లైఫ్‌లో దేవుడు నాకో పవర్ఫుల్ స్క్రిప్ట్ రాశా డు. ఆ పాత్రలో జీవిస్తున్నాను. దేవుడి ఇచ్చిన ‘మోస్ట్ బ్లెస్డ్ రోల్’ ఇది అని భా విస్తున్నా. ► బెడ్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఫ్రీజర్ బాక్సుల పంపిణీ.. వలస కార్మికులను ఊళ్లకు పంపించడం.. ఇన్ని చేయడం సులభం కాదు.. మాకు మంచి నెట్వర్క్ ఉంది. మా టీమ్‌లో కొందరికి ట్రైనింగ్ ఇచ్చాం. మరికొందరు నా గైడ్ లైన్స్‌ను ఫాలో అవుతారు. ఇబ్బందుల్లో ఉన్నవారికి వెంటనే సహాయం అందజేయడంలో వీరి పాత్ర చాలా కీలకం. వారికి ధన్యవాదాలు. అలాగే ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు దేశంలోని ప్రజలందరూ ఒక తాటిపైకి రావాలన్నదే మా ఆశయం. సమష్టిగా పోరాడే సమ యం త్వరలో రావాలని కోరుకుంటున్నా. ► మీ బయోపిక్ తీయడానికి కొందరు ఉత్సాహంగా ఉన్నారు. మీకిష్టమేనా? బయోపిక్ గురించి నాతో సంప్రదింపులు జరిపారు. ప్రజలు నా బయోపిక్‌ను చూడాలనుకుంటున్నారని వారు చెబుతున్నారు. కానీ ప్రస్తుతానికి అదేం లేదు. కొన్నేళ్ల తర్వాత ప్రజలు నా గురించి ఏం అనుకుంటారో చూడాలి. ► ఇటీవల మీకు కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు మీ మానసిక స్థితి ఎలా ఉండేది? పాజిటివ్ వచ్చిన విషయాన్ని నేను పెద్దగా పట్టించుకోలేదు. ఐసోలేషన్‌లో ఉన్న సమయంలో ఫోన్ ద్వారా చాలామందికి సహాయం చేశాను. సహాయం కావాల్సిన వారు నా ఫోన్‌కు సందేశాలు పంపిస్తూనే ఉన్నారు. వారికి సహాయం చేయాలనే పట్టుదల నాలో తగ్గలేదు. కరోనా వచ్చినప్పుడు కూడా ఇరవైగంటలకు పైగా నేను ఫోన్‌తో కనెక్ట్ అయి, మా టీమ్‌తో టచ్‌లో ఉన్నాను. నా ఫోన్‌కి ప్రతిరోజూ దాదాపు 40 వేల మేసేజ్‌లు వస్తుంటాయి. కానీ ప్రతి ఒక్కరికీ మేం సహాయం చేయలేకపోవచ్చు. అయితే ఎవరికి ముందుగా అవసరం ఉందో వారిని గుర్తించి, ముందు వారిని కాంటాక్ట్ అవుతాం. మా సహాయం పొందిన చాలామంది తామంతట తామే ఫోన్ చేసి పక్కవారికి సాయం చేస్తాం అంటున్నారు. అలాగే కొందరు చేశారు కూడా. చాలా మంది వలస కూలీలకు మేం సహాయం చేశాం. వారిలో చాలామంది మాకు టచ్‌లో ఉన్నారు. అవసరమైనప్పుడు మేం వారికి ఫోన్ చేసి ‘మీరు సహాయం పొందారు. ఇప్పుడు మీరు చేయాల్సిన సమయం వచ్చింది’ అని చెప్పినప్పుడు పాజటివ్‌గా స్పందించారు... స్పందిస్తున్నారు. ఈ మంచి కార్యక్రమాల్లో మా టీమ్ మాత్రమే కాదు.. ప్రభుత్వ అధికారులు, డాక్టర్లు, వార్డ్ బాయ్స్, హాస్పిటల్ యాజమాన్యాలు.. ఇలా అందరికీ భాగం ఉంది. – డి.జి. భవాని -
Rajasthan Cm: కోటి వ్యాక్సిన్లు ఓ రోజుకి సరిపోవు
జైపూర్: కోవిడ్ దేశంలోని ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగులుస్తోంది. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడి వందల కొద్దీ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అయితే తాగాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ..కోవిడ్-19 వ్యాక్సిన్ల లభ్యతపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష్ వర్ధన్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి ఇటువంటి తప్పుడు ప్రకటనలు చేయకుండా ఉండాలని హితవు పలికారు. దేశ ప్రజలు ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ సమయంలో దేశంలో తగినంత ఆక్సిజన్ ఉందని ఆయన పేర్కొనడం బాధాకరమని అన్నారు. ఈ రోజు కోటి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నట్లు కేంద్ర మంత్రి అన్నారు. కానీ దేశంలోని అన్ని రాష్ట్రాలు ప్రజలకు వ్యాక్సిన్లను అందిస్తే అవి ఓ రోజుకి సరిపోవని గెహ్లాత్ దుయ్యబట్టారు. ఇప్పటివరకు రాజస్తాన్‌లో 9.24 లక్షల మంది కరోనా బారిన పడగా..8.29 లక్షల మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో కరోనా బారిన పడి 7,911 మంది బాధితులు తమ ప్రాణాలను కోల్పోయారు. (చదవండి: వైరల్: వేలంలో 213 కోట్లు పలికిన ‘‘ది సాకురా’’) -
Bharathi Cement: భారతి సిమెంట్ దాతృత్వం
కడప సిటీ: వైఎస్సార్ జిల్లాకు రూ. 22 లక్షల విలువైన 22 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ వితరణగా అందించిన భారతి సిమెంట్ వారి దాతృత్వం అభినందనీయమని కలెక్టర్ సి.హరికిరణ్, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, విప్ కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ చాంబర్లో భారతి సిమెంట్ పరిశ్రమ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సాయి రమేష్, హెచ్ఆర్ చీఫ్ మేనేజర్లు భార్గవరెడ్డి, రవీంద్రకుమార్ 22 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను వారికి అందజేశారు. కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ వైఎస్సార్ జిల్లాలో కోవిడ్ రెండోదశను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారతి సిమెంట్ యాజమాన్యం ముందుకు వచ్చి ఇప్పటికే స్థానిక రిమ్స్ ఆస్పత్రిలో రూ.60 లక్షల ఖర్చుతో 20 కిలో లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ స్టోరేజ్ ట్యాంకు నిర్మాణం చేసిందని తెలిపారు. -
రైల్వే ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్–19 నివారణకు జరుగుతున్న ప్రయత్నాలలో రైల్వే పూర్తిస్థాయిలో సహకారం అందిస్తోంది. అవసరమైన ప్రాంతాలకు అత్యంత వేగంగా ఆక్సిజన్ తరలిస్తున్న రైల్వేలు మరోవైపు ప్రయాణికులు, సరకులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. ఇదే సమయంలో కోవిడ్ బారినపడే తన సిబ్బందికి అవసరమైన వైద్య సౌకర్యాలను అందించే అంశంపై రైల్వేశాఖ దృష్టి సారించింది. తమ ఉద్యోగుల కోసం రైల్వేశాఖ దేశంలోని వివిధ ప్రాంతాల్లో 86 వరకు ఆసుపత్రులను నిర్వహిస్తోంది. వీటిలో కొత్తగా ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే నాలుగు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి. మరో 52 ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతులు మంజూరు అయ్యాయి. మిగిలిన 30 ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. కోవిడ్ ఆసుపత్రులుగా సేవలు అందిస్తున్న అన్ని రైల్వే ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి రూ.2 కోట్ల వరకూ నిధులు విడుదల చేసే అధికారాన్ని జనరల్ మేనేజర్లకు రైల్వే శాఖ కల్పించింది. వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొనే వచ్చే అంశంపై కూడా రైల్వేశాఖ దృష్టి సారించింది. కోవిడ్ చికిత్స అందించడానికి పడకల సంఖ్యను 2,539 నుంచి 6,972కి పెంచారు. ఇదేవిధంగా కోవిడ్ ఆస్పత్రుల్లో ఐసీయూ పడకల సంఖ్యను 273 నుంచి 573కి పెంచింది. వెంటిలేటర్ల సంఖ్య 62 నుంచి 296కు పెంచింది. కోవిడ్ బారిన పడిన రైల్వే ఉద్యోగులు అవసరమైతే వైద్యుల సిఫార్సు మేరకు ఎంపానెల్డ్ ఆసుపత్రులలో చేరడానికి కూడా వీలు కల్పిస్తూ ఇటీవల రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
Delhi High Court: పోలీసులపై ఢిల్లీ ధర్మాసనం ఆగ్రహం
న్యూఢిల్లీ: ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వేవ్ మరింత తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య లక్షల్లో పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అయినా వైరస్ బారిన పడి చనిపోతున్నవారి సంఖ్య తగ్గట్లేదు. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్, మందుల కొరతతో వందలాది మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఢిల్లీ ఆస్పత్రుల్లో పడకల, ఆక్సిజన్ కొరత నెలకొనడంతో.. సకాలంలో వైద్యం అందక అధిక సంఖ్యలో కరోనా రోగులు మరణించారు. ఒక్క సర్ గంగారాం ఆస్పత్రిలోనే 20 పైగా కరోనా రోగులు ఆక్సిజన్ కొరతతో చనిపోయారు. తాజాగా ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కి తరలిస్తుండటంతో ఆస్పత్రుల్లో కొరత ఏర్పడింది. ప్రభుత్వం దీన్ని ఎదుర్కోవడంలో విఫలమవుతోందని ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్సిజన్ డిస్ట్రిబ్యూటర్లకు ఆక్సిజన్ పంపిణీ చేసి చేతులు దులిపేసుకుంటే ఎలా అని ప్రశ్నించింది. ఆక్సిజన్ బ్లాక్ మార్కెట్‌కి తరలకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. కాగా, ఆక్సిజన్ సిలిండర్ అక్రమంగా నిల్వ చేసిన కేసుకు సంబంధించి.. ఇండియన్ యూత్ కాంగ్రెస్ (ఐవైసీ) అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్‌తో సహా.. మరో తొమ్మిది మంది రాజకీయ నాయకులకు ఢిల్లీ పోలీసులు క్లీన్ చిట్ ఇవ్వడంపై సోమవారం ఢిల్లీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. "మీరు బాధ్యతతో వ్యవహరించాలి. ఆక్సిజన్, కరోనా మందులు.. నిల్వచేసుకుని వ్యాపారం చేయడానికి ఇది సమయం కాదు. రాజకీయ పార్టీలు దీన్ని ఆసరాగా తీసుకుని వ్యాపారంగా ఎలా మార్చుకుంటాయి? ప్రిస్క్రిప్షన్ లేకుండా వారు ఆక్సిజన్ ఎలా కొనుగోలు చేయవచ్చు? నిజం ఏంటో..బయట పెట్టే ఆసక్తి మీకు లేదు అనిపిస్తోంది." అంటూ విపిన్ సంఘి, జస్మీత్ సింగ్ ధర్మాసనం ఢిల్లీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. "కొంతమంది రాజకీయ ప్రముఖులు దీనిలో ఉన్నందున, ఈ విధంగా దర్యాప్తు చేయడం సరికాదు. ప్రజలకు సేవ చేయడం మీ విధి. మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. కరోనా మందుల కొరత కారణంగా ఎంత మంది మరణించారో గ్రహించారా అని ప్రశ్నించింది. అంతే కాకుండా దీనిపై సరైన విచారణ జరపాలని ఢీల్లీ ధర్మాసనం పోలీసులను ఆదేశించింది. పేద ప్రజల అందించే ఔషధాలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్)కు అప్పగించాలని ఆశిస్తున్నట్లు కోర్టు తెలిపింది. (చదవండి: Myanmar: మా పౌరులు మరణిస్తున్నారు..దయచేసి స్పందించండి) -
పాజిటివ్ బాధితుల ‘పడక’ పాట్లు..!
కోవిడ్ బారిన పడ్డ హన్మకొండకు చెందిన రాజారావుకు నాలుగు రోజుల తర్వాత శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో సంప్రదిస్తే జనరల్ బెడ్లు తప్ప ఆక్సిజన్, ఐసీయూ బెడ్లు అందుబాటులో లేవు. దీంతో రాజారావు కొడుకు 60 కిలోమీటర్ల దూరాన ఉన్న తొర్రూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. కూకట్‌పల్లికి చెందిన జి.అనసూయకు రెండ్రోజులుగా ఆక్సిజన్ స్థాయిలు 91కి పడిపోయాయి. ఆక్సిజన్ పెట్టించాలని కుటుంబ సభ్యులు సమీపంలోని ఆస్పత్రుల్లో ప్రయత్నించినా ఎక్కడా బెడ్ అందుబాటులో లేదు. దీంతో దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నంలోని ఓ ఆస్పత్రిలో బెడ్ దొరకడంతో అడ్మిట్ చేశారు. రోజుకు రూ.40వేల చొప్పున బెడ్ చార్జీలు చెల్లిస్తున్నట్లు సమాచారం. సాక్షి, హైదరాబాద్: సెకండ్ వేవ్‌లో కరోనా సోకిన వారు నిర్లక్ష్యం చేస్తే తీవ్రఇబ్బందులు పడుతున్న ఘటనలు అనేకం. వైరస్ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే గొంతు, ఊపిరితిత్తులు, పొట్టలో తీవ్ర ప్రభావాన్ని చూపి అనారోగ్య సమస్యలను వేగంగా పెంచుతోంది. దీంతో బాధితులు ఆస్పత్రుల బాట పడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్ల లభ్యత ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ చెబుతున్నా.. మెరుగైన వైద్యం దొరుకుతుందన్న ఉద్దేశంతో రోగులు ముందుగా ప్రైవేట్ వైపు చూస్తున్నారు. బెడ్ల కొరత... రాష్ట్రంలో కోవిడ్ యాక్టివ్ కేసులు 54,832. వైద్యా రోగ్య శాఖ గణాంకాల ప్రకారం వీరిలో 28,825 (52.55 శాతం) మంది ఆస్పత్రుల్లో ఉన్నారు. ఆస్పత్రుల్లో చేరిన వారిలో 50.5 శాతం మంది ఆక్సిజన్ బెడ్లపై ఉండగా.. 29.47 శాతం మంది ఐసీయూ ల్లో ఉన్నారు. వాస్తవానికి రాష్ట్రంలోని కరోనా బెడ్ల సంఖ్య ప్రకారం.. యాక్టివ్ కేసులన్నింటిలో 96 శాతం మందిని ఆస్పత్రిలో చేర్పించొచ్చు. అంతేకాదు ఈ బెడ్లలో సగం ఖాళీగా ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ చెబుతోంది. కానీ ప్రైవేట్ ఆస్పత్రులు మాత్రం బెడ్లు ఖాళీగాలేవంటూ బాధితులను తిప్పిపంపిస్తున్నాయి. గత్యంతరంలేక కొందరు ఆక్సిజన్ సిలిండర్లు బుక్ చేసుకుని ఇంటివద్దే ఊపిరి పీలుస్తుండగా.. మరికొందరు ఆస్పత్రుల వద్దే పడిగాపులు కాస్తున్నారు. దీంతో సకాలంలో వైద్యం అందక, ప్రాణవాయువు దొరక్క మరణిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వసతుల్లేకనే ‘ప్రైవేట్’కు... కోవిడ్ బారినపడుతున్న వారిలో ఎక్కువ మంది ప్రైవేట్ ఆస్పత్రులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే కోవిడ్ చికిత్స కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టిమ్స్ (తెలంగాణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)ను ఏర్పాటు చేసింది. ఇందులో పెద్ద సంఖ్యలో బాధితులు ఉన్నారు. ఆస్పత్రి ప్రారంభించి ఏడాది కావొస్తున్నా.. రక్త పరీక్ష చేసే పరిస్థితి లేదు. సమీపంలోని ఓ ప్రైవేట్ ల్యాబ్‌కు నమూనాలను పంపి పరీక్షలు చేయిస్తున్నారు. ఇలా సరైన వసతులు లేకపోవడంతోనే ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నట్లు పలువురు చెబుతున్నారు. సగం బెడ్లు ఖాళీగా ఉన్నాయట... రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో పడకల లభ్యతను ప్రజలకు వివరించాలని హైకోర్టు ఆదేశించడంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా బెడ్ అవైలబిలిటీ డాష్‌బోర్డును ఏర్పాటు చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల వారీగా మొత్తం పడకలు, భర్తీ అయినవి, ఖాళీగా ఉన్నవి... అనే వివరాలను ప్రదర్శిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో అన్ని కేటగిరీల్లో ఉన్న బెడ్లు 53,782. వీటిలో 28,825 బాధితులతో భర్తీ కాగా, 24,957 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అన్ని ఆస్పత్రుల్లోని బెడ్లలో 46.4 శాతం బెడ్లు ఖాళీగా ఉన్నట్లు డాష్‌బోర్డు సమాచారం చెబుతోంది. కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో 46.22 శాతం ఖాళీగా ఉండగా... ప్రైవేట్ ఆస్పత్రుల్లో 46.47 శాతం బెడ్లు ఖాళీగా ఉన్నట్లు వైద్య,ఆరోగ్య శాఖ ప్రకటించడం గమనార్హం. బెడ్ అవైలబులిటీ డాష్‌బోర్డు ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రై వేటు ఆస్పత్రుల్లో బెడ్ల పరిస్థితి ఇది మొత్తం భర్తీ ఖాళీ శాతం జనరల్ బెడ్లు... ప్రభుత్వ 5,473 1,228 4,245 77.56 ప్రైవేట్ 15,884 4,534 11,350 71.45 ఆక్సిజన్ బెడ్లు.. ప్రభుత్వ 7,560 5,311 2,249 29.74 ప్రైవేట్ 13,425 9,257 4,168 31.04 ఐసీయూ బెడ్లు ప్రభుత్వ 2,170 1,636 534 24.60 ప్రైవేట్ 9,270 6,859 2,411 26.00 ఇన్ని ఆంక్షలెందుకు...? వైద్య,ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన డాష్‌బోర్డు సమాచారం ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో దాదాపు సగం బెడ్లు ఖాళీగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇంత పెద్ద సంఖ్యలో బెడ్లు ఖాళీగా ఉన్నప్పుడు పొరుగు రాష్ట్రాలకు చెందిన కరోనా బాధితుల రాకపై ఆంక్షలు విధించడం, రాష్ట్రంలో కోవిడ్ బారిన పడ్డ వారు హోం ఐసోలేషన్‌లో మాత్రమే ఉండాలని సూచించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. (చదవండి: England: లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేయాలా..వద్దా!) -
విశాఖ చేరుకున్న ఐఎన్ఎస్ ఐరావత్
సాక్షి, విశాఖపట్నం : ఐఎన్ఎస్ ఐరావత్ నౌక విశాఖ తీరానికి చేరుకుంది. ఈ నెల 5వ తేదీన సింగపూర్ నుంచి విశాఖపట్నం బయలుదేరిన నౌక 8 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులు, 3898 ఆక్సిజన్ సిలిండర్లు, ఇతర మెడిసిన్స్ తీసుకువచ్చింది. సముద్ర సేతు ప్రాజెక్ట్ 2లో భాగంగా ఈస్ట్రన్ నేవల్ కమాండ్ సేవలు అందిస్తోంది. -
ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు పనులు చేపట్టిన ఎన్హెచ్ఏఐ
సాక్షి, అమరావతి : నేషనల్ హైవే అథారిటీ ఆంధ్రప్రదేశ్‌లో 42 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు పనులను మొదలుపెట్టింది. ఆదివారం తొలివిడతగా 4 ప్లాంట్ల నిర్మాణాన్ని చేపట్టింది. హిందూపురంలో 1000 ఎల్పీఎం సామర్థ్యంతో ప్లాంట్.. అమలాపురంలో 500 ఎల్పీఎం, మదనపల్లెలో 500 ఎల్పీఎం.. తాడేపల్లి గూడెంలో 1000 ఎల్పీఎం సామర్థ్యంతో ప్లాంట్ల నిర్మాణాన్ని మొదలుపెట్టింది. ఎన్హెచ్ఏఐ ఇప్పటికే 3 ప్లాంట్ల నిర్మాణ పనులు చేపట్టింది. అధికారులు రేపు అమలాపురంలో ప్లాంట్ల నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. మిగిలిన 38 ప్లాంట్ల ఏర్పాటుకు కూడా స్థలాలు ఖరారయ్యారు. ప్రభుత్వం గుర్తించిన ఆస్పత్రుల వద్ద ప్లాంట్ల ఏర్పాటు జరగనుంది. -
ఆక్సిజన్ కొరతపై ప్రధాని మోదీకి ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ
సాక్షి, వైఎస్సార్ జిల్లా : ఆక్సిజన్ కొరతపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌కు ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో ఆక్సిజన్ కొరత వల్ల జరగబోయే నష్ట తీవ్రతను వివరించారు. ఆక్సిజన్ డిమాండ్, సరఫరా విశ్లేషణపై వివరాణాత్మక నివేదికనిచ్చారు. కరోనా బాధితుల ప్రాణాలు కాపాడేందుకు వైఎస్సార్ జిల్లాకు రోజుకు.. 54 కేఎల్ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ కేటాయింపులు పెంచాలని కోరారు. -
‘ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నారు’
సాక్షి, హైదరాబాద్: వ్యాక్సినేషన్ ప్రక్రియలో కేంద్రం వైఖరిపై తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ అంశంలో కేంద్రానికి ఒకలాగా.. రాష్ట్రాలకు మరోలాగా ధరలు నిర్ణయించడం ఏంటని ప్రశ్నించారు. ఆక్సిజన్, వ్యాక్సిన్ కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే అని ఈటెల స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కరోనా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నాం. కరోనా కేసులను దాస్తే దాగేవి కావు. వైరస్ విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నాం. కరోనా కేసులు ఎక్కడికక్కడ గుర్తించి ట్రీట్మెంట్ చేస్తున్నాం. కోవిడ్ కట్టడిలో ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించనవసరం లేదు. కరోనాతో మెజార్టీ ప్రజలు ఆర్థికంగా నష్టపోయారు. ప్రస్తుతం కేసులు పెరగడంతో ప్రజలు స్వచ్చందంగా లాక్డౌన్ పాటిస్తున్నారు’’ అని ఈటెల తెలిపారు. ‘‘మహారాష్ట్రతో పోలిస్తే తెలంగాణలో కరోనా కేసులు తక్కువగా ఉన్నాయి. గాంధీ ఆస్పత్రిలో ఇబ్బంది పడుతున్నవారు కేవలం ఐసీయూలో ఉన్నవారే. తెలంగాణ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌కు, వైద్యులకు, మందులకు కొరత లేదు. ఇతర రాష్ట్రాల పేషెంట్లకు కూడా వైద్యం చేస్తున్నాం. కరోనా వైద్యం కోసం అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు. ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు కూడా మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. ప్రజలను కాపాడాల్సిన ఎజెండా కేంద్రానికి ఉండాలి’’ అన్నారు. ‘‘కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో కేంద్రం వివక్ష చూపకూడదుభవిష్యత్తులో రాష్ట్రానికి 300 టన్నుల ఆక్సిజన్ అవసరం రావొచ్చు. కేంద్రానికైనా, రాష్ట్రానికైనా వచ్చే ఆదాయం ప్రజల నుంచే వస్తుంది. కరోనా అనేది.. దేశం ఎదుర్కొనే విపత్తు అని కేంద్రం తెలుసుకోవాలి. మున్సిపల్ ఎన్నికలు చాలా చిన్నవి. ప్రభుత్వాలు ఎంత చేసినా ప్రజల సహకారం లేకుండా మహమ్మారిని కట్టడి చేయలేం. ప్రజలు ధైర్యంగా ఉండాలని కోరుతున్నాను’’ అన్నారు ఈటెల. చదవండి: కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం ఇలా రిజిస్టర్ చేసుకోండి! -
ఆక్సిజన్ కొరతపై ఏపీ ప్రభుత్వం దృష్టి
సాక్షి, అమరావతి: కరోనా సెకండ్ వేవ్‌లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. ఇతర రాష్ట్రాల్లో తలెత్తిన సమస్యలు దృష్టి పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆక్సిజన్ కొరతపై ప్రత్యేక దృష్టి పెట్టింది. భవిష్యత్తులో రాష్ట్రానికి అవసరమైన ఆక్సిజన్‌పై కసరత్తు చేస్తుంది. కోవిడ్ పీక్ స్టేజ్‌లో 200 టన్నుల ఆక్సిజన్ అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. మిగతా సమయంలో రోజుకు 80 నుంచి 100 టన్నుల ఆక్సిజన్ అవసరమని తెలిపారు. ఏపీకి నాలుగు ప్రాంతాల నుంచి ఆక్సిజన్ తెచ్చుకునేలా ప్రణాళికలు రచించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్, భువనేశ్వర్, బళ్లారి, చెన్నై నుంచి ఆక్సిజన్ వచ్చేలా యాక్షన్ ప్లాన్ రూపిందించారు. విశాఖ స్టీల్ ఇప్పటికే ఆక్సిజన్ సరఫరా ప్రారంభించగా.. బళ్లారి, చెన్నైల నుంచి మరింత ఆక్సిజన్ తెచ్చుకునేలా కసరత్తు చేస్తున్నారు. ఆక్సిజన్ నిల్వలు సిద్ధం చేసుకునేలా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. -
పల్స్ చూసుకోండి.. పక్షవాతం నుంచీ కాపాడుకొండి!
ప్రపంచాన్ని ఇటీవల కరోనా చుట్టుముట్టాక పల్స్ ఆక్సిమీటర్ కొనుక్కుని మన రక్తంలో ఆక్సిజన్‌తో పాటు పల్స్ చూసుకోవడం అన్నది చాలా ఇళ్లలో జరుగుతోంది. ఇలా పల్స్ ఆక్సిమీటర్‌తో కేవలం రక్తంలో ఆక్సిజన్‌ను పరీక్షించుకోవడం మాత్రమే కాదు... దాంతో పక్షవాతం ప్రమాదాన్ని కూడా అద్భుతంగా నివారించుకోవచ్చని జర్మనీకి చెందిన న్యూరాలజిస్టులు చెబుతున్నారు. వాళ్లే కాదు... అమెరికాకు చెందిన యూఎస్ నేషనల్ స్ట్రోక్ అసోసియేషన్ వారు కూడా అదే మాట చెబుతున్నారు. వేర్వేరుగా వారిద్దరూ నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం తేటతెల్లమైందట. అమెరికాకు చెందిన నేషనల్ స్ట్రోక్ అసోసియేషన్ వారు కనుగొన్న విషయాల ప్రకారం... మొదటిసారి పక్షవాతం (స్ట్రోక్)కు గురై కోలుకున్నవారిలో 24 శాతం మంది మహిళల్లో, 42 శాతం మంది పురుషుల్లో ఐదేళ్లలోపు పక్షవాతం మరోసారి వచ్చే అవకాశం ఉన్నట్లు తేలింది. మొదటిసారి స్ట్రోక్ వచ్చిన 256 మందిపై నిర్వహించిన పల్స్ రీడింగ్ ద్వారా తేడాలు తెలుసుకుని, రాబోయే ఈ తరహా ప్రమాదాలను గుర్తించి, వాటిని నివారించడం సాధ్యమైనట్లు పరిశోధకులు తెలిపారు. ఈ వివరాలను ‘న్యూరాలజీ’ అనే జర్నల్‌లోనూ పొందుపరిచారు. చదవండి: ఒళ్లు కరిగించే మధుమేహ మాత్ర! రక్తపోటు వచ్చేముందు ప్రీ–హైపర్‌టెన్షన్ దశ అంటే..? -
సిగరెట్ అలవాటు మానుకోవాలని ఆశిస్తున్నాం – జ్యోతికృష్ణ
గోపీచంద్, రాశీఖన్నా, అనూ ఇమ్మాన్యుయేల్ ముఖ్య తారలుగా ఏ.యం. జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఎస్.ఐశ్వర్య నిర్మించిన ‘ఆక్సిజన్’ ఇటీవల విడుదలైంది. స్టేట్ హెల్త్ అసోసియేషన్ మరియు ఐడీఏ, టొబాకో ఇంటర్వెన్షన్ ఇంటేటివ్ సంస్థల కోసం హైదరాబాద్‌లో ‘ఆక్సిజన్’ ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. జ్యోతికృష్ణ మాట్లాడుతూ– ‘‘సినిమా విడుదలైనప్పుడు మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. చాలా ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. విజయవాడ స్టేట్ హెల్త్ అసోసియేషన్ నుంచి శివశంకర్ గారు ఫోన్ చేసి ‘మేం చేయాల్సిన పనిని మీ సినిమా ద్వారా చేశారు’ అన్నారు. ఈ చిత్రానికి చాలా అవార్డులు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చాలామంది పేషెంట్స్‌లో కనిపిస్తున్న సమస్యలను సినిమాలో చాలా అర్థవంతంగా చూపించాం. ఈ సినిమా చూశాక కొందరైనా సిగరెట్ అలవాటు మానుకోవాలని ఆశిస్తున్నాం’’ అన్నారు. -
బాగున్నా బాగా లేదనడం న్యాయం కాదు
‘‘ సోషల్ మీడియా బాగా అడ్వాన్స్ అయిపోయింది. సినిమా షో కంప్లీట్ అయ్యే లోపే సినిమా రిజల్ట్‌ను తేల్చేస్తున్నారు. పాత రోజుల్లో సినిమా రివ్యూలను వారం లేదా పది రోజుల తర్వాత రాసేవారు. ఇప్పుడు షో తర్వాతే రేటింగ్‌లు ఇచ్చేస్తున్నారు. బాగాలేని సినిమాని బాగుందని రాయమని అడగం. కానీ, బాగున్న సినిమాని బాగాలేదని రాయడం న్యాయం కాదు. ఇది నా సొంత అభిప్రాయం’’ అన్నారు నిర్మాత ఏ.ఎం. రత్నం. గోపీచంద్ కథానాయకుడిగా ఏ.ఎం. జ్యోతికృష్ణ దర్శకత్వంలో శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఏ.ఎం. రత్నం సమర్పణలో ఎస్. ఐశ్వర్య నిర్మించిన చిత్రం ‘ఆక్సిజన్’. గురువారం విడుదల అయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా ఏ.ఎం. రత్నం విలేకర్లతో చెప్పిన విశేషాలు... ► కమర్షియల్ అంశాలతో పాటు మెసేజ్ ఉన్న సినిమా ‘ఆక్సిజన్’. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. మౌత్ టాక్ బాగుంది. కలెక్షన్స్ బాగా వస్తున్నాయి. ప్రజెంట్ డేస్‌లో సందేశాత్మక చిత్రాలకు ప్రేక్షకాదరణ తగ్గింది. ‘భారతీయుడు’, ‘ఒకే ఒక్కడు’ సినిమాలు ఎంటర్టైన్ చేస్తూనే ప్రేక్షకులకు మంచి మేసేజ్ ఇచ్చాయి. సినిమాలు చూసి ప్రజలు సడన్‌గా మారతారని అనుకోను. వారు ఆలోచిస్తే చాలు అన్నదే మా ప్రయత్నం. అప్పట్లో ‘కర్తవ్యం’ సినిమా చాలామంది మహిళలను ఇన్స్పైర్ చేసింది. ► ‘ఆక్సిజన్’ ఏ లాంగ్వేజ్‌లో అయినా బాగుంటుంది. ‘హిందీలో తీద్దాం. అక్షయ్‌కుమార్, అజయ్ దేవ్‌గణ్‌లకు చూపిద్దాం’ అని నా ఫ్రెండ్ అన్నాడు. సినిమా రిలీజ్ కాకముందు కన్నడ హీరో శివరాజ్‌కుమార్‌కు చూపిద్దామనుకున్నా. తమిళ రీమేక్ ఆలోచన ఉంది. పవన్ కల్యాణ్‌తో ‘వేదాళం’ సినిమా తెలుగు రీమేక్ అంటే.. అది ఆయనే డిసైడ్ చేస్తారు. ఇకపై తెలుగు సినిమాలపై కాన్సంట్రేట్ చేయాలనుకుంటున్నాను. -
సినిమా రిలీజ్ నా చేతుల్లో ఉండదు
‘‘నా సినీ ప్రయాణంలో ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఈ జర్నీతో సంతృప్తిగానే ఉన్నాను. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయని ఇతరులను బ్లేమ్ చేయను. ఎందుకంటే... అవన్నీ నాకు నచ్చి చేసినవే. చేసిన తప్పులను మళ్లీ చేయకూడదనుకుంటా’’ అన్నారు హీరో గోపీచంద్. ఏయం జ్యోతికృష్ణ దర్వకత్వంలో ఆయన హీరోగా శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్. ఐశ్వర్య నిర్మించిన చిత్రం ‘ఆక్సిజన్’. అనూ ఇమ్మాన్యుయేల్, రాశీ ఖన్నా కథానాయికలు. ఈ చిత్రాన్ని గురువారం విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హీరో గోపీచంద్ చెప్పిన విశేషాలు.. ► కథను, ఏయం రత్నంగారిని నమ్మి, ఈ సినిమా చేశాను. ఆయనతో సినిమా చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈ సినిమాతో కుదిరింది. మా నాన్న (ప్రముఖ దర్శకుడు టి.కృష్ణ) గారితో ఉన్న అనుబంధాన్ని ఆయన చెప్తుండేవారు. నాన్నగారి గురించి వినడం నాకో మంచి అనుభూతి. ఇందులో నా పాత్ర పేరు సంజీవ్. అతను ఏం చేస్తాడనేది మాత్రం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. స్టార్టింగ్ టు ఎండింగ్ అలరించేలా ఉంటుంది. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులకు కిక్ ఇస్తుంది. ఈ సినిమా హిట్ అయి... నాకు, కొన్నవాళ్లకు ఆక్సిజన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. యువన్ మంచి పాటలు ఇచ్చారు. ► ‘ఆక్సిజన్’ ముందే విడుదల కావాల్సి ఉంది. కానీ, లేట్ అయింది. నా సినిమాలు త్వరగా రిలీజ్ కావాలని నాకూ ఉంటుంది. అయితే... నటించడం మాత్రమే నా చేతుల్లో ఉంటుంది. రిలీజ్ చేయడం నిర్మాతల చేతుల్లో ఉంటుంది. ‘ఆరడుగుల బుల్లెట్’ సినిమా నిర్మాత సెలక్షన్ విషయంలో నాదే రాంగ్ అనిపించింది. ► ‘లౌక్యం’ సినిమా చేసిన తర్వాత ‘జిల్’ చేశా. అది ఓకే. బట్, ‘సౌఖ్యం’ సినిమా రాంగ్ స్టెప్. ఆ తర్వాత ‘ఆక్సిజన్’ స్టార్ట్ చేశా. అనుకున్న టైమ్‌లో ఈ సినిమా రిలీజ్ అయితే గ్యాప్ వచ్చేది కాదు. ‘గౌతమ్‌నంద’ చిత్రకథను నమ్మాను. ప్రేక్షకులకు నచ్చుతుందనుకున్నా. కానీ, రిలీజ్ అయిన తర్వాత సెకండాఫ్‌లో ఏదో మిస్ అయ్యిందనిపించింది. హిట్టూ, ఫ్లాపు అన్నవి మన చేతుల్లో ఉండవు. చేసే ప్రతి సినిమాని మంచి కథే అని నమ్మి చేస్తాను. ► ప్రభాస్, నేనూ సినిమాల గురించే కాదు మిగతా విషయాల గురించీ మాట్లాడుకుంటుంటాం... చర్చించుకుంటాం. ‘బాహుబలి’ ప్రెజర్ అయిపోయింది కదా! తను త్వరలోనే పెళ్లి చేసుకుంటాడు (నవ్వుతూ). మా ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా చేయాలన్న ఆలోచన ఉంది. ► ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో సినిమాలు వస్తున్నాయి. రాజశేఖర్‌గారి ‘గరుడవేగ’ చూశా. బాగా నచ్చింది. ఆయనకు కాల్ చేసి, ‘రాజశేఖర్ బ్యాక్’ అని చెప్పా. తెలుగులో వెబ్ సిరీస్‌లు స్టార్ట్ అవుతున్నాయి. అవి ఎన్ని వచ్చినప్పటికీ, థియేటర్ ఫీల్ వేరు. వెబ్ సిరీస్‌లలో నటించాలనే ఆలోచన ప్రస్తుతం లేదు. అయినా వెబ్ సిరీస్‌లు అనేవి సినిమాల్లో ఒక పార్ట్ మాత్రమే. ప్రపంచం ఉన్నంత కాలం సినిమాలు ఉంటాయి. ► మా అబ్బాయి అన్ని సినిమాలు చూస్తాడు. ఫైటింగ్ మూవీస్ అయితే ఎంజాయ్ చేస్తాడు. స్లోగా ఉంటే ‘బాలేదు’ అంటూ పక్కకి వెళ్లిపోతాడు. ► దర్శకుడు చక్రితో సినిమా చేస్తున్నాను. వచ్చే నెలలో షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. నాకు డైరెక్టర్ అవ్వాలని లేదు. అది టఫ్ జాబ్. -
ఓ ఇంటిదాన్నయ్యా!
‘మలయాళంలో ‘యాక్షన్ హీరో బిజు’ సినిమా చేశా. ఆ తర్వాత అమెరికా వెళ్లిపోయా. ఆ చిత్రం చూసిన జ్యోతికృష్ణగారు నన్ను కాంటాక్ట్ చేసి, ‘ఆక్సిజన్’లో అవకాశం ఇచ్చారు. తెలుగులో నా తొలి సినిమా అదే. ‘ఆక్సిజన్’లో నటిస్తున్నప్పుడే ‘మజ్ను’ సినిమాలో అవకాశం వచ్చింది’’ అని కథానాయిక అనూ ఇమ్మాన్యుయేల్ అన్నారు. గోపీచంద్, అనూ ఇమ్మాన్యుయేల్, రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా ఏ.ఎం. జ్యోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్. ఐశ్వర్య నిర్మించిన ‘ఆక్సిజన్’ నవంబర్‌లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా అను చెప్పిన చిత్ర విశేషాలు... ► ఇదొక హెవీ యాక్షన్ మూవీ. మంచి సోషల్ మెసేజ్ కూడా ఉంది. ఇందులో నా పాత్ర పేరు గీత. డాక్టర్‌గా కనిపిస్తాను. తెలుగు రాదు కాబట్టి భయపడ్డాను. అయితే జ్యోతికృష్ణగారి హెల్ప్ చేశారు. చాలా ఈజీ అయింది. ఇప్పుడు తెలుగు ఓకే. గోపీచంద్‌గారితో నటించడం చాలా ఆనందంగా ఉంది. ‘ఆక్సిజన్’ మంచి సినిమా. అందరూ ఆదరిస్తారనే నమ్మకం ఉంది. తెలుగులో ఎక్కువ సినిమాలు, మంచి మంచి పాత్రలు వస్తున్నాయి. ఇక్కడ వాతావరణం కూడా బావుంది. కాబట్టి, నా ప్రాధాన్యత తెలుగు సినిమాలకే. తమిళంలో ఓ సినిమా చేశా. మలయాళంలోనూ చేయాలనుకుంటున్నా. ► ఒక నటిగా అన్ని రకాల పాత్రలూ చేయాలనుంది. గ్లామర్ రోల్స్ చేయడానికీ సిద్ధమే. నా దృష్టిలో గ్లామర్ రోల్స్, వల్గర్ రోల్స్‌కి చాలా తేడా ఉంది. గ్లామర్ ఓకే కానీ, వల్గర్‌గా ఉండకూడదని అనుకుంటాను. ► నేను హైదరాబాద్‌లో సెటిల్ అయ్యా. ఇక్కడ ఫ్లాట్ కూడా కొనుక్కున్నా. తెలుగు ఇండస్ట్రీలో అందరితో స్నేహంగానే ఉంటా. కానీ, నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఎవరూ లేరిక్కడ. ► ప్రస్తుతం నా కెరీర్ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నా. పవన్ కల్యాణ్‌గారితో నటించడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో ఓ సినిమా, మారుతిగారి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందుతోన్న చిత్రంలోనూ నటిస్తున్నా. తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవాలనుకుంటున్నా. -
అంబులెన్స్‌లో ఆక్సిజన్ లేక మహిళ మృతి
పుట్టపర్తి(అనంతపురం): అనంతపురం నుంచి బెంగళూరుకు వెళుతుండగా మార్గమధ్యంలో పుట్టపర్తి వద్ద ఆక్సిజన్ అయిపోవడంతో ఓ మహిళ మృతిచెందింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా పుట్టపర్తి సమీపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. అనంతపురం వేణుగోపాలనగర్‌కు చెందిన శోభారాణి అనారోగ్యానికి గురికావడంతో జిల్లా ఆస్పత్రి వైద్యుల సూచనమేరకు మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో బెంగుళూరుకు పయనమయ్యారు. మార్గమధ్యంలో ఆక్సిజన్ అయిపోయింది. దాంతో శోబారాణి అంబులెన్స్‌లోనే మృతిచెందింది. అంబులెన్స్ సిబ్బంది ఆక్సిజన్ ఉందోలేదో చూసుకోకపోవడంవల్లే శోభారాణి మృతిచెందిందని బంధువులు ఆందోళనకు దిగారు. పుట్టపర్తి పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు.