ప్రపంచాన్ని ఇటీవల కరోనా చుట్టుముట్టాక పల్స్ ఆక్సిమీటర్ కొనుక్కుని మన రక్తంలో ఆక్సిజన్‌తో పాటు పల్స్ చూసుకోవడం అన్నది చాలా ఇళ్లలో జరుగుతోంది. ఇలా పల్స్ ఆక్సిమీటర్‌తో కేవలం రక్తంలో ఆక్సిజన్‌ను పరీక్షించుకోవడం మాత్రమే కాదు... దాంతో పక్షవాతం ప్రమాదాన్ని కూడా అద్భుతంగా నివారించుకోవచ్చని జర్మనీకి చెందిన న్యూరాలజిస్టులు చెబుతున్నారు. వాళ్లే కాదు... అమెరికాకు చెందిన యూఎస్ నేషనల్ స్ట్రోక్ అసోసియేషన్ వారు కూడా అదే మాట చెబుతున్నారు. వేర్వేరుగా వారిద్దరూ నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం తేటతెల్లమైందట.
అమెరికాకు చెందిన నేషనల్ స్ట్రోక్ అసోసియేషన్ వారు కనుగొన్న విషయాల ప్రకారం... మొదటిసారి పక్షవాతం (స్ట్రోక్)కు గురై కోలుకున్నవారిలో 24 శాతం మంది మహిళల్లో, 42 శాతం మంది పురుషుల్లో ఐదేళ్లలోపు పక్షవాతం మరోసారి వచ్చే అవకాశం ఉన్నట్లు తేలింది. మొదటిసారి స్ట్రోక్ వచ్చిన 256 మందిపై నిర్వహించిన పల్స్ రీడింగ్ ద్వారా తేడాలు తెలుసుకుని, రాబోయే ఈ తరహా ప్రమాదాలను గుర్తించి, వాటిని నివారించడం సాధ్యమైనట్లు పరిశోధకులు తెలిపారు. ఈ వివరాలను ‘న్యూరాలజీ’ అనే జర్నల్‌లోనూ పొందుపరిచారు.
చదవండి:
ఒళ్లు కరిగించే మధుమేహ మాత్ర!
రక్తపోటు వచ్చేముందు ప్రీ–హైపర్‌టెన్షన్ దశ అంటే..?
Comments
Please login to add a commentAdd a comment