సాక్షి, అమరావతి: కరోనా సెకండ్ వేవ్‌లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. ఇతర రాష్ట్రాల్లో తలెత్తిన సమస్యలు దృష్టి పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆక్సిజన్ కొరతపై ప్రత్యేక దృష్టి పెట్టింది. భవిష్యత్తులో రాష్ట్రానికి అవసరమైన ఆక్సిజన్‌పై కసరత్తు చేస్తుంది. కోవిడ్ పీక్ స్టేజ్‌లో 200 టన్నుల ఆక్సిజన్ అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. మిగతా సమయంలో రోజుకు 80 నుంచి 100 టన్నుల ఆక్సిజన్ అవసరమని తెలిపారు.
ఏపీకి నాలుగు ప్రాంతాల నుంచి ఆక్సిజన్ తెచ్చుకునేలా ప్రణాళికలు రచించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్, భువనేశ్వర్, బళ్లారి, చెన్నై నుంచి ఆక్సిజన్ వచ్చేలా యాక్షన్ ప్లాన్ రూపిందించారు. విశాఖ స్టీల్ ఇప్పటికే ఆక్సిజన్ సరఫరా ప్రారంభించగా.. బళ్లారి, చెన్నైల నుంచి మరింత ఆక్సిజన్ తెచ్చుకునేలా కసరత్తు చేస్తున్నారు. ఆక్సిజన్ నిల్వలు సిద్ధం చేసుకునేలా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశామని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment