
గోపీచంద్, రాశీఖన్నా, అనూ ఇమ్మాన్యుయేల్ ముఖ్య తారలుగా ఏ.యం. జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఎస్.ఐశ్వర్య నిర్మించిన ‘ఆక్సిజన్’ ఇటీవల విడుదలైంది. స్టేట్ హెల్త్ అసోసియేషన్ మరియు ఐడీఏ, టొబాకో ఇంటర్‌వెన్షన్ ఇంటేటివ్ సంస్థల కోసం హైదరాబాద్‌లో ‘ఆక్సిజన్’ ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. జ్యోతికృష్ణ మాట్లాడుతూ– ‘‘సినిమా విడుదలైనప్పుడు మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చాయి. చాలా ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. విజయవాడ స్టేట్ హెల్త్ అసోసియేషన్ నుంచి శివశంకర్ గారు ఫోన్ చేసి ‘మేం చేయాల్సిన పనిని మీ సినిమా ద్వారా చేశారు’ అన్నారు. ఈ చిత్రానికి చాలా అవార్డులు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. చాలామంది పేషెంట్స్‌లో కనిపిస్తున్న సమస్యలను సినిమాలో చాలా అర్థవంతంగా చూపించాం. ఈ సినిమా చూశాక కొందరైనా సిగరెట్ అలవాటు మానుకోవాలని ఆశిస్తున్నాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment