Rajasthan Cm: కోటి వ్యాక్సిన్‌లు ఓ రోజుకి సరిపోవు | Ashok Gehlot Slams Harsh Vardhan Availability Of Covid Vaccine | Sakshi
Sakshi News home page

Rajasthan Cm: కోటి వ్యాక్సిన్‌లు ఓ రోజుకి సరిపోవు

Published Wed, May 26 2021 2:51 PM | Last Updated on Wed, May 26 2021 2:55 PM

Ashok Gehlot Slams Harsh Vardhan Availability Of Covid Vaccine - Sakshi

జైపూర్‌: కోవిడ్‌ దేశంలోని ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగులుస్తోంది. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడి వందల కొద్దీ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అయితే తాగాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ..కోవిడ్-19 వ్యాక్సిన్ల లభ్యతపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష్ వర్ధన్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు.  మంత్రి ఇటువంటి తప్పుడు ప్రకటనలు చేయకుండా ఉండాలని హితవు పలికారు. 

దేశ ప్రజలు ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ సమయంలో దేశంలో తగినంత ఆక్సిజన్ ఉందని ఆయన పేర్కొనడం బాధాకరమని అన్నారు. ఈ రోజు కోటి వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు కేంద్ర మంత్రి అన్నారు. కానీ దేశంలోని అన్ని రాష్ట్రాలు ప్రజలకు వ్యాక్సిన్‌లను అందిస్తే అవి ఓ రోజుకి సరిపోవని గెహ్లాత్‌ దుయ్యబట్టారు. ఇప్పటివరకు రాజస్తాన్‌లో 9.24 లక్షల మంది కరోనా బారిన పడగా..8.29 లక్షల మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో కరోనా బారిన పడి 7,911 మంది బాధితులు తమ ప్రాణాలను కోల్పోయారు.

(చదవండి: వైరల్‌: వేలంలో 213 కోట్లు పలికిన ‘‘ది సాకురా’’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement