‘‘నా సినీ ప్రయాణంలో ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఈ జర్నీతో సంతృప్తిగానే ఉన్నాను. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయని ఇతరులను బ్లేమ్ చేయను. ఎందుకంటే... అవన్నీ నాకు నచ్చి చేసినవే. చేసిన తప్పులను మళ్లీ చేయకూడదనుకుంటా’’ అన్నారు హీరో గోపీచంద్. ఏయం జ్యోతికృష్ణ దర్వకత్వంలో ఆయన హీరోగా శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్. ఐశ్వర్య నిర్మించిన చిత్రం ‘ఆక్సిజన్’. అనూ ఇమ్మాన్యుయేల్, రాశీ ఖన్నా కథానాయికలు. ఈ చిత్రాన్ని గురువారం విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హీరో గోపీచంద్ చెప్పిన విశేషాలు..
► కథను, ఏయం రత్నంగారిని నమ్మి, ఈ సినిమా చేశాను. ఆయనతో సినిమా చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈ సినిమాతో కుదిరింది. మా నాన్న (ప్రముఖ దర్శకుడు టి.కృష్ణ) గారితో ఉన్న అనుబంధాన్ని ఆయన చెప్తుండేవారు. నాన్నగారి గురించి వినడం నాకో మంచి అనుభూతి. ఇందులో నా పాత్ర పేరు సంజీవ్. అతను ఏం చేస్తాడనేది మాత్రం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. స్టార్టింగ్ టు ఎండింగ్ అలరించేలా ఉంటుంది. ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులకు కిక్ ఇస్తుంది. ఈ సినిమా హిట్ అయి... నాకు, కొన్నవాళ్లకు ఆక్సిజన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. యువన్ మంచి పాటలు ఇచ్చారు.
► ‘ఆక్సిజన్’ ముందే విడుదల కావాల్సి ఉంది. కానీ, లేట్ అయింది. నా సినిమాలు త్వరగా రిలీజ్ కావాలని నాకూ ఉంటుంది. అయితే... నటించడం మాత్రమే నా చేతుల్లో ఉంటుంది. రిలీజ్ చేయడం నిర్మాతల చేతుల్లో ఉంటుంది. ‘ఆరడుగుల బుల్లెట్’ సినిమా నిర్మాత సెలక్షన్ విషయంలో నాదే రాంగ్ అనిపించింది.
► ‘లౌక్యం’ సినిమా చేసిన తర్వాత ‘జిల్’ చేశా. అది ఓకే. బట్, ‘సౌఖ్యం’ సినిమా రాంగ్ స్టెప్. ఆ తర్వాత ‘ఆక్సిజన్’ స్టార్ట్ చేశా. అనుకున్న టైమ్‌లో ఈ సినిమా రిలీజ్ అయితే గ్యాప్ వచ్చేది కాదు. ‘గౌతమ్‌నంద’ చిత్రకథను నమ్మాను. ప్రేక్షకులకు నచ్చుతుందనుకున్నా. కానీ, రిలీజ్ అయిన తర్వాత సెకండాఫ్‌లో ఏదో మిస్ అయ్యిందనిపించింది. హిట్టూ, ఫ్లాపు అన్నవి మన చేతుల్లో ఉండవు. చేసే ప్రతి సినిమాని మంచి కథే అని నమ్మి చేస్తాను.
► ప్రభాస్, నేనూ సినిమాల గురించే కాదు మిగతా విషయాల గురించీ మాట్లాడుకుంటుంటాం... చర్చించుకుంటాం. ‘బాహుబలి’ ప్రెజర్ అయిపోయింది కదా! తను త్వరలోనే పెళ్లి చేసుకుంటాడు (నవ్వుతూ). మా ఇద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా చేయాలన్న ఆలోచన ఉంది.
► ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో సినిమాలు వస్తున్నాయి. రాజశేఖర్‌గారి ‘గరుడవేగ’ చూశా. బాగా నచ్చింది. ఆయనకు కాల్ చేసి, ‘రాజశేఖర్ బ్యాక్’ అని చెప్పా.
తెలుగులో వెబ్ సిరీస్‌లు స్టార్ట్ అవుతున్నాయి. అవి ఎన్ని వచ్చినప్పటికీ, థియేటర్ ఫీల్ వేరు. వెబ్ సిరీస్‌లలో నటించాలనే ఆలోచన ప్రస్తుతం లేదు. అయినా వెబ్ సిరీస్‌లు అనేవి సినిమాల్లో ఒక పార్ట్ మాత్రమే. ప్రపంచం ఉన్నంత కాలం సినిమాలు ఉంటాయి.
► మా అబ్బాయి అన్ని సినిమాలు చూస్తాడు. ఫైటింగ్ మూవీస్ అయితే ఎంజాయ్ చేస్తాడు. స్లోగా ఉంటే ‘బాలేదు’ అంటూ పక్కకి వెళ్లిపోతాడు.
► దర్శకుడు చక్రితో సినిమా చేస్తున్నాను. వచ్చే నెలలో షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. నాకు డైరెక్టర్ అవ్వాలని లేదు. అది టఫ్ జాబ్.
సినిమా రిలీజ్ నా చేతుల్లో ఉండదు
Published Mon, Nov 27 2017 1:45 AM | Last Updated on Mon, Nov 27 2017 3:52 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment