కార్మిక సంక్షేమానికి భారతీ సిమెంట్స్ పెద్దపీట
కార్మిక సంక్షేమానికి భారతీ సిమెంట్స్ పెద్దపీట
Published Sun, Sep 11 2016 11:20 PM | Last Updated on Mon, Sep 4 2017 1:06 PM
గుడివాడ టౌన్:
భారతీ సిమెంట్స్ వ్యాపారాభివృద్ధితోపాటు దీనికి అనుబంధమైన తాపీ కార్మికుల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తుందని భారతీ సిమెంట్స్ జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్ వి. పవన్ కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక రైల్వే కళ్యాణ మందిరంలో గుడివాడ తాపీ కార్మికుల వ్యక్తిగత బీమా పాలసీల రెన్యువల్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయంగా తమ వ్యాపారాభివృద్ధిలో తాపీ కార్మికుల పాత్ర ఎంతో ఉందని అన్నారు. వారి ప్రోత్సాహానికి తగినట్లుగానే అత్యంత నాణ్యమైన ఉత్పత్తుల్లో సైతం తాము ముందజలో ఉన్నామన్నారు. వారి సంక్షేమం కోసం కంపెనీ ఉచిత బీమా సౌకర్యం కల్పించిందని వీటిల్ల ప్రతి కార్మికుడు రూ. 2 లక్షలు ప్రమాద రక్షణ బీమా సౌకర్యాన్ని పొందుతాడని వివరించారు. భవిష్యత్‌లో కూడా ఈ పాలసీ విధానాన్ని అమలు చేసి కార్మికులకు అండగా నిలవాలని భారతి సిమెంట్స్ నిర్ణయించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలోఅసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ జి. ప్రసాద్, భారతీ సిమెంట్స్ డీలర్స్, సతీష్ పెయింట్స్ యజమానులు టి. భాస్కరరావు, టి. సతీష్‌కుమార్ బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాబా ప్రసాద్, కార్యదర్శి పి. జేమ్స్, తాపీ వర్కర్స్ యూనియన్ అథ్యక్షుడు సత్యనారాయణ, కార్యదర్శి మురళి, కోశాధికారి కనకరాజు పలువురు కార్మికులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement