నాణ్యతకు మారు పేరు భారతి సిమెంట్ | Bharathi Cement is the name of quality | Sakshi
Sakshi News home page

నాణ్యతకు మారు పేరు భారతి సిమెంట్

Published Thu, May 29 2014 2:41 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 AM

నాణ్యతకు మారు పేరు భారతి సిమెంట్

నాణ్యతకు మారు పేరు భారతి సిమెంట్

 బాన్సువాడ టౌన్, న్యూస్‌లైన్ : నాణ్యతకు, నమ్మకానికి మారుపేరుగా భారతి సిమెంట్ నిలుస్తుందని భారతి సిమెంట్ సీనియర్ రీజినల్ సేల్స్ మేనేజర్ ప్రమోద్‌రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక లయన్స్ భవనంలో ట్రేడర్స్ యజమానులకు, మేస్త్రీలకు, కూలీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసియా ఖండంలోనే అతిపెద్ద కర్మాగారంగా అత్యున్నత ప్రమాణాలతో రోబోటిక్  క్వాలిటీ కంట్రోల్‌తో తయారు చేయబడిన తొలి ఏకైక సిమెంట్ కంపెనీ భారతి సిమెంట్ అని అన్నారు.

ప్రతి ఒక్కరికి ఉచిత ప్రమాదబీమాను కంపెనీ కల్పిస్తుందన్నారు.  ఇంటి నిర్మాణాలకు భారతి సిమెంట్‌నే వాడేవిధంగా చూడాలని అన్నారు. సిమెంట్ కావాలనుకునే వారికి గంటలోపు సిమెంట్‌ను అందజేస్తామని, పూర్తి వివరాలకు 8374432333కు సంప్రదించాలని సూచించారు.  

ఇంటి నిర్మాణ పద్ధతులపై, ఇంటి వ్యయం తగ్గించడాన్ని, సిమెంట్ తయారు చేసే విధానాన్ని వీడియో ద్వారా మేస్త్రీలకు అవగాహన కల్పించారు. ఈ సదస్సులో రీజినల్ టెక్నికల్ ఇంజినీర్ మారుతికుమార్, ఏరియా సేల్స్ మేనేజర్ శివకుమార్, సిమెంట్ దుకాణాల యాజమానులు చంద్రశేఖర్‌రెడ్డి, రాంచందర్‌రావు, నాగేశ్వర్‌రావు తదితరులు మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement