శనివారం కేరళలోని కొచ్చిలో భారతి అల్ట్రాఫాస్ట్ సిమెంట్‌ను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్న భారతి సిమెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ ఎం. రవీందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘భారతి అల్ట్రాఫాస్ట్’పేరుతో సరికొత్త ‘గ్రీన్ సిమెంట్’ను భారతి సిమెంట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. రోబోటిక్ టెక్నాలజీతో తయారయ్యే ఈ సిమెంట్.. కాంక్రీట్ అనువర్తనాల్లో ఎంతో ఉపయోగపడుతుందని సంస్థ మార్కెటింగ్ డైరెక్టర్ ఎం.రవీందర్‌రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న ఓపీసీ 53 సిమెంట్ వల్ల కలిగే ప్రయోజనాలన్నీ అల్ట్రాఫాస్ట్ ద్వారా లభిస్తాయని చెప్పారు. ఈ సిమెంట్ వల్ల తేమ వాతావరణంలోనూ ప్రీ కాస్టింగ్ పని సులువవుతుందని, చాలా తొందరగా కాంక్రీట్ గట్టిపడుతుందని తెలిపారు.
అల్ట్రాఫాస్ట్‌తో నిర్మితమైన కాంక్రీట్ స్లాబులు, పిల్లర్లు దృఢంగా, ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని, ఎక్కువ బరువును తట్టుకోగలవని వివరించారు. అల్ట్రాఫాస్ట్ తక్కువ వేడిని విడుదల చేస్తుందని, కాబట్టి వేడి ద్వారా వచ్చే పగుళ్లు తగ్గుతాయని.. కాంక్రీట్‌కు నష్టం జరగదన్నారు. సిమెంట్ ఇటుకల తయారీకి అల్ట్రాఫాస్ట్ ఎంతో అనువైనదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment