ఇంటి వద్దకే నాణ్యత సేవలు | bharathi cement starts mobile teams for ap and ts | Sakshi
Sakshi News home page

ఇంటి వద్దకే నాణ్యత సేవలు

Published Wed, Jul 19 2017 1:15 AM | Last Updated on Tue, Sep 5 2017 4:19 PM

ఇంటి వద్దకే నాణ్యత సేవలు

ఇంటి వద్దకే నాణ్యత సేవలు

మొబైల్‌ టీమ్‌ను ప్రారంభించిన భారతి సిమెంట్‌
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సిమెంటు తయారీ సంస్థ భారతి సిమెంట్‌ మొబైల్‌ సాంకేతిక సేవలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు విస్తరించింది. శిక్షణ పొందిన సివిల్‌ ఇంజనీర్లు ద్విచక్ర వాహనంపై స్వయంగా కస్టమర్ల ఇంటి వద్దకు వెళ్లి ఎటువంటి బిల్డింగ్‌ మెటీరియల్‌ ఎంపిక చేసుకోవాలి, నాణ్యమైన కాంక్రీట్‌ను ఏ విధంగా తయారు చేయాలి వంటి అంశాలను వివరిస్తారు.

అలాగే నిర్మాణానికి వాడే నీరు, ఇసుక, కంకర నాణ్యతను ప్రత్యేక పరికరాల ద్వారా అక్కడికక్కడే పరీక్షిస్తారు. మొబైల్‌ సాంకేతిక సేవలను దక్షిణాదిన ఇతర రాష్ట్రాలకు త్వరలో పరిచయం చేస్తామని సంస్థ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ ఎం.రవీందర్‌ రెడ్డి తెలిపారు. సిమెంటు రంగంలో ఇటువంటి సేవలను దేశంలో తొలిసారిగా భారతి సిమెంట్‌ ప్రారంభించిందని గుర్తు చేశారు. కంపెనీ ఇప్పటికే ఈ సేవలను తమిళనాడులో అందిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement