civil engineer
-
అనూష షా...విల్ పవర్ ఉన్న సివిల్ ఇంజనీర్
‘నా వృత్తిలో నేను రాణిస్తే చాలు. అదే పదివేలు’ అని సంతృప్తి పడి, సర్దుకుపోయేవాళ్లే ఎక్కువమంది కనిపిస్తారు. ‘నా వృత్తి వల్ల పర్యావరణానికి ఏ మేరకు హాని జరుగుతోంది?’ అని ఆలోచించేవాళ్లు అరుదుగా కనిపిస్తారు. అలాంటి అరుదైన వ్యక్తి... అనూష షా. పచ్చటి ప్రకృతి ప్రపంచంలో పుట్టి పెరిగిన అనూషకు పర్యావరణ విలువ తెలుసు. సివిల్ ఇంజనీర్‌గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న అనూష వృత్తి విజయాలను చూసి ΄÷ంగిపోవడం కంటే వృత్తికి సామాజిక బాధ్యతను జోడించడానికే అధికప్రాధాన్యత ఇచ్చింది. తన వంతుగా వివిధ వేదికలపై పర్యావరణ హిత ప్రచారాన్ని విస్తృతం చేసింది. తాజాగా... బ్రిటన్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ (ఐసీయి)కి అధ్యక్షురాలిగా ఎంపికైంది అనూష షా. రెండు శతాబ్దాల చరిత్ర ఉన్న ప్రతిష్ఠాత్మకమైన ‘ఐసీయి’ అధ్యక్షత బాధ్యతలు స్వీకరించిన తొలి భారతీయురాలిగా అనూష షా చరిత్ర సృష్టించింది... ‘వాటర్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్’లో అనూష షాకు రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. డిజైనింగ్, మేనేజింగ్లో, ప్రాజెక్ట్స్–ప్రొగ్రామ్‌లను లీడ్ చేయడంలో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. ‘నిర్మాణం వల్ల నిర్మాణం మాత్రమే జరగడం లేదు. ప్రకృతికి ఎంతో కొంత నష్టం జరుగుతుంది’ అనేది ఒక సామాజిక సత్యం. దీన్ని దృష్టిలో పెట్టుకొని వృత్తికి సామాజిక బాధ్యత కూడా జోడించి ముందుకు వెళుతోంది అనూష. ‘నా వృతి వల్ల నాకు ఆర్థికంగా మేలు జరగడం మాట ఎలా ఉన్నా, చేటు మాత్రం జరగవద్దు’ అంటోంది అనూష. అందుకే తన వృత్తిలో పర్యావరణ హిత విధానాలను అనుసరిస్తోంది. ‘సివిల్ ఇంజనీరింగ్‌ను పీపుల్–పాజిటివ్ ప్రొఫెషన్‌గా చూడాలనేది నా కల. మౌలిక వసతులు, ప్రకృతికి మధ్య ఉండే అంతఃసంబంధాన్ని అర్థం చేసుకోవడంలో మొదట్లో మేము విఫలమయ్యాం. ఆ తరువాత మాత్రం ప్రకృతికి హాని జరగని విధానాలను అనుసరించాం’ అంటుంది అనూష. అందమైన కశ్మీర్లో పుట్టి పెరిగిన అనూషకు ప్రకృతి విలువ తెలుసు. కశ్మీర్‌లోని దాల్ సరస్సు సంరక్షణ కోసం దిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఒక సంస్థ కోసం ఇరవై మూడు సంవత్సరాల వయసులో కన్సల్టింగ్ప్రాజెక్ట్ ఇంజనీర్‌గా పనిచేసింది. ఆ తరువాత కామన్వెల్త్ స్కాలర్‌షిప్‌తో బ్రిటన్ వెళ్లి ‘వాటర్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్’లో ఎంఎస్సీ చేసింది. ‘΄్లాన్ ఫర్ ఎర్త్’ అనే క్లైమెట్ ఛేంజ్ కన్సెల్టెన్సీని మొదలు పెట్టి పర్యావరణ సంరక్షణకు సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. వివిధ పరిశ్రమలకు సంబంధించిన ‘నెట్‌జీరో అండ్ క్లైమెట్ ఛేంజ్’ బృందాలతో సమావేశమై విలువైన సూచనలు ఇచ్చింది. చర్చాకార్యక్రమాల్లో పాల్గొన్నా, వ్యాసాలు రాసినా, టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చినా, సమావేశాల్లో ఉపన్యాసం ఇచ్చినా...ప్రతి అవకాశాన్ని పర్యావరణ హిత ప్రచారానికి ఉపయోగించుకుంది. ‘మన గురించి మాత్రమే కాదు భవిష్యత్ తరాల గురించి కూడా ఆలోచించాలి. ఉన్నతమైన విలువలతో ప్రయాణించినప్పుడే మన గమ్యస్థానం చేరుకోగలం’ అంటుంది అనూష. ‘క్లైమెట్ చేంజ్ ఇన్ ఇంజనీరింగ్’ అంశానికి సంబంధించి అనూష చేపట్టిన అవగాహన కార్యక్రమాలకు గానూ ‘యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ లండన్’ నుంచి గౌరవ డాక్టరేట్ స్వీకరించింది. కొన్ని సంవత్సరాల క్రితం బ్రిటన్ నుంచి ముంబైకి వచ్చింది అనూష. ఆ సమయంలో తన స్వస్థలం కశ్మీర్‌ను వరదలు ముంచెత్తాయి. ఎంతోమంది చనిపోయారు. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. ఇది అనూషను బాగా కదిలించింది. ‘విషాదం నుంచి కూడా నేర్చుకోదగినవి చాలా ఉంటాయి. ఇది అలాంటి విషాదమే’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది అనూష. ‘ముందుచూపు, ముందు జాగ్రత్త ఉన్న వాళ్ల వైపే అదృష్టం మొగ్గు చూపుతుంది’ అనేది అనూష షాకు బాగా ఇష్టమైన మాట. ‘మన వల్ల ఏమవుతుంది అనే భావన కంటే ఔట్ ఆఫ్ బాక్స్‌లో ఆలోచించి, ధైర్యంగా ముందుకు వెళ్లడం వల్లే ఎక్కువ మేలు జరుగుతుంది. సంకల్పబలం ఉన్న చోట అద్భుతమైన ఫలితాలు వస్తాయి’ అనేది ఆమె బలంగా చెప్పే మాట. -
ఖతార్‌లో రోడ్డు ప్రమాదం
హైదరాబాద్: ఖతార్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో న్యూ మలక్‌పేట చెందిన అభివన్ మారం (42) మృతి చెందాడు. అక్కడ సివిల్ ఇంజినీర్‌గా పని చేస్తున్న ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. ఆదివారం కత్తర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అభినవ్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం రాత్రి మృతదేహం ఇంటికి చేరుతుందని, బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు మృతుని సోదరుడు జ్ఞానేశ్వర్ తెలిపారు. -
ఆ సీట్లు ఏమైనట్టు?
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది సివిల్, మెకానికల్ సీట్లు భారీగా తగ్గే అవకాశం కన్పిస్తోంది. తొలి విడత కౌన్సెలింగ్‌లో చేర్చిన సీట్ల వివరాలే దీనికి నిదర్శనం. ఇప్పటివరకూ కౌన్సెలింగ్ జాబితాలో చేర్చిన సీట్లలో ఎక్కువగా కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ ఏఐఎంఎల్, ఇతర కంప్యూటర్ కోర్సులవే ఉన్నాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో సీట్లు తక్కువగా కన్పిస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే ఈ విభాగాల్లో సీట్లు కంప్యూటర్ కోర్సుల్లోకి మారబోతున్నాయా? లేదా కాలేజీలు రద్దు చేసుకుంటాయా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇప్పటికే వంద కాలేజీల వరకూ సంప్రదాయ కోర్సుల్లో సీట్లు తగ్గించాలని, కంప్యూటర్ సైన్స్, ఇతర కోర్సుల్లో సీట్లు పెంచాలని దరఖాస్తు చేసుకున్నాయి. ఈ కారణంగానే దాదాపు 40 వేల సీట్లను కౌన్సెలింగ్‌లో పెట్టలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆప్షన్లన్నీ సీఎస్ఈ వైపే... ఎంసెట్ కౌన్సెలింగ్‌కు ఇప్పటివరకు 60 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలి విడత సీట్లు కేటాయించే నాటికి ఈ సంఖ్య 80 వేలు దాటొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఇంజనీరింగ్ విభాగంలో 1,56,879 మంది అర్హత సాధించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో ఎక్కువ మంది కంప్యూటర్ కోర్సులకే ఆప్షన్లు ఇస్తున్నారు. ఇందులో ఎంసెట్, జేఈఈ ర్యాంకర్లు కూడా ఉన్నారు. తొలిరోజు దాదాపు 6 వేల మంది ఆప్షన్లు ఇచ్చారు. ఇందులో 5 వేలు సీఎస్సీ, ఇతర కంప్యూటర్ కోర్సులవే ఉన్నాయి. తొలి విడత కౌన్సెలింగ్‌లో కూడా 62,079 సీట్లు చేర్చారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.05 లక్షల ఇంజనీరింగ్ సీట్లుండగా, ఇందులో సివిల్ 3087, మెకానికల్ 2667, ఎలక్ట్రికల్ 3854 సీట్లు ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 30 శాతం తగ్గాయి. ప్రైవేటు కాలేజీలు కోరినట్టు బ్రాంచీల్లో సీట్ల మార్పు జరిగితే కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో సీట్లు పెరుగుతాయి. ఎందుకంటే గత ఏడాది సివిల్‌లో 36.38, మెకానికల్‌లో 31.92, ఈఈఈలో 56.49 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఆ సీట్లపై ప్రైవేటు కాలేజీల గురి కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో ఈ ఏడాది భారీగా సీట్లున్నాయి. అయినప్పటికీ విద్యార్థుల డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ప్రైవేటు కాలేజీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. జేఈఈ, ఎంసెట్‌లో 3 వేల లోపు ర్యాంకులు వచ్చిన విద్యార్థుల చేత మొదటి కౌన్సెలింగ్‌లోనూ దరఖాస్తు చేయిస్తున్నాయి. వీళ్లకు కంప్యూటర్ కోర్సుల్లో తొలి దశలోనే సీట్లు వచ్చే అవకాశం ఉంది. ముందు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినప్పటికీ, ఆఖరి కౌన్సెలింగ్ వరకూ వీళ్లు కాలేజీల్లో చేరరు. జేఈఈ ర్యాంకు ఉండటంతో జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరతారు. రాష్ట్రంలో అన్ని కౌన్సెలింగ్‌లు పూర్తయిన తర్వాత రాష్ట్రంలో తొలి విడతలో వచ్చిన సీటును వదులుకుంటున్నారు. అప్పుడు ప్రైవేటు కాలేజీలు స్పాట్ అడ్మిషన్లో ఇష్టమొచ్చిన వాళ్లకు భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని సీట్లు ఇస్తున్నట్టు ఆరోపణలున్నాయి. అయితే, దీన్ని కట్టడి చేయడం ఎవరి వల్లా కావడం లేదని సాక్షాత్తు అధికార వర్గాలు చెబుతుండటం కొసమెరుపు. -
స్థానిక పదార్థాలతో సరికొత్త కాంక్రీట్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: హైదరాబాద్ ఐఐటీ సివిల్ ఇంజనీరింగ్, పరిశోధన విభాగం సరికొత్త కాంక్రీట్‌ను అభివృద్ధి చేసింది. స్థానికంగా లభించే ఫ్లైయాష్ (బొగ్గును మండించాక మిగిలే బూడిద), ఇసుక, గ్రౌండ్ గ్రాన్యులేటెడ్ బ్లాస్ట్ ఫర్నేస్ స్లాగ్ (నిప్పుల కొలిమిల్లో వివిధ మిశ్రమాలను మండించాక మిగిలే పదార్థం), మైక్రో సిలికా (ఓ రకమైన బూడిద), నీరు, స్టీల్ ఫైబర్ (పలచని స్టీల్ ముక్కలు), పాలీప్రొలిన్ ఫైబర్స్ (ఓ రకమైన ప్లాస్టిక్ పీచు) వంటి వాటిని ఉపయోగించి ఈ కాంక్రీట్‌ను అభివృద్ధి చేసినట్లు సివిల్ ఇంజనీరింగ్ విభాగం ప్రకటించింది. దీనికి అల్ట్రా హైపర్ఫార్మెన్స్ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ (యూహెచ్‌పీఎఫ్‌ఆర్‌సీ)గా పేరుపెట్టింది. సాధారణ కాంక్రీట్‌తో పోలిస్తే సుమారు రెండింతల తక్కువ వ్యయంలోనే దీన్ని తయారు చేసే అవకాశం ఉందని... బ్రిడ్జీలు, పొడవైన కట్టడాలకు అవసరమైన బీమ్‌లకు, స్తంభాలు, ఇతర నిర్మాణాలకు ఈ నూతన కాంక్రీట్‌ను ఉపయోగించుకోవచ్చని ఐఐటీ సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఫ్రొఫెసర్ ఎస్.సూర్యప్రకాశ్ పేర్కొన్నారు. హైదరాబాద్ ఐఐటీలోని క్యాస్టన్ ల్యాబ్‌లో ఈ నూతన కాంక్రీట్ పనితీరును పరీక్షించామన్నారు. డిజైన్ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ కాంక్రీట్‌ను అభివృద్ధి చేసినట్లు ఆయన చెప్పారు. నూతన కాంక్రీట్ 150 ఎంపీయూ కంప్రెసివ్ స్ట్రెంత్‌ను కలిగి ఉందన్నారు. ఈ సందర్భంగా ఐఐటీ డైరెక్టర్ ఫ్రొఫెసర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ స్థానికంగా లభించే పదార్థాలను ఉపయోగించి నిర్మాణ సామగ్రిని అభివృద్ధి చేయడమంటే ‘ఆత్మనిర్భర్ భారత్’ కల సాకారం దిశగా ముందడుగు వేయడమేనన్నారు. ఇలాంటి ఆవిష్కరణలు దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పడతాయన్నారు. -
యువతి ఫోటోలు మార్ఫింగ్, ఇంజనీర్ అరెస్ట్
సాక్షి, భీమవరం : ప్రయివేట్ కంపెనీలో సివిల్ ఇంజనీరుగా పనిచేస్తూ విజ్ఞానంతో వికృత చేష్టలకు పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. ఫేస్బుక్లో పరిచయమైన యువతి ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆపై బ్లాక్ మెయిలింగ్‌కు దిగి మనోవేదనకు గురిచేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గానికి చెందిన యువతి భీమవరంలోని ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకుంది. అనంతపురం జిల్లా మడకశిరకు చెందిన సేనపరిగి హిమతేజకు ఫేస్బుక్ ద్వారా పరిచయం అయింది. ఇది స్నేహంగా మారడంతో ఆమె తన ఫోటోలు పంపింది. ఒకరినొకరు ఇష్టపడ్డారు. తర్వాత అతడు మంచివాడు కాదని తెలుసుకుని ఫేస్బుక్ పరిచయాన్ని ఆపేసి, మాట్లాడటం మానేసింది. ఆరు నెలల తర్వాత యువతి పేరుపై ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్‌లో నకిలీ అకౌంట్స్ క్రియేట్ చేశాడు. ఆమె స్నేహితురాళ్లకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి తర్వాత ఆ యువతి ఫోటోలను మార్ఫింగ్ చేసి వాళ్లకు పంపాడు. వారంతా ఆమెకు ఫోన్ చేసి ఇలాంటి ఫోటోలు అప్లోడ్ చేస్తున్నావేంటని అడగటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధిత యువతి భీమవరం పోలీసులకు ఈ నెల 8న ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో సివిల్ ఇంజనీరుగా పనిచేస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
పబ్లిక్ ఎగ్జామ్‌లో టాపర్ సన్నీ లియోన్
పట్నా: జూనియర్ సివిల్ ఇంజనీర్ ఉద్యోగాల కోసం పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్(పీహెచ్ఈడీ) నిర్వహించిన పరీక్షలో సన్నీ లియోన్ టాపర్‌గా నిలిచింది. ఉద్యోగ అర్హత పరీక్షలో అత్యధిక మార్కులతో సహా గ్రాడ్యూయేషన్‌లో సాధించిన మార్కులతో కలిపి మొత్తం 98.5 పాయింట్లతో మెరిట్ లిస్టులో తొలిస్థానంలో ఉంది. దీంతో జూనియర్ సివిల్ ఇంజనీర్‌గా త్వరలోనే బాధ్యతలు చేపట్టనుంది. వీటికి సంబంధించిన వివరాలు పీహెచ్ఈడీ అధికారికంగా ప్రకటించింది. మరిన్ని వివరాల కోసం తమ అధికారిక వెబ్సైట్ చూడాలంటూ కోరింది. అయితే ఇక్కడ సన్నీ లియోన్ అంటే హీరోయిన్ కాదు. బిహార్‌కు చెందిన మామూలు మధ్యతరగతి కుటంబానికి చెందిన మహిళ. ఆమె తండ్రి పేరు లియోనా లియోన్. అయితే ప్రస్తుతం పీహెచ్ఈడీ అధికారిక వెబ్సైట్లో మెరిట్ జాబితాలో ఉన్న సన్నీ లియోన్‌కు సంబంధించిన వివరాలను స్ర్కీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఇది వైరల్‌గా మారుతోంది. హీరోయిన్ సన్నీ లియోనే పరీక్షలో టాపర్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. -
ఏసీబీ వలలో సివిల్ ఇంజినీర్
పశ్చిమగోదావరి, పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఉదయం జరిగిన ఏసీబీ దాడి సంచలనం రేపింది. సివిల్ ఇంజినీర్ జె.ఫణిశ్రీనివాస్ రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఏలూరు ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ కథనం ప్రకారం.. రాజమండ్రికి చెందిన సివిల్ కాంట్రాక్టర్ మద్దాల ధర్మాజీరావు పాలకొల్లు పట్టణంలో ఎస్సీ సబ్‌ప్లాన్ పనులు 17దక్కించుకున్నారు. ఈ పనులను 2018 మార్చి నెలాఖరుకు పూర్తిచేశారు. వీటి బిల్లులు తయారు చేయాల్సిందిగా సివిల్ ఇంజినీర్ ఫణి శ్రీనివాస్‌ను కోరారు. ఆయన చుట్టూ 8 నెలలుగా తిరుగుతున్నారు. లంచం ఇస్తేనే బిల్లు సిద్ధంచేస్తానని శ్రీనివాస్ చెప్పడంతో చేసేది లేక ధర్మాజీరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వలపన్ని.. ధర్మాజీరావు ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఫణిశ్రీనివాస్‌ను పట్టుకునేందుకు వలపన్నారు. ఉదయం 11 గంటల సమయంలో పాలకొల్లు మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన ఏసీబీ అధికారులు కాంట్రాక్టర్ ధర్మాజీరావుకు రూ.50 వేలు ఇచ్చి ఇంజినీరింగ్ సెక్షన్లోకి పంపారు ఆ నగదును సివిల్ ఇంజినీర్ ఫణిశ్రీనివాస్కు ధర్మాజీరావు ఇచ్చారు. డబ్బులు తీసుకుని ఫణిశ్రీనివాస్ కవర్లో పెట్టుకున్నారు. వెంటనే అధికారులు ఫణిశ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐ కె.శ్రీనివాసు సిబ్బంది పాల్గొన్నారు. ఇది రెండో అవినీతి కేసు పాలకొల్లు మున్సిపాలిటీ ఏర్పడి సుమారు వందేళ్లు పూర్తికావస్తోంది. ఇప్పటివరకూ మున్సిపాలిటీలో ఇది రెండో అవినీతి కేసు అని స్థానికులు చెబుతున్నారు. మూడేళ్ల క్రితం మున్సిపల్ మేనేజర్ ఒక ఉద్యోగికి పోస్టింగ్ ఇవ్వడం కోసం లంచం అడిగి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. అప్పట్లో మేనేజర్‌తోపాటు మరో సహ ఉద్యోగిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. నాలుగేళ్లుగా ధర్మాజీరావు పనులు కాంట్రాక్టర్ మద్దాల ధర్మాజీరావు నాలుగేళ్లుగా పాలకొల్లు పట్టణంలో సివిల్ కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారు. ఆయన కథనం ప్రకారం.. ఇటీవల ఎస్సీ సబ్‌ప్లాన్‌లో భాగంగా రూ.6.72 కోట్ల విలువైన 17 పనులను దక్కించుకున్నారు. వీటిని 2018 మార్చి నెలాఖరుకు పూర్తిచేశారు. అప్పటి నుంచి బిల్లులు పెట్టాలని ఇంజినీర్ ఫణిశ్రీనివాస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్, డీఈ, ఎస్ఈ, ఎమ్మెల్యేలతో చెప్పించినా పెడచెవిన పెట్టి తనకు లంచం ఇస్తేనే గానీ చేయనని ఫణిశ్రీనివాస్ మొండికేశారు. ఇంకా సుమారు రూ.3 కోట్ల విలువైన పనులకు బిల్లులు రావలసి ఉంది. సబ్‌ప్లాన్ నిధులు సమయానికి బిల్లు చేయకపోతే ఆ నిధులు వెనక్కు వెళ్లిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. జనవరిలో ధర్మాజీరావు చేసిన సుమారు రూ.2 కోట్ల పనులకు బిల్లులు చేయడంలో ఇంజినీరు ఫణిశ్రీనివాస్ ఆలస్యం చేయడం వల్ల ఆ నిధులు ఏలూరు కార్పొరేషన్‌కు వెళ్లిపోయాయి. తరువాత బిల్లులు రావడంతో అదనంగా జీఎస్టీ చెల్లించాల్సి వచ్చిందని ధర్మాజీరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడూ ఇంజినీర్ ఆలస్యం చేయడం వల్ల నిధులు వెనక్కి వెళ్లిపోతాయనే భయంతో చేసేది లేక ఏసీబీ అధికారులను ఆశ్రయిం చానని ధర్మాజీరావు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే జిల్లాలో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు పాలకొల్లు మున్సిపాలిటీలో తప్ప ఎక్కడా నిల్వ లేవు. ఆలస్యం చేయడంవల్ల లోటు ఉన్న మున్సిపాలిటీలకు ఆ నిధులను మళ్లించే అవకాశం ఉంటుంది. పాలకొల్లులో సుమారు రూ.5 కోట్లు ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు నిల్వ ఉన్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. -
సివిల్ ఇంజినీర్ మృతదేహం వెలికితీత
నెల్లూరు, పెళ్లకూరు/నాయుడుపేటటౌన్: మండలంలోని పాలచ్చూరు గ్రామం మామిడి కాలువ సమీపంలోని పారిశ్రామిక కారిడార్ భూముల్లో దారుణహత్యకు గురైన గుంటూరుకు చెందిన సివిల్ ఇంజినీర్ తన్నీరు సురేష్‌గోపి (25) మృతదేహాన్ని గురువారం వెలికితీశారు. ఈ కార్యక్రమం తహసీల్దార్ నాగరాజలక్ష్మి, నాయుడుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్రావుల ఆధ్వర్యంలో జరిగింది. గోపిని హత్య చేసి గోనె సంచిలో కట్టి సెజ్ పరిధిలో పనులు జరుగుతున్న కాలువలో పడేసి మట్టి వేసినట్లుగా అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మృతదేహం బాగా కుళ్లిపోయింది. ఇయర్ ఫోన్స్ ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలోనే మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ వెంకటరత్నమ్మ, పెళ్లకూరు, నాయుడుపేట ఎస్సైలు మహ్మద్హనీఫ్, వేణు, ఆర్ఐ చిదానందం, వీఆర్వో చెంచుబాబు, గ్రామపెద్దలు మునికృష్ణయ్య, వీఆర్ఏలు వంశీ, సురేష్ పాల్గొన్నారు. వారి పైనే అనుమానం సురేష్‌గోపి హత్య కేసు మిస్టరీగా మారింది. ఈనెల 21వ తేదీ అర్ధరాత్రి వరకు డ్యూటీ చేసిన జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు టిప్పర్ డ్రైవర్లు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకుంటేనే పూర్తి వివరాలు తెలుస్తాయని సీఐ మల్లికార్జునరావు చెబుతున్నారు. కాగా అనుమానితులైన ఇద్దరు డ్రైవర్లు, ఆరోజు డ్యూటీలో లేని మరో ఇద్దరు అదే రాష్ట్రానికి చెందిన డ్రైవర్లు కాంట్రాక్టర్, సూపర్వైజర్లకు చెప్పకుండా వెళ్లిపోవడంతో హత్యతో వారికి సంబంధం ఉంటుందేమో అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు నుంచి 21 తేదీ వచ్చిన గోపి అదేరోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో అతని తల్లి ధనలక్ష్మీతో మాట్లాడాడు. అలాగే పాలచ్చూరు సెజ్ భూముల వద్ద పనిచేస్తున్న సంస్థ సూపర్వైజర్ తేజతో అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో మాట్లాడినట్లు విచారణలో తెలియవచ్చింది. కాగా హత్య వెనుక సూపర్వైజర్ ప్రమేయం కూడా ఉంటుందని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. గోపి నాయుడుపేటకు వచ్చిన తర్వాత ఎవరితో మాట్లాడాడు, అతను పనిచేస్తున్న సెజ్ భూముల వద్ద ఉన్న సెక్యూరిటీ మొదలుకొని సైట్ ఇంజినీర్, టిప్పర్, ఇతర వాహనాల డ్రైవర్లతో పోలీసులు మాట్లాడి విచారించారు. కుటుంబాన్ని పోషించేందుకు.. నాయుడుపేటటౌన్: కుటుంబానికి అండగా ఉండేందుకు సురేష్‌గోపి కాంట్రాక్టర్ వద్ద విధుల్లో చేరాడు. అయితే అతని మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గుంటూరులోని కేవీపీ కాలనీకు చెందిన తన్నీరు శ్రీనివాసరావు, ధనలక్ష్మీలకు ఇద్దరు సంతానం. కొడుకు గోపిని బీటెక్ వరకు చదివించారు. కుమార్తె గాయత్రిదేవికి వివాహం చేశారు. గోపిని ఎంటెక్ చదివించాలనుకున్నారు. అయితే శ్రీనివాసరావుకు ఒక్కసారిగా ఆరోగ్య సమస్యల రావడంతో మంచం పడ్డాడు. దీంతో కుటుంబాన్ని పోషించేందుకు గోపి గుంటూరులో యార్ల తిరుపతిరావు అనే కంట్రాక్టర్ వద్ద రూ.8 వేలు జీతానికి సివిల్ కాంట్రాక్టర్‌గా ఈనెల 4 తేదీన పనిలో చేరాడు. గోపి ఆచూకీ కోసం వారంరోజులుగా వెతుకులాడుతున్న గుంటూరుకు అతని మేనమామ శ్రీనివాసులు, బాబాయిలు తన్నీరు ఏడుకొండలు, చుండూరు కృష్ణకిషోర్, మరో మేనమామ నగలపాటి వెంకటరమణలు మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. తమ బిడ్డను కిరాతకంగా హత్య చేసి అనవాళ్లు తెలియకుండా పూడ్చిపెట్టారని నిందితులను గుర్తించి వారికి కఠినంగా శిక్షించాలని పోలీసులను వేడుకున్నారు. పోస్ట్‌మార్టం అనంతరం వారు మృతదేహాన్ని గుంటూరుకు తీసుకెళ్లారు. -
సివిల్ ఇంజినీర్ దారుణహత్య
నాయుడుపేటటౌన్ (నెల్లూరు): గుంటూరుకు చెందిన సివిల్ ఇంజినీర్ తన్నీరు సురేష్‌గోపి (25) అనే యువకుడిని మేనకూరు సేజ్ పరిధిలో కోనేటి రాజుపాళెం సమీపంలో దారుణంగా హత్యచేసి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఈ ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంటూరులోని కేవీపీ కాలనీకి చెందిన సురేష్‌కుమార్ బీటెక్ (సివిల్) పూర్తి చేశాడు. తమ ప్రాంతానికి చెందిన యార్ల తిరుపతిరావు అనే కాంట్రాక్టర్ వద్ద పనిలో చేరాడు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం ఓ కాంట్రాక్ట్‌కు సంబంధించి జేసీబీలు, టిప్పర్లు నాయుడుపేట మండలం కోనేటిరాజుపాళెంలో ఉన్నాయని, అక్కడ సిబ్బందితో కలిసి పనిచేయాలని కాంట్రాక్టర్ అతడికి చెప్పాడు. గోపి ఈనెల 22వ తేదీన నాయుడుపేటకు చేరుకున్నట్లు ఆరోజు రాత్రి తల్లి ధనలక్ష్మికి ఫోన్ చేసి చెప్పాడు. 23న గోపికి అతని కుటుంబసభ్యులు ఫోన్ చేయగా స్విచ్ఆఫ్ వచ్చింది. పలుమార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో కాంట్రాక్టర్‌ను కలిసి తన కుమారుడు ఫోన్ పనిచేయడంలేదని చెప్పారు. దీంతో కాంట్రాక్టర్ కోనేటిరాజుపాళెం వద్ద తేజ అనే సూపర్వైజర్ ఉన్నాడని, అక్కడికి వెళ్లి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. దీంతో గోపి కుటుంబసభ్యులు ఈనెల 25వ తేదీన కోనేటిరాజుపాళెం చేరుకుని విచారించగా సురేష్‌గోపి ఇక్కడకు రాలేదని తేజ వారికి చెప్పాడు. దీంతో వారు భయాందోళనకు గురైన అతని మేనమామ సిరిగిరి శ్రీనివాసులు అదేరోజు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు యువకుడు అదృశ్యమైనట్లుగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. హత్య చేసి పూడ్చిపెట్టారు గోపి అదృశ్యమైన విషయమై బాధిత కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో గూడూరు డీఎస్పీ వీఎస్ రాంబాబు సారథ్యంలో సీఐ మల్లికార్జునరావు, ఎస్సై జి.వేణులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్న కొందరు సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారించారు. చివరకు యువకుడిని అక్కడ పనిచేస్తున్న ఎవరో హత్య చేసి గుంతలో పూడ్చిపెట్టినట్లుగా తెలుసుకున్నారు. దీంతో డీఎస్పీతో పాటు పోలీసు అధికారులు సంస్థ సమీప ప్రాంతాల్లో బుధవారం తవ్వకాలు చేపట్టారు. ఓ చోట దుర్వాసన వస్తుండటంతో తవ్వించారు. యువకుడి మృతదేహం బయటపడింది. కాగా గోపి కనిపించకుండా పోయినరోజు నుంచి అక్కడ పనిచేస్తున్న జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు టిప్పర్ డ్రైవర్లు కూడా కనిపించడంలేదని చెబుతున్నారు. దీంతో హత్య వెనుక వారి ప్రమేయం ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డీఎస్పీ రాంబాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో గురువారం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. గోపి మృతిచెందాడన్న విషయం తెలుసుకుని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. -
ఆఫీస్ బాయ్ టు సివిల్ ఇంజనీర్
-
ఇంటి వద్దకే నాణ్యత సేవలు
మొబైల్ టీమ్‌ను ప్రారంభించిన భారతి సిమెంట్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సిమెంటు తయారీ సంస్థ భారతి సిమెంట్ మొబైల్ సాంకేతిక సేవలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు విస్తరించింది. శిక్షణ పొందిన సివిల్ ఇంజనీర్లు ద్విచక్ర వాహనంపై స్వయంగా కస్టమర్ల ఇంటి వద్దకు వెళ్లి ఎటువంటి బిల్డింగ్ మెటీరియల్ ఎంపిక చేసుకోవాలి, నాణ్యమైన కాంక్రీట్‌ను ఏ విధంగా తయారు చేయాలి వంటి అంశాలను వివరిస్తారు. అలాగే నిర్మాణానికి వాడే నీరు, ఇసుక, కంకర నాణ్యతను ప్రత్యేక పరికరాల ద్వారా అక్కడికక్కడే పరీక్షిస్తారు. మొబైల్ సాంకేతిక సేవలను దక్షిణాదిన ఇతర రాష్ట్రాలకు త్వరలో పరిచయం చేస్తామని సంస్థ మార్కెటింగ్ డైరెక్టర్ ఎం.రవీందర్ రెడ్డి తెలిపారు. సిమెంటు రంగంలో ఇటువంటి సేవలను దేశంలో తొలిసారిగా భారతి సిమెంట్ ప్రారంభించిందని గుర్తు చేశారు. కంపెనీ ఇప్పటికే ఈ సేవలను తమిళనాడులో అందిస్తోంది. -
'ఆ బిల్డింగ్‌కు సరైన డిజైనింగ్ లేదు'
-
సివిల్ ఇంజనీర్ మృతిపై అనుమానాలు
శేకూరు(చేబ్రోలు): ఓ సివిల్ ఇంజనీర్ మృతిపై అనుమానాలు వ్యక్తం కావటంతో కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు 25రోజుల తరువాత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటన చేబ్రోలు మండలం శేకూరుపాలెంలో మంగళవారం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు... శేకూరుపాలెంకు చెందిన నెమలికంటి సురేష్‌బాబు (37) నల్లగొండ జిల్లా అర్వపల్లి మండలం లోయపల్లి ప్రాంతంలో ఓఎన్సీ ప్రైవేటు లిమిటెడ్ నిర్వహిస్తున్న కన్స్ట్రక్షన్కు సివిల్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గత నెల 10వ తేదీన శేకూరుపాలెం వచ్చిన సురేష్‌బాబు అక్కడ విధులు నిర్వహించటం కష్టంగా ఉందని, కంపెనీ ఎండీ, జీఎంలు తనపై కక్ష పెట్టుకున్నట్టు భార్యకు తెలిపారు. నెల జీతం తీసుకుని రాజీనామా చేసి వస్తానని కూడా తెలిపినట్టు కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, గతనెల 15వ తేదీన గుండె నొప్పి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యతో సురేష్‌బాబు మృతిచెందినట్టు అక్కడ కంపెనీ యాజమాన్యం తెలిపింది. బిల్డింగ్ మెట్లపై పడిపోయిన సురేష్‌బాబును స్థానిక ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు, తరువాత వరంగల్లు తీసుకుని వెళ్లినట్లు కంపెనీ వారు చెబుతున్న మాటల్లో విశ్వసనీయత లేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. 16వ తేదీన మృతదేహాన్ని అక్కడ నుంచి తీసుకువచ్చి 17వ తేదీన అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహం ముఖంపై గాయాలు, శరీరం అంతా నల్లగా మారిపోవటంతో విష ప్రయోగం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తూ భార్య నెమలికంటి చిన్ని వరంగల్లు పోలీసులకు, ఎస్సీ, ఎస్టీ కమిషన్,మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై మెడికల్ ఫోరెనిక్స్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ శేకూరుపాలెం శ్మశాన వాటికలో మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించారు. వరంగల్లు పోలీసులతో పాటు, చేబ్రోలు ఎస్ఐ కె.ఆరోగ్యరాజు, తహశీల్దారు కె.శివరామప్రసాద్, మతుని కుటుంబసభ్యులు హాజరయ్యారు. -
ఎడ్లబండిని ఢీకొని ఇంజినీర్ మృతి
పుల్కల్ (మెదక్) : జీవనోపాధి కోసం వచ్చిన ఒక సివిల్ ఇంజినీర్ ప్రమాదవశాత్తు ఎద్దుల బండిని ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి మండల పరిధిలోని పెద్దారెడ్డిపేటలో చోటుచేసుకుంది. నల్ల్లగొండ జిల్లా ఆత్మకూర్ మండలం రామన్నగూడెంకు చెందిన గుడుమల్ల సైదులు(37) మునిపల్లి మండలం బుసారెడ్డిపల్లి శివారులోని సింగూర్ ప్రాజెక్టు వద్ద కొనసాగుతున్న వాటర్ గ్రిడ్ పథకంలో ఎల్ఎన్టీ కాంట్రాక్టర్ వద్ద సివిల్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. కాగా, ఆయన పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేటలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఎప్పటిలాగే ఆదివారం సాయంత్రం సింగూర్‌కు వెళ్లి తిరిగి 7.30 గంటల ప్రాంతంలో తన బైక్‌పై వస్తుండగా పెద్దారెడ్డిపేటలోని అంబేద్కర్ చౌక్ సమీపంలో ఎదురుగా వస్తున్న ఎడ్ల (దున్నపోతుల) బండిని ఢీకొట్టి తీవ్రగాయాలపాలయ్యారు. స్థానికులు ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. సైదులుకు తల్లి, భార్య యశోదతో పాటు ఇద్దరు కుమారులున్నారు. -
ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేయకపోతే...
వేదిక కాలం ఎలా ఎవరి కోసమూ ఆగదో... వయసు కూడా అంతే. పరుగులు తీస్తుంది తప్ప ఎక్కడా ఆగనే ఆగదు. అందుకే అది మన చేయి దాటిపోయేలోపు చేయాల్సింది చేసెయ్యాలి. లేదంటే తర్వాత తీరిగ్గా బాధపడినా ఉపయోగం ఉండదు. ఈ ఉపోద్ఘాతం ఎందుకనేనా? నేను ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేయలేదు. దానికి ఇప్పటికీ బాధపడుతున్నాను. నాన్న సివిల్ ఇంజినీర్. అమ్మ డాక్టర్. ఇద్దరూ ఎంత బిజీ అంటే... పొద్దున్న నేను లేవకముందు, సాయంత్రం నేను నిద్రపోయాక మాత్రమే నా ముఖాన్ని చూసేంత. దాంతో వాళ్లిద్దరి ముఖాలూ చూసే చాన్స్ నాకెప్పుడో కానీ దక్కేది కాదు. మొదట్లో బెంగగా ఉండేది. తర్వాత అలవాటైపోయింది. కాలేజీ ఈడు వచ్చేసరికి ఆ ఏకాంతం బాగుందనిపించేది. నేనేం చేసినా అడిగేవాళ్లు లేరని చాలా స్వేచ్ఛగా ఫీలయ్యేదాన్ని. నన్ను చేర్పించినప్పుడు మాత్రమే అమ్మా నాన్నలు నా కాలేజీలో అడుగు పెట్టారు. ఆ తర్వాత ఎప్పుడూ వచ్చిందే లేదు. నాకు మాత్రం ఏ లోటూ రానిచ్చేవారు కాదు. కావలసినంత పాకెట్ మనీ. అది దేనికి ఖర్చు పెడుతున్నానో చూసే తీరిక వారికెప్పుడూ లేదు. నేను ఆ డబ్బును పార్టీలు చేసుకోవడానికి ఉపయోగించాను. తిరగడానికి కారుంది. అందులో నేనెక్కడికి వెళుతున్నానో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మమ్మీకి గానీ, డాడీకి గానీ అనిపించలేదు. నేను ఆ కారును నా బాయ్ ఫ్రెండ్‌తో పిక్నిక్స్కి వెళ్లడానికి వాడుకున్నాను. నన్ను అడిగేవాళ్లు లేరన్న ఫీలింగ్ నన్నెంత పెడతోవ పట్టిస్తోందో అప్పుడు అర్థం కాలేదు. ఏనాడూ సరిగ్గా చదివింది లేదు కాబట్టి ఫైనల్ ఎగ్జామ్స్‌లో ఫెయిలయ్యాను. సప్లిమెంటరీ రాసినా పాసవ్వలేదు. మళ్లీ మళ్లీ రాయడంతోనే రెండేళ్లు గడిచిపోయింది. నా క్లాస్మేట్స్ అందరూ ముందుకెళ్లిపోయారు. త్వరత్వరగా చదువులు పూర్తి చేసి ఉద్యోగాల్లో సెటిలైపోయారు. ఎప్పుడూ చదువు మీద మనసు లేదు కాబట్టి నా చదువు పూర్తయ్యేసరికి చాలాకాలమే పట్టింది. అత్తెసరు మార్కులతో పాసయ్యాను కాబట్టి మంచి ఉద్యోగం వట్టి కల గానే మిగిలిపోయింది. నాన్న రికమెండేషన్‌తో ఏదో చిన్న ఉద్యోగమైతే వచ్చింది కానీ మిగతా వాళ్లలాగా నేను బాగా సెటిలవ్వలేకపోయానే అన్న బాధ ఇప్పటికీ నన్ను తొలిచేస్తూ ఉంది. కనీసం ఏదైనా ప్రభుత్వోద్యోగం కోసం ప్రయత్నిద్దామన్నా కూడా వయసు పరిమితి అయిపోయి, అదీ కలగానే మిగిలిపోయింది. చదువుకోవాల్సిన వయసులో సరదాల కోసం ఆరాటపడ్డాను. స్థిరపడాల్సిన వయసులో చదువు పూర్తి చెయ్యాలని ఆరాటపడ్డాను. ప్రశాంతంగా కాలు మీద కాలేసుకుని బతకాల్సిన వయసులో మంచి సెటిల్మెంట్ కోసం ఇంకా ఆరాటపడుతూనే ఉన్నాను. ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పటికి అర్థం చేసుకున్నాను. కానీ ఏం లాభం... అందమైన కెరీర్‌ని, ఆనందకరమైన జీవితాన్ని కోల్పోయాను! - నళిని, బెంగళూరు -
మండలానికో రీసోర్స్ భవనం
ఇందూరు,న్యూస్‌లైన్: జిల్లాలోని ప్రతి మండలంలో పంచాయతీ రాజ్ శాఖ రీసోర్స్ సెంటర్లను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం ఒక్కో భవనానికి రూ.20 లక్షల వరకు ఖర్చు చేయనుంది. ఈ మేరకు పంచాయతీ శాఖ అధికారులకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ప్రస్తుతం ఎలాంటి సమావేశాలు నిర్వహించుకోవాలన్నా... అధికారులు, పాలక వర్గాలు ఏదైనా హోట్‌ల్‌లోని కాన్ఫరెన్స్ హాటళ్లను ఆశ్రయించాల్సి వస్తోంది. స్థలాలు వెదకడం పూర్తికాగానే రీసోర్స్ సెంటర్ భవనాల నిర్మాణాల పనులు ప్రారంభమవుతాయి. ఐదు నెలల క్రితమే గ్రామ పంచాయతీ పాలక వర్గాలు ఏర్పాటు కాగా, త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి. కొత్త పాలక వర్గాలకు పంచాయతీరాజ్ శాఖ తరపున శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. అధికారులు కూడా శిక్షణ తరగతులను ఈ భవనాల్లో నిర్వహించుకోవచ్చు. రీసోర్స్ సెంటర్ల నిర్వహణ కోసం కో ఆర్డినేటర్, బిల్డింగ్ సూపర్వైజర్, సివిల్ ఎలక్ట్రికల్ ఇంజినీర్, డాటాఎంట్రీ ఆపరేటర్లను నియమిస్తారు. జిల్లా కేంద్రంలోనూ.. మండల కేంద్రాల్లో పంచాయతీ రీసోర్స్ సెంటర్ల మాదిరిగానే జిల్లా కేంద్రంలోనూ జిల్లా పంచాయతీ రీసోర్స్ సెంటర్‌ను నిర్మించనున్నారు. ఈ భవన నిర్మాణం కోసం కోటి రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఈ భవన నిర్మాణం కోసం ముందుగా సిర్పూర్ గ్రామ శివారులో స్థలం వెదికారు. అయితే జిల్లా కేంద్రానికి దూరంగా ఉండటంతో దానిని రద్దు చేశారు.ప్రస్తుతం జిల్లా పరిషత్ కార్యాలయం వెనుక శిథిలావస్థలో ఉన్న క్వార్టర్లను కూలివేసి అక్కడ భవనాన్ని నిర్మించాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ భవనాన్ని త్వరితంగా నిర్మించేందుకు నిధుల విడుదల కోసం జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ప్రత్యేక చొరవ చూపుతున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. సమావేశాలకు,శిక్షణ తరగతులకు అనువుగా ఉంటుంది... - సురేశ్ బాబు, జిల్లా పంచాయతీ అధికారి జిల్లాలో నిర్మించే రీసోర్స్ సెంటర్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పంచాయతీరాజ్ శాఖ అధికారులతో పాటు పాలక వర్గాలకు సమావేశాలు, శిక్షణ తరగతులు నిర్వహించుకోవడానికి అనువుగా ఉంటాయి. వేరే భవనాల కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు.