
పట్నా: జూనియర్ సివిల్ ఇంజనీర్ ఉద్యోగాల కోసం పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్(పీహెచ్‌ఈడీ) నిర్వహించిన పరీక్షలో సన్నీ లియోన్ టాపర్‌గా నిలిచింది. ఉద్యోగ అర్హత పరీక్షలో అత్యధిక మార్కులతో సహా గ్రాడ్యూయేషన్‌లో సాధించిన మార్కులతో కలిపి మొత్తం 98.5 పాయింట్లతో మెరిట్ లిస్టులో తొలిస్థానంలో ఉంది. దీంతో జూనియర్ సివిల్ ఇంజనీర్‌గా త్వరలోనే బాధ్యతలు చేపట్టనుంది. వీటికి సంబంధించిన వివరాలు పీహెచ్‌ఈడీ అధికారికంగా ప్రకటించింది. మరిన్ని వివరాల కోసం తమ అధికారిక వెబ్‌సైట్ చూడాలంటూ కోరింది.
అయితే ఇక్కడ సన్నీ లియోన్ అంటే హీరోయిన్ కాదు. బిహార్‌కు చెందిన మామూలు మధ్యతరగతి కుటంబానికి చెందిన మహిళ. ఆమె తండ్రి పేరు లియోనా లియోన్. అయితే ప్రస్తుతం పీహెచ్‌ఈడీ అధికారిక వెబ్‌సైట్‌లో మెరిట్ జాబితాలో ఉన్న సన్నీ లియోన్‌కు సంబంధించిన వివరాలను స్ర్కీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఇది వైరల్‌గా మారుతోంది. హీరోయిన్ సన్నీ లియోనే పరీక్షలో టాపర్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment