2040లో ఏం జరుగుతుంది? | The film starring Upendra will be released worldwide on the 20th of this month | Sakshi
Sakshi News home page

2040లో ఏం జరుగుతుంది?

Published Thu, Dec 12 2024 5:05 AM | Last Updated on Thu, Dec 12 2024 5:05 AM

The film starring Upendra will be released worldwide on the 20th of this month

కన్నడ స్టార్‌ ఉపేంద్ర హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘యుఐ: ది మూవీ’. రీష్మా నానయ్య, మురళీ శర్మ, సన్నీ లియోన్, నిధి సుబ్బయ్య, సాధు కోకిల, మురళీ కృష్ణ, ఇంద్రజిత్‌ లంకేష్‌ ముఖ్యపాత్రలుపోషించారు. లహరి ఫిల్మ్స్, జి. మనోహరన్‌ – వీనస్‌ ఎంటర్‌టైనర్స్‌ కేపీ శ్రీకాంత్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. 

నవీన్‌ మనోహరన్‌ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గీతా ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్‌ చేయనున్నారు. 

‘‘ప్రపంచంలో 2040లో ఏం జరుగుతుంది? అనే నేపథ్యంలో ‘యుఐ: ది మూవీ’ కథ ఉంటుంది. చాలా విరామం తర్వాత ఉపేంద్ర దర్శకత్వం వహించిన ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement