భారతీ సిమెంట్‌కు ఫ్రెంచ్ అవార్డ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: 2013-14 సంవత్సరానికి గాను ఆసియాలోనే మోస్ట్ ప్రామిసింగ్ సిమెంట్ బ్రాండ్ అవార్డు భారతి సిమెంట్ కార్పొరేషన్‌కు (బీసీసీపీఎల్) దక్కింది. ఫ్రెంచ్ కంపెనీ ‘వికా’ అందించే ఈ అవార్డు కోసం ఆసియా నుంచి 1500 కంపెనీలు పోటీపడగా.. ఇందులో 150 సంస్థలు టాప్ లిస్ట్‌లో నిలిచాయి. చివరికి నిర్మాణ రంగంలో సరికొత్త అధ్యాయానికి తెరతీసిన భారతి సిమెంట్‌కు ఈ అవార్డ్ దక్కింది.
ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ అవార్డును రెమీ మార్టిన్ బ్రాండ్ అంబాసిడర్ నియోమి లెవిక్జ్యూ, వరల్డ్ కన్సల్టింగ్ అండ్ రీసెర్చ్ కార్పొరేషన్ (డబ్ల్యూసీఆర్సీ) చైర్మన్ అభిజిత్ ఘోష్, ఎండీ అభిమన్యు ఘోష్ చేతుల మీదుగా బీసీసీపీల్ మార్కెటింగ్ డెరైక్టర్ ఎం.రవీందర్ రెడ్డి అందుకున్నారు. భారతీ సిమెంట్‌కు కడప, గుల్బర్గాల్లో తయారీ కేంద్రాలున్నాయి. ఏటా 7.75 మిలియన్ టన్నుల సిమెంట్‌ను ఉత్పత్తి చేస్తోంది. ప్రపంచస్థాయి ప్రాసెసింగ్, అత్యుత్తమ నాణ్యత, విస్తృతమైన డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ కలిగిఉంది.