అగ్రగామి భారతి సిమెంట్
తవణంపల్లె : సిమెంటు రంగంలో అగ్రగామిగా భారతి సిమెంట్ నిలిచిందని ఆ సిమెంట్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ మల్లికార్జునరెడ్డి తెలిపారు. మండలంలోని అరగొండలో గురువారం తాపీమేస్త్రీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ సిమెంటు రంగంలో ఎంతో పోటీ ఉన్నప్పటికీ భారతి సిమెంటు మాత్రం మూడు రెట్లు మెరుగై నంబర్-1గా నిలిచిందన్నారు.
క్యాపర్‌కోర్ ప్యాకింగ్, ధర్మల్ టెక్నాలజి, రోబోటెక్ క్వాలిటీ కంట్రోలుతో తయారు చేసిన నాణ్యమైన సిమెంటు భారతి సిమెంట్ అన్నారు. భారతి సిమెంటు సేల్స్ మేనేజర్ బాలకృష్ణ సిమెంటు నాణ్యతను వివరించారు. టెక్నికల్ ఆఫీసర్ త్యాగపతి నిర్మాణానికి తాపీ మేస్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. అనంతరం తాపీ మేస్త్రీలకు రూ.లక్ష విలువగల జీవితబీమా బాండ్లను పంపిణీ చేశారు. అరగొండ తేజ ట్రేడర్స్ యజమాని ప్రకాష్‌బాబు, మనోహర్‌నాయుడు, తాపీ మేస్త్రీలు పాల్గొన్నారు.
పెనుమూరులో తాపీ మేస్త్రీలకు అవగాహన
పెనుమూరు : గురువారం రాత్రి పెనుమూరులో సుజాత ఎంటర్ ప్రైజస్ ఆధ్వర్యంలో తాపీ మేస్త్రీలకు భారతి సిమెంట్ కంపెనీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని భారతి సిమెంట్ జిల్లా సేల్స్ ఆఫీసర్ యం.బాలకృష్ణ ప్రారంబించారు. ఆయన మాట్లాడు తూ జర్మన్ టెక్నాలజీతో భార తి సిమెంట్ తయారు చేస్తున్నట్లు చెప్పారు. రోబోటిక్ క్వాలిటీ కంట్రోల్‌తో వినియోగదారులకు నాణ్యమైన సిమెంట్ అందిస్తోందన్నారు.
అనతికాలంలోనే సిమెంట్ రంగంలో అగ్రగామిగా భార తి సిమెంట్ చరిత్ర సృష్టిస్తోందన్నారు. టెక్నికల్ ఆఫీసర్ త్యాగపతి గృహ నిర్మాణంలో తాపీ మేస్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా తాపీ మేస్త్రీలకు ఉచిత ప్రమాదబీమా పాలసీలను అందించారు. ఈ కార్యక్రమంలో సుజాత ఎంటర్ ప్రైైజెస్ అధినేత నాగరాజరెడ్డి, చిరంజీవి పాల్గొన్నారు.