Mallikarjuna Reddy
-
సమ్మె వద్దు.. ఆర్టీసీని కాపాడుకుందాం
సాక్షి, అమరావతి: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును మర్చిపోవద్దని సంస్థ ఉద్యోగులకు ఆర్టీసీ చైర్మన్ ఎ.మల్లికార్జునరెడ్డి సూచించారు. ఇతర సమస్యలను కూడా సీఎం జగన్ త్వరలోనే పరిష్కరిస్తారని భరోసా ఇచ్చారు. తాజా పీఆర్సీకి, ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధం లేదన్నారు. ఆర్టీసీని కాపాడుకునేందుకు.. సమ్మెకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీని అభివృద్ధిలోకి తీసుకువచ్చేందుకు సీఎం వైఎస్ జగన్ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అందులో ముఖ్యమైనదని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల మనఃసాక్షికి కూడా ఆ విషయం తెలుసన్నారు. ప్రభుత్వం రెండేళ్లలో ఆర్టీసీ ఉద్యోగుల జీతాల కోసం రూ.6,200 కోట్లకు పైగా ఖర్చు చేసిందని వివరించారు. సంస్థకు రూ.6 వేల కోట్ల అప్పులుండగా.. కరోనా వల్ల ఆదాయం తగ్గడంతో కేవలం రూ.1,490 కోట్లే తీర్చగలిగామని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఎవరో చెప్పిన మాటలకు ప్రభావితమై సమ్మెకు దిగితే.. సంస్థ తీవ్రంగా నష్టపోతుందనే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. ఆ భారం కూడా మళ్లీ ఉద్యోగులపైనే పడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేయడం వల్ల అక్కడి ఉద్యోగుల ప్రయోజనాలకు ఎంతగా విఘాతం కలిగిందో ఓసారి గుర్తు చేసుకోవాలని మల్లికార్జునరెడ్డి సూచించారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు వెళ్లరనే తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే కొన్ని సంఘాలు సమ్మెలో పాల్గొనట్లేదని ప్రకటించాయని.. మిగిలిన సంఘాలు కూడా సమ్మెకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకుండా మెరుగైన సేవలందించి.. ఆర్టీసీని అభివృద్ధి పథంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ఉద్యోగులపైనా ఉందన్నారు. -
ఏపీఎస్ ఆర్టీసీ పాలక మండలి నియామకం
సాక్షి, అమరావతి: ఏపీఎస్ ఆర్టీసీ పాలక మండలిని ప్రభుత్వం నియమించింది. ఆర్టీసీ చైర్మన్ ఎ.మల్లికార్జునరెడ్డి నేతృత్వంలోని ఈ పాలకమండలిలో ఓ వైస్‌చైర్మన్, నలుగురు ఆర్టీసీ జోనల్ చైర్మన్లతోపాటు మరో ఆరుగురు రాష్ట్ర ఉన్నతాధికారులు, ఐదుగురు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ మేరకు రోడ్లు, భవనాలు, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు మంగళవారం ఉత్తర్వులిచ్చారు. ఆర్టీసీకి పూర్తిస్థాయిలో పాలక మండలిని నియమించడంపై నేషనల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. పాలక మండలి ఇదీ.. చైర్మన్: ఎ.మల్లికార్జున రెడ్డి, వైస్‌చైర్మన్–డైరెక్టర్: మెట్టపల్లి చిన్నప్పరెడ్డి విజయానందరెడ్డి, డైరెక్టర్లు: గాదల బంగారమ్మ, తాతినేని పద్మావతి, బత్తుల సుప్రజ, మల్యావతం మంజుల, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, జీఏడీ కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ, ఆర్టీసీ అదనపు కమిషనర్/ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆర్టీసీ ఆర్థిక సలహాదారు, అసోíసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డైరెక్టర్, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ డైరెక్టర్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్. -
చైర్మన్‌గా ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడిపిస్తా: మల్లికార్జునరెడ్డి
సాక్షి, విజయవాడ: ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్‌గా ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చైర్మన్ మల్లికార్జునరెడ్డి అన్నారు. ఉద్యోగుల భద్రత విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, సీఎం జగన్ ఆర్టీసీని ఇప్పటికే ప్రభుత్వంలో విలీనం చేశారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ చైర్మన్‌గా మల్లికార్జునరెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటానని తెలిపారు. చైర్మన్‌గా ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పారు. అధికారులను సమన్వయం చేసుకొని చైర్మన్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తామని తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆర్టీసీని సీఎం ఇప్పటికే ప్రభుత్వంలో విలీనం చేశారని, ఉద్యోగుల భద్రత విషయంలో ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉందని చెప్పారు. రాబోయే రోజుల్లో సంస్థ అభివృద్ధే లక్ష్యమని, ఆర్టీసీ ఎండీతో కలిసి నడుస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఏపీఎస్ ఆర్టీసీ అభివృద్ధికి అన్ని విధాలా కృషిచేస్తా : మల్లికార్జున రెడ్డి
-
పిల్లల్ని చంపుతాడనుకోలేదు..
-
ఘోరం: కవల పిల్లల్ని చంపి ఆపై కారులో..
సాక్షి, హైదరాబాద్: నగరంలో దారుణం చోటుచేసుకుంది. అభంశుభం తెలియని ఇద్దరి మానసిక దివ్యాంగులను మేనమామే హత్యచేశాడు. ఇద్దరు కూడా 12 ఏళ్లలోపు కవలలు కావడం గమనార్హం. ఈ ఘటన చైతన్యపురి పోలీసు పరిధిలోని సత్యనారాయణపురం జరిగింది. మృతులు నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన సృజన(12), విష్ణువర్దన్ రెడ్డి(12)లుగా గుర్తించారు. మృతులు నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన శ్రీనివాస రెడ్డి, లక్ష్మీ దంపతుల పిల్లలుగా గుర్తించారు. శుక్రవారం సాయంత్రం లక్ష్మీ తమ్ముడు మల్లికార్జున రెడ్డి మిర్యాలగూడకు వెళ్లారు. పిల్లలకు స్విమింగ్ నేర్పిస్తా అని చెప్పి ఆ కలలను తన కారులో హైదరాబాద్‌లోని సత్యనారయణపురంలో తాను అద్దెకు ఉంటున్న ఇంట్లొకి తీసుకొచ్చారు. శుక్రవారం రాత్రి పిల్లలిద్దరిని గొంతు నులిపి చంపేశారు. అనంతరం మరో ఇద్దరితో కలిసి మృత దేహాలను కారులో తరలించడానికి ప్రయత్నించారు. అనుమానం వచ్చి ఇంటి యజమాని బయటకు వచ్చి చూడగా కారులో మృతదేహాలు కనిపించాయి. ఈ విషయాన్ని చుట్టుపక్కల వారితో చెప్పి వారిని అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితులను చైతన్యపురి పోలీసు స్టేషన్‌కు తరలించారు. కాగా పిల్లల మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్లే హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే పిల్లల తల్లిదండ్రులకు తెలిసే ఈ హత్య జరిగిందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. -
వైఎస్సార్సీపీ నేతకు తప్పిన ప్రమాదం
సాక్షి, కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాట్రెడ్డి మల్లికార్జున రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న బైకును తప్పించడానికి వెళ్లి పక్కనే ఉన్న సుంకులమ్మ గుడిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన బుధవారం బనగానపల్లె మండలం రాళ్లకొత్తూరు బాట సుంకులమ్మ ఆలయం వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మల్లికార్జున రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఆయనను బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైఎస్సార్సీపీ బనగానపల్లె నియోజకవర్గ ఇంచార్జ్ కాటసాని రామిరెడ్డి మల్లికార్జున రెడ్డిని పరామర్శించారు. -
నవ వరుడు ఆత్మహత్య
-
నవ వరుడు ఆత్మహత్య
పెండ్లిమర్రి: మండలంలోని శ్రీనివాసపురం గ్రామానికి చెందిన మల్లికార్జునరెడ్డి(29) అనే యువకుడు శుక్రవారం రాత్రి వేప చెట్టుకు ఉరి వేసుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పిచ్చిరెడ్డి, రాములమ్మ దంపతుల రెండవ కుమారుడు శ్రీనివాసులరెడ్డి ఎంసీఏ పూర్తి చేసి బెంగళూరులోని టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండే వాడు. అతనికి వీరపునాయునిపల్లె మండలం సంగాలపల్లెకు చెందిన వధువుతో పెద్దలు ఆదివారం ఉదయం 7–30 గంటలకు పెళ్లి నిశ్చయించారు. వివాహానికి కడపలో ఉన్న సేహితున్ని పిలిచి, అలాగే షేవింగ్ చేయించుకుని వస్తానని చెప్పి ఇంటి దగ్గర నుంచి మల్లికార్జున శుక్రవారం సాయంత్రం వెళ్లాడు. రాత్రి ఆలస్యం అయ్యే సరికి ఫోన్ చేయగా వస్తానులే అన్నాడు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి ఫోన్ చేసి.. ‘యోగివేమన యూనివర్సిటీ వద్ద బైకు కింద పడింది. మీరు రావాలి’ అని చెప్పాడు. ఇంటి వద్ద నుంచి అతని అన్న సాంబశివారెడ్డి మరొకరు కలిసి వెళ్లగా అక్కడ కనిపించలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. వాళ్లు భయపడి కుటుంబ సభ్యులు, గ్రామంలో ఉన్న బంధువులకు చెప్పడంతో.. అందరూ కలిసి వెళ్లి వెతికారు. యూనివర్సిటీ సమీపంలోని పొలాల్లో వేప చెట్టుకు తాడుతో ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించాడు. వాళ్లు అక్కడికి వెళ్లి చూసే సరికి చనిపోయి ఉన్నాడు. మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పుడే కొనుకొని తెచ్చిన కొత్త నోట్ పుస్తకం సంఘటన స్థలంలో స్కూటర్ వద్ద ఉంది. దానిని పరిశీలిస్తే ‘అమ్మను, అక్కను, పిల్లలను బాగా చూసుకోండి అన్నా. పెళ్లి కుమార్తె వాళ్లు చాలా మంచి వారు. ఈ పనికి ఎవరు కారణం కాదు’ అని సూసైడ్ నోట్లో రాశాడు. మృతదేహనికి కడప రిమ్స్‌లో శవ పంచనామా నిర్వహించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తి చేస్తున్నట్లు ఏఎస్ఐ విష్ణునారాయణ తెలిపారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి... మల్లికార్జునరెడ్డి వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగి ఉన్నత చదువు చదివాడు. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ నెలకు రూ.60 వేలు జీతం తీసుకుంటున్నాడు. సంతోషంగా గడిపే కుటుంబంలో ఒక్క సారిగా విషాధ చాయలు అలుముకున్నాయి. మృతునికి అమ్మ, అన్న, వదిన మాత్రమే ఉన్నారు. తండ్రి మూడేళ్ల క్రితం మృతి చెందాడు. రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్న సాంబశివారెడ్డి కోమాలోకి వెళ్లాడు. అప్పుడు దాదాపు రూ.10 లక్షలు ఖర్చు అయింది. తర్వాత కోలుకున్నాడు. ఇప్పుడు ఇలా జరగడంతో కుటుంబ సభ్యలు జీర్ణించుకోలేకున్నారు. మృతునికి పెళ్లి ఇష్టం లేకనో... లేక ఇతర కారణాలతోనో.. తన సమస్యలను ఇంట్లో చెప్పుకోలేక, చెప్పినా తీరవనుకొని అత్మహత్య చేసుకొని ఉంటాడని భావిస్తున్నారు. -
పిడుగు పడి రైతు, ఎద్దులు మృతి
కడప: వైఎస్ఆర్ జిల్లా కమలాపురం శివారులో మల్లికార్జునరెడ్డి (35) అనే రైతు... తన పొలంలో ఎద్దులతో పొలం దున్నుతున్నాడు. ఆ క్రమంలో పిడుగు పడింది. దీంతో మల్లికార్జునరెడ్డి అక్కడికక్కడే మరణించాడు. రెండు ఎద్దులు కూడా మరణించాయి. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు చోటు చేసుకుంది. -
రాజంపేటలో తన్నుకున్న పచ్చతమ్ముళ్లు
రాజంపేట: తెలుగుదేశం పార్టీ మండల కమిటీ ఎంపికపై తలెత్తిన వివాదం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా రాజంపేటలో చోటు చేసుకుంది. నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటలో గురువారం తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మండల కమిటీల ఎంపిక చేపట్టారు. ఒంటిమిట్ట మండల కమిటీ ఎంపిక ఏకపక్షంగా జరిగిందంటూ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మయ్య వర్గం ఆరోపించింది. వారి అభ్యంతరాలతో గొడవ ప్రారంభమవడంతో ప్రభుత్వ విప్ మల్లికార్జునరెడ్డి వర్గం ఎదురుదాడికి దిగింది. వాదప్రతివాదాలు ముదిరి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దశలో జోక్యం చేసుకున్న మల్లికార్జునరెడ్డి..గొడవలకు కారణమయ్యే వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించటంతోపాటు బ్రహ్మయ్య వర్గానికి చెందిన కొందరిని సమావేశం బయటకు పంపడంతో పరిస్థితి చక్కబడింది. -
చిత్తూరు షుగర్స్ ఎండీ రాజీనామా
చిత్తూరు: చిత్తూరు సహకార చక్కెర కర్మాగారం ఎండీ మల్లికార్జునరెడ్డి సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని డెరెక్టర్ ఆఫ్ షుగర్స్, హైదరాబాద్‌కు ఫ్యాక్స్ ద్వారా పంపారు. కార్మికుల పండుగ అడ్వాన్స్ ఇచ్చే విషయంలో చైర్మన్ ఎన్పీ.రామకృష్ణ, ఎండీ మధ్య సోమవారం చోటుచేసుకున్న గొడవే రాజీనామాకు దారితీసినట్లు తెలుస్తోంది. ఏడాదిగా ఫ్యాక్టరీలో కేన్ ఇన్చార్జిగా ఉన్న మల్లికార్జునరెడ్డి మూడు నెలల క్రితం ఎండీగా బాధ్యతలు చేపట్టారు. చిత్తూరు సహకార చక్కెర కర్మాగారం పరిధిలో మూడేళ్లుగా రైతులకు సంబంధించి *12 కోట్ల బకాయిలు, కార్మికులకు సంబంధించి *8 కోట్లు మొత్తం *20 కోట్లు చెల్లించాల్సి ఉంది. రెండు నెలల క్రితం పాలకవర్గం కర్మాగారంలోని స్టోర్స్ తాకట్టుపెట్టి ఆప్కాబ్ ద్వారా *కోటి రుణం తీసుకుంది. ఈ మొత్తం నుంచి కార్మికులకు ఒక నెల జీతం మాత్రమే ఇచ్చారు. మరో *14 లక్షలు చైర్మన్, ఎండీ ఉమ్మడి ఖాతాలో ఉన్నట్లు సమాచారం. సంక్రాంతికి పండుగకు అడ్వాన్ ఇస్తామని చైర్మన్, ఎండీ కార్మికులకు హామీ ఇచ్చారు. కా ర్మికులు సోమవారం ఉదయం పండుగ అడ్వాన్స్ విషయం ఎండీ వద్ద ప్రస్తావించారు. దాంతో ఎండీ, సీసీ కుమారస్వామి నాయుడు, సీఈ మధుసూదన్‌రెడ్డి కలసి చైర్మన్ వద్దకెళ్లారు. కార్మికుల పండుగ అడ్వాన్స్ విషయం మాట్లాడారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటామాట పెరిగి వాగ్యుద్ధంగా మారినట్లు సమాచారం. కార్మికులకు పైసా ఇచ్చేదిలేదంటూ చైర్మన్ చిందులు తొక్కినట్లు తెలుస్తోంది. దీంతో మనస్థాపానికి గురైన ఎండీ బయటకు వచ్చి రాజీనామా చేశారు. ఇదే విషయాన్ని ఫ్యాక్టరీ వద్ద ఉన్న కార్మికులకు చెప్పారు. ఇక తాను పదవిలో కొనసాగేది లేదంటూ వెళ్లిపోయారు. రైతులు, కార్మికులకు న్యాయం చేయలేక పోయినందుకే రాజీనామా ఫ్యాక్టరీ కార్మికులకు, రైతులకు న్యాయం చే యలేకపోయినందుననే ఎండీ పదవికి రాజీ నామా చేసినట్లు చిత్తూరు చక్కెర కర్మాగారం ఎండీ మల్లికార్జునరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఇన్నాళ్లు న్యాయం చేసేందుకు ప్రయత్నించానన్నారు. అయినా తనవల్ల కాలేదన్నారు. వారికి న్యాయం చేసే స్టేజీలో లేనందునే పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. తనకు కార్మికులు, రైతులవల్ల ఎటువంటి ఇబ్బందు లు లేవన్నారు. ఫ్యాక్టరీని నడపాలని ఎంత ప్రయత్నించినా వీలుకాలేదని చెప్పారు. -
అగ్రగామి భారతి సిమెంట్
తవణంపల్లె : సిమెంటు రంగంలో అగ్రగామిగా భారతి సిమెంట్ నిలిచిందని ఆ సిమెంట్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ మల్లికార్జునరెడ్డి తెలిపారు. మండలంలోని అరగొండలో గురువారం తాపీమేస్త్రీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ సిమెంటు రంగంలో ఎంతో పోటీ ఉన్నప్పటికీ భారతి సిమెంటు మాత్రం మూడు రెట్లు మెరుగై నంబర్-1గా నిలిచిందన్నారు. క్యాపర్కోర్ ప్యాకింగ్, ధర్మల్ టెక్నాలజి, రోబోటెక్ క్వాలిటీ కంట్రోలుతో తయారు చేసిన నాణ్యమైన సిమెంటు భారతి సిమెంట్ అన్నారు. భారతి సిమెంటు సేల్స్ మేనేజర్ బాలకృష్ణ సిమెంటు నాణ్యతను వివరించారు. టెక్నికల్ ఆఫీసర్ త్యాగపతి నిర్మాణానికి తాపీ మేస్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. అనంతరం తాపీ మేస్త్రీలకు రూ.లక్ష విలువగల జీవితబీమా బాండ్లను పంపిణీ చేశారు. అరగొండ తేజ ట్రేడర్స్ యజమాని ప్రకాష్‌బాబు, మనోహర్‌నాయుడు, తాపీ మేస్త్రీలు పాల్గొన్నారు. పెనుమూరులో తాపీ మేస్త్రీలకు అవగాహన పెనుమూరు : గురువారం రాత్రి పెనుమూరులో సుజాత ఎంటర్ ప్రైజస్ ఆధ్వర్యంలో తాపీ మేస్త్రీలకు భారతి సిమెంట్ కంపెనీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని భారతి సిమెంట్ జిల్లా సేల్స్ ఆఫీసర్ యం.బాలకృష్ణ ప్రారంబించారు. ఆయన మాట్లాడు తూ జర్మన్ టెక్నాలజీతో భార తి సిమెంట్ తయారు చేస్తున్నట్లు చెప్పారు. రోబోటిక్ క్వాలిటీ కంట్రోల్‌తో వినియోగదారులకు నాణ్యమైన సిమెంట్ అందిస్తోందన్నారు. అనతికాలంలోనే సిమెంట్ రంగంలో అగ్రగామిగా భార తి సిమెంట్ చరిత్ర సృష్టిస్తోందన్నారు. టెక్నికల్ ఆఫీసర్ త్యాగపతి గృహ నిర్మాణంలో తాపీ మేస్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా తాపీ మేస్త్రీలకు ఉచిత ప్రమాదబీమా పాలసీలను అందించారు. ఈ కార్యక్రమంలో సుజాత ఎంటర్ ప్రైైజెస్ అధినేత నాగరాజరెడ్డి, చిరంజీవి పాల్గొన్నారు. -
విషమంగా మల్లిఖార్జునరెడ్డి ఆరోగ్యం
కడప(వైఎస్ఆర్ జిల్లా): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆమరణదీక్షకు మద్దతుగా దీక్ష చేస్తున్న ఆయన బంధువు దుర్గాయపల్లి మల్లికార్జునరెడ్డి ఆరోగ్యం బాగా క్షీణించింది. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. జగన్ దీక్షకు మద్దతుగా ఆయన 4 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. దీక్ష విరమించాలని వైద్యులు చెప్పినా ఆయన ఖాతరు చేయడంలేదు. జగన్ దీక్ష ముగిసే వరకూ తాను దీక్ష విరమించబోనని మల్లికార్జునరెడ్డి స్పష్టం చేశారు.