సాక్షి, కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాట్రెడ్డి మల్లికార్జున రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న బైకును తప్పించడానికి వెళ్లి పక్కనే ఉన్న సుంకులమ్మ గుడిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన బుధవారం బనగానపల్లె మండలం రాళ్లకొత్తూరు బాట సుంకులమ్మ ఆలయం వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మల్లికార్జున రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఆయనను బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైఎస్సార్‌సీపీ బనగానపల్లె నియోజకవర్గ ఇంచార్జ్ కాటసాని రామిరెడ్డి మల్లికార్జున రెడ్డిని పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment