రోడ్డు ప్రమాదంలో వైఎస్‌ఆర్‌సీపీ నేతకు గాయాలు
Published Sun, Jul 30 2017 8:08 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
కర్నూలు: నంద్యాల సమీపంలో ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో జమ్మలమడుగు వైఎస్‌ఆర్‌సీపీ ఇంచార్జ్ సుధీర్ రెడ్డికి గాయాలయ్యాయి. ఆయన ప్రయాణిస్తున్న కారు టైర్ పంక్చర్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఆయనతో పాటు మరో ఐదుగురికి గాయాలయినట్లు తెలుస్తోంది. చికిత్స కోసం సుధీర్‌రెడ్డిని కర్నూలులోని ఆసుపత్రికి తరలించారు.
Advertisement
Advertisement