katasani ramireddy
-
ఆదేశాలిచ్చినా కౌంటర్లు వేయరా?
సాక్షి, అమరావతి: తగినంత సమయం ఇస్తున్నా, ఆయా కేసుల్లో అధికారులు కౌంటర్లు దాఖలు చేయకపోతుండటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసుల విషయంలో అధికారులు మందకొడిగా ఉన్నారని, ఇలా నిద్రపోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. నంద్యాల జిల్లాలో లైమ్ స్టోన్ ఖనిజం ఉన్న భూములను అసైన్మెంట్ కింద భూమి లేని పేదలకు ఇస్తున్నారని, దీని వెనుక బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి (ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే) ఉన్నారని, దీనిని అడ్డుకోవాలని కోరుతూ అప్పటి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి (ప్రస్తుతం ఎమ్మెల్యే) 2023లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గతంలో విచారణ జరిపిన సీజే ధర్మాసనం అన్ని వివరాలతో మెరుగైన అఫిడవిట్ దాఖలు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించింది. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శిని సుమోటోగా ప్రతివాదిగా చేరుస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తాజాగా ఈ వ్యాజ్యం బుధవారం మరోసారి ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. గతంలో ఆదేశాల మేరకు కౌంటర్లు దాఖలు కాలేదని తెలుసుకున్న ధర్మాసనం ‘అసలు మీరు (అధికారులు) కోర్టును సీరియస్‌గా తీసుకుంటున్నారా.. లేదా?’ అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు మరో అవకాశం ఇస్తున్నామని, అయితే అసాధారణ జాప్యానికి గాను కేంద్ర కార్యదర్శికి రూ.20 వేలు, కలెక్టర్‌కు సైతం రూ.10 వేలు ఖర్చులు విధిస్తున్నట్లు తెలిపింది. ఈ మొత్తాన్ని అడ్వొకేట్స్ క్లర్కుల సంక్షేమ నిధిలో జమ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఇలా జాప్యం చేసే ప్రతి కేసులోనూ జరిమానా విధిస్తామని తేల్చి చెప్పింది. తదుపరి విచారణ నాటికి మెరుగైన అఫిడవిట్‌ను దాఖలు చేయాల్సిందేనని స్పష్టం చేస్తూ విచారణను సెప్టెంబర్ 11వ తేదీకి వాయిదా వేసింది. -
టీడీపీ నేతల దాడులపై కాటసాని రామిరెడ్డి స్ట్రాంగ్ రియాక్షన్
-
వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
-
Hyderabad: నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం నంద్యాల జిల్లా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడి వివాహానికి హాజరయ్యారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో కాటసాని కుమారుడు శివఓబుల్‌రెడ్డి వివాహం మేధాశ్రీతో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇదిలా ఉండగా, పెళ్లి కుమార్తె మేధాశ్రీ తండ్రి పెద్ది సాయిరెడ్డి హైదరాబాద్‌లో ప్రముఖ వ్యాపారవేత్త. ఈ వివాహ వేడుకకు ఏపీ, తెలంగాణ నుంచి పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. చదవండి: (పార్లమెంటులో ఆరుగురు నెల్లూరు వాసులు) -
టీడీపీ నాయకుల బరితెగింపు
కర్నూలు, బనగానపల్లె రూరల్: అధికార పార్టీ నాయకులు రెచ్చిపోయారు. అవినీతి అక్రమాలను ప్రశ్నించిన వారిపై ఇనుప రాడ్లు, కర్రలతో విరుచుకు పడ్డారు. వారి దాడిలో వైఎస్సార్సీపీ వర్గీయులు నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో గురువారం చోటుచేసుకున్న ఘటనా వివరాలను బాధితుడు పెద్ద వెంకటరెడ్డి వెల్లడించాడు. వాటర్‌షెడ్డు పనుల పరిశీలన నిమిత్తం ఈ నెల 26న తనిఖీ బృందం గ్రామంలో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ జిల్లా రైతు సంఘం నాయకుడు, మాజీ సర్పంచ్ పెద్ద వెంకటరెడ్డి ఫాంపాండ్ నిర్మాణాల్లో జరిగిన అక్రమలపై అధికారులను ప్రశ్నించారు. దీంతో జీర్ణించుకోలేని టీడీపీకి చెందిన గడ్డం నాగేశ్వరెడ్డి, చెన్నారెడ్డి మరికొంత మంది.. అధికారుల ముందే పెద్ద వెంకటరెడ్డిని దూషించారు. దీంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరువర్గాలకు అధికారులు సర్ధిచెప్పడంతో శాంతించారు. అక్రమాలను ప్రశ్నించిన విషయం మనుసులో పెట్టుకున్న టీడీపీ వర్గీయులు గడ్డం నాగేశ్వరరెడ్డి, చెన్నారెడ్డి, సురేంద్రారెడ్డి, మహేశ్వరరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి గురువారం ఉదయం పెద్ద వెంకటరెడ్డి బంధువు చిన్ననాగేశ్వరరెడ్డిపై దాడికి యత్నించగా ఇంట్లోకి వెళ్లి తాళం వేసుకున్నాడు. విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లి దాడులను ఆపేందుకు ప్రయత్నించిన పెద్ద వెంకటరెడ్డితో పాటు అతడి కుటుంబ సభ్యులు శ్రీనివాసరెడ్డి, చిన్ననాగేశ్వరరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, పెద్దనాగేశ్వరరెడ్డి, వెంకటేశ్వరమ్మ, నాగేశ్వరమ్మ, ప్రవీణ్‌లపై టీడీపీ వర్గీయులు విరుచుకుపడ్డారు. విచక్షణ రహితంగా రాడ్లు, కర్రలతో కొట్టడంతో నలుగురు తీవ్రంగా గాయ పడగా మరో నలుగురికి రక్త గాయాలయ్యాయి. ఇరువర్గాలపై కేసు నమోదు దాడి విషయంలో ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్లు పాణ్యం సీఐ వాసుకృష్ణ, నందివర్గం ఎస్ఐ శంకరయ్య తెలిపారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో వారు విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలో వాటర్‌షెడ్డు పనుల్లో జరిగిన అక్రమాలపై బుధవారం జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసిందన్నారు. వైఎస్సార్సీపీ నాయకుడు పెద్ద వెంకటరెడ్డి వర్గానికి చెందిన 10మందిపై, టీడీపీ నాయకుడు గడ్డం నాగేశ్వరరెడ్డి వర్గానికి చెందిన ఏడుగురిపై కేసు నమోదు చేశామన్నారు. గ్రామంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసు పికెట్ ఏర్పాటు చేశామన్నారు. రాజకీయంగా ఎదుగుదల చూసి ఓర్వలేకనే దాడి: మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులపై దాడి ఘటనను పార్టీ బనగానపల్లె నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, నియోజకవర్గ నేత యర్రబోతుల వెంకటరెడ్డి ఖండించారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు చేరుకొని బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ నాయకుడు పెద్దవెంకటరెడ్డి రాజకీయంగా ఎదుగుండడంతోనే ఓర్వలేక టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారన్నారు. నిందితులను కాపాడేందుకు నాయకులపై ఒత్తిడి తెచ్చి కౌంటర్ కేసు నమోదు చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. బాధితులకు న్యాయం జరగకపోతే పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా దిగుతామని హెచ్చరించారు. వారి వెంట వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పీఆర్ వెంకటేశ్వరరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సిద్దంరెడ్డి రామ్మోహన్‌రెడ్డి, నాయకులు కాటసాని ప్రసాదరెడ్డి, కాటసాని తిరుపాల్‌రెడ్డి, సీనియర్ న్యాయవాది అబ్దుల్‌ఖైర్, డాక్టర్ మహమ్మద్ హుస్సేన్, వెంకటేశ్వరెడ్డిచ కిశోర్ తదితరులు ఉన్నారు. -
వైఎస్సార్సీపీలోకి గ్రూప్–1రిటైర్డ్ అధికారి
కోవెలకుంట్ల: సంజామల మండలం నొస్సం గ్రామానికి చెందిన గ్రూప్–1 రిటైర్డ్ అధికారి నరసింహం.. గురువారం వైఎస్సార్సీసీలో చేరారు. పట్టణంలోని వీఆర్, ఎన్ఆర్ పంక్షన్ హాలులో నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ కోవెలకుంట్ల మండల బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందు రిటైర్డ్ జాయింట్ కమిషనర్(స్టేట్ ట్యాక్స్) నరసింహం.. కాటసాని సమక్షంలో వైఎఎస్సార్సీపీలో చేరారు. 1996 గ్రూప్–1 బ్యాచ్‌కు చెందిన నరసింహం.. వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో పనిచేశారు. వైఎస్సార్ జిల్లాలోని విజిలెన్స్అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో పనిచేస్తూ ఇటీవల పదవీ విరమణ పొందారు. పార్టీలో చేరిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి న్యాయకత్వం అవసరమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఐదు కోట్ల మంది ప్రజలు కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వం 30 లక్షల మంది నిరుద్యోగులకు భృతి కింద ఏడాదికి రూ. 1500 కోట్ల చెల్లించాల్సి ఉందన్నారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు అప్పుల ఊబిలో కూరకపోయారన్నారు. వైఎస్సార్ పాలన సువర్ణ యుగమని, మళ్లీ అలాంటి పాలన రావాలంటే వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో సాధ్యమవుతుందన్నారు. వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలతో ప్రజలకు అన్ని విధాలా మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కర్రా హర్షవర్ధన్‌రెడ్డి, సీనియర్ డాక్టర్ రామిరెడ్డి, కోవెలకుంట్ల, బిజనవేముల ఎంపీటీసీ సభ్యులు భీమిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, దిల్క్‌బాష, వెలగటూరు, సౌదరదిన్నె సర్పంచ్‌లు ఎల్వీ సుధాకర్‌రెడ్డి, రమణారెడ్డి, సిద్ధంరెడ్డి రాంమోహన్‌రెడ్డి పాల్గొన్నారు. టీడీపీ పాలనకు చరమగీతం పాడదాం.. టీడీపీ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని వైఎస్సార్సీపీ బనగానపల్లె నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. గురువారం స్థానిక వీఆర్, ఎన్ఆర్ ఫంక్షన్‌హాలులో ఆయన మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో బూత్ కమిటీలు కీలకపాత్ర పోషించాలన్నారు. నాలుగేళ్ల తెలుగుదేశం పాలనలో రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు, వర్తకులు, కూలీలు.. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. రుణమాఫీ పేరుతో రైతులను చంద్రబాబు దగా చేశారని ఆరోపించారు. టీడీపీ పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో డబ్బులతో ఓట్లు కొనుక్కోవచ్చని ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి భ్రమలో ఉన్నారని, డబ్బు రాజకీయాలకు కాలం చెల్లిపోయిందన్నారు. అధికారులను వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, నాలుగేళ్లలో బనగానపల్లెలో 14 మంది తహసీల్దార్లు బదిలీ కావడం ఇందుకు నిదర్శనమన్నారు. ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలతో నియోజకవర్గంలో అధికారులు సక్రమంగా విధులు నిర్వర్తించలేకపోతున్నారన్నారు. -
కాటసాని రామిరెడ్డి ఇంట్లో విషాదం
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కాటసాని రామిరెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. కాటసాని రామిరెడ్డి పెద్ద కుమారుడు నాగార్జునరెడ్డి (28) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగార్జునరెడ్డి బలవన్మరణంతో కుటుంబసభ్యులు కుప్పకూలిపోయారు. బీటెక్ పూర్తి చేసిన నాగార్జున ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నాడు. నిన్నరాత్రి కుటుంబసభ్యులతో కలిసి సంతోషంగా గడిపిన కుమారుడు.. తెల్లవారేసరికి విగతజీవిగా మారడంతో కాటసాని రామిరెడ్డి కుటుంబం షాక్‌కు గురైంది. నాగార్జునరెడ్డి ఆత్మహత్యకు గత కారణాలు తెలియరాలేదు. కాగా, కాటసాని నాగార్జున రెడ్డి మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ చైర్మన్ చల్లా రామకృష్ణారెడ్డిలు నివాళులు అర్పించారు. -
వైఎస్సార్సీపీ నేతకు తప్పిన ప్రమాదం
సాక్షి, కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాట్రెడ్డి మల్లికార్జున రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న బైకును తప్పించడానికి వెళ్లి పక్కనే ఉన్న సుంకులమ్మ గుడిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన బుధవారం బనగానపల్లె మండలం రాళ్లకొత్తూరు బాట సుంకులమ్మ ఆలయం వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మల్లికార్జున రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఆయనను బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైఎస్సార్సీపీ బనగానపల్లె నియోజకవర్గ ఇంచార్జ్ కాటసాని రామిరెడ్డి మల్లికార్జున రెడ్డిని పరామర్శించారు. -
‘రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్ వెంటే’
► గడప గడపకు నవరత్నాలు చేరాలి ► మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కోవెలకుంట్ల: పార్టీ మారుతున్నారని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని రాజకీయాల్లో ఉన్నంత కాలం వైఎస్ జగన్ వెంటేనని వైఎస్సార్సీపీ బనగానపల్లె నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. స్థానిక కృష్ణతేజ ఫంక్షన్ హాలులో శుక్రవారం నియోజకవర్గంలోని ఆయా గ్రామాల బూత్ కమిటీలతో నవరత్నాల సభ నిర్వహించారు. సభకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ అన్ని వర్గాలను మోసం చేసిన చంద్రబాబు నాయుడుకు 2019లో గుణపాఠం తప్పదన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన తొమ్మిది పథకాలను గ్రామ గ్రామానికి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత బూత్‌కమిటీలదేన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసాతో ప్రతి రైతు కుటుంబానికి న్యాయం జరుగుతుందని, ఏడాదికి రూ.12500 చొప్పున నాలుగేళ్లపాటు రూ.50వేలు రైతుల చేతికందుతుందన్నారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలు, పొదుపు సంఘాలకు రూ.15వేల కోట్లతో ప్రతి మహిళ లక్షాధికారి అయ్యే విధంగా వైఎస్ఆర్ ఆసరా పథకంతో లబ్ధిచేకూరతుందన్నారు. రూ. వెయ్యి పింఛన్‌ను రూ.2వేలకు పెంచడంతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఎంతో ఆసరాగా ఉంటుందని, పేద కుటుంబాల్లోని పిల్లల చదువుకు ఏడాదికి రూ.10వేల నుంచి రూ.20వేలు నేరుగా తల్లులకే ఇచ్చే విధంగా అమ్మ ఒడి పథకంతో పిల్లల భవిష్యత్ ఉజ్వలమవుతుందన్నారు. పేద కుటుంబాలకు సొంతింటి కల నెలవేరుతుందని, ఆరోగ్య శ్రీ పథకానికి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, జలయజ్జ ప్రాజెక్టుల పూర్తి, మూడు దశల్లో మద్యపాన నిషేధం కార్యక్రమాలతో రాష్ట్రంలో తిరిగి రాజన్నరాజ్యం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మహా సంగ్రామంలో వైఎస్ఆర్సీపీదే విజయం 2019 కురుక్షేత్ర మహా సంగ్రామంలో వైఎస్సార్పీదే విజయమని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య చెప్పారు. 2014 ఎన్నికల్లో 600 అబద్ధాలు చెప్పి చంద్రబాబు గద్దెనెక్కారన్నారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలతో ప్రజలకు అన్ని విధాలా మేలు జరుగుతుందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి గుండం వెంకట సూర్యప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేస్తే 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రా హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పాలనతో ప్రజలు విసిగిపోయారని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీకి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సిద్ధంరెడ్డి రాంమోహన్‌రెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు శివరామిరెడ్డి, జిల్లా కార్యదర్శి గుండం శేషిరెడ్డి, కోవెలకుంట్ల, సంజామల జెడ్పీటీసీ సభ్యులు గాండ్ల పుల్లయ్య, చిన్నబాబు, ఎంపీపీ గౌరుగారి ఓబుళరెడ్డి, కాటసాని తిరుపాల్‌రెడ్డి, దేశాయ్‌రెడ్డి, కోవెలకుంట్ల, బనగానపల్లె, అవుకు, సంజామల, కొలిమిగుండ్ల మండలాల పార్టీ ఇన్‌చార్జ్‌లు శింగిరెడ్డి రామేశ్వరరెడ్డి, గుండం నాగేశ్వరరెడ్డి, కాట్రెడ్డి మల్లికార్జునరెడ్డి, రామచంద్రారెడ్డి, రాజారెడ్డి, నంద్యాల డివిజన్ ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు పులిప్రకాష్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుర్విరెడ్డి, కలుగొట్ల బూస భాస్కర్‌రెడ్డి, బిజనవేముల ఎంపీటీసీ భీంరెడ్డి ప్రతాప్‌రెడ్డి, సర్పంచ్‌లు ఎల్వీ సుధాకర్‌రెడ్డి, పోచా వెంకటరామిరెడ్డి, జనార్ధన్‌రెడ్డి, మురళీమోహన్‌రెడ్డి, మైనార్టీ నాయకులు అబ్దుల్ ఫైజ్, అబ్దుల్‌ఖైర్, డాక్టర్ మహమ్మద్ఉసేన్, ఆయామండలాల నాయకులు జీసీఆర్ వెంకటేశ్వరరెడ్డి, ఎర్రం ఈశ్వరరెడ్డి, మధుసుధాకర్, ఎర్రం సుబ్బారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు భాస్కర్‌రెడ్డి, రాంమోహన్‌రెడ్డి, ఎల్ఐసీ రామసుబ్బారెడ్డి, గాధంశెట్టి రమణయ్య, తులసిరెడ్డి పాల్గొన్నారు. -
పోలీస్ స్టేషన్‌ను ముట్టడించిన వైఎస్ఆర్ సీపీ
కర్నూలు: కర్నూలు జిల్లాకు చెందిన వైఎస్ఆర్ సీపీ నేతలు నందివర్గం పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. వైఎస్ఆర్ సీపీ కార్యకర్త శేఖర్ గౌడ్‌ను ఎస్సై నరేంద్రకుమార్‌రెడ్డి కొట్టారని పార్టీ నేతలు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో పీఎస్‌ను ముట్టడించారు. శేఖర్ గౌడ్‌ను ఎస్సై అన్యాయంగా కొట్టారని, ఇందుకు నిరసనగా తాము ఇలా చేశామని పార్టీ నేతలు తెలిపారు. ఈ ముట్టడిలో జిల్లాకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
సీమాంధ్రలోనే 160 సీట్లు: కాటసానిరామిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీమాంధ్రలోనే 160 అసెంబ్లీ సీట్లను గెలవనున్నదని బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. ఆయున సోమవారం హైదరాబాద్ చంచల్‌గూడ జైల్లో జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. కాటసానితోపాటు వైఎస్సార్సీపీ నేత భూమా నాగిరెడ్డి, పార్టీ బనగానపల్లి ఇంఛార్జి ఎర్రబోతుల వెంకట్‌రెడ్డి కూడా ప్రత్యేక ములాఖత్‌లో జగన్‌ను కలుసుకున్నారు. జగన్‌ను కలుసుకున్న అనంతరం కాటసాని జైలు బయట మీడియాతో మాట్లాడుతూ, ప్రజాశ్రేయస్సుకోసం సమైక్యాంధ్రకు కట్టుబడిన ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ వూత్రమేనన్నారు. రాష్ట్రానికి సమర్థుడైన నాయకుడు జగన్ అని జనం విశ్వసిస్తున్నారని అన్నారు. దివంగత మహానేత రాజశేఖరరెడ్డిని జగన్‌లో చూసుకుంటున్నారని, ఆయున నేతృత్వంలో పనిచేసేందుకు నాయకులు, ప్రజలు ముందుకొస్తున్నారని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిన తరువాత తాను జగన్‌ను కలవటం ఇదే తొలిసారన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్‌తో కలిసి పనిచేసి ఆయన్ను ముఖ్యమంత్రిని చేయూలన్నదే తన ధ్యేయువున్నారు. జగన్‌తోనే రాజన్న రాజ్యం: వెంకట్‌రెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనకోసం, జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఉందని బనగానపల్లి వైఎస్ఆర్ సీపీ నేత ఎర్రబోతుల వెంకట్ రెడ్డి అన్నారు. సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించిన ఏకైక నేత జగన్ అని ఆయున అన్నారు.