సీమాంధ్రలోనే 160 సీట్లు: కాటసానిరామిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీమాంధ్రలోనే 160 అసెంబ్లీ సీట్లను గెలవనున్నదని బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. ఆయున సోమవారం హైదరాబాద్ చంచల్‌గూడ జైల్లో జగన్‌మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. కాటసానితోపాటు వైఎస్సార్‌సీపీ నేత భూమా నాగిరెడ్డి, పార్టీ బనగానపల్లి ఇంఛార్జి ఎర్రబోతుల వెంకట్‌రెడ్డి కూడా ప్రత్యేక ములాఖత్‌లో జగన్‌ను కలుసుకున్నారు. జగన్‌ను కలుసుకున్న అనంతరం కాటసాని జైలు బయట మీడియాతో మాట్లాడుతూ, ప్రజాశ్రేయస్సుకోసం సమైక్యాంధ్రకు కట్టుబడిన ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ వూత్రమేనన్నారు.
రాష్ట్రానికి సమర్థుడైన నాయకుడు జగన్ అని జనం విశ్వసిస్తున్నారని అన్నారు. దివంగత మహానేత రాజశేఖరరెడ్డిని జగన్‌లో చూసుకుంటున్నారని, ఆయున నేతృత్వంలో పనిచేసేందుకు నాయకులు, ప్రజలు ముందుకొస్తున్నారని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిన తరువాత తాను జగన్‌ను కలవటం ఇదే తొలిసారన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్‌తో కలిసి పనిచేసి ఆయన్ను ముఖ్యమంత్రిని చేయూలన్నదే తన ధ్యేయువున్నారు.
జగన్‌తోనే రాజన్న రాజ్యం: వెంకట్‌రెడ్డి
వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనకోసం, జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఉందని బనగానపల్లి వైఎస్‌ఆర్ సీపీ నేత ఎర్రబోతుల వెంకట్ రెడ్డి అన్నారు. సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించిన ఏకైక నేత జగన్ అని ఆయున అన్నారు.