‘రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్‌ వెంటే’ | forever with jagan | Sakshi
Sakshi News home page

‘రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్‌ వెంటే’

Published Sat, Aug 26 2017 9:46 PM | Last Updated on Tue, May 29 2018 4:40 PM

‘రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్‌ వెంటే’ - Sakshi

‘రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్‌ వెంటే’

గడప గడపకు నవరత్నాలు చేరాలి
మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి

 
కోవెలకుంట్ల: పార్టీ మారుతున్నారని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని రాజకీయాల్లో ఉన్నంత కాలం వైఎస్‌ జగన్‌ వెంటేనని వైఎస్సార్‌సీపీ బనగానపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. స్థానిక కృష్ణతేజ ఫంక‌్షన్‌ హాలులో శుక్రవారం నియోజకవర్గంలోని ఆయా గ్రామాల బూత్‌ కమిటీలతో నవరత్నాల సభ నిర్వహించారు.
 
సభకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ అన్ని వర్గాలను మోసం చేసిన చంద్రబాబు నాయుడుకు 2019లో గుణపాఠం తప్పదన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన తొమ్మిది పథకాలను గ్రామ గ్రామానికి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత బూత్‌కమిటీలదేన్నారు. వైఎస్‌ఆర్‌ రైతు భరోసాతో ప్రతి రైతు కుటుంబానికి న్యాయం జరుగుతుందని, ఏడాదికి రూ.12500 చొప్పున నాలుగేళ్లపాటు రూ.50వేలు రైతుల చేతికందుతుందన్నారు.
 
డ్వాక్రా అక్కచెల్లెమ్మలు, పొదుపు సంఘాలకు రూ.15వేల కోట్లతో ప్రతి మహిళ లక్షాధికారి అయ్యే విధంగా వైఎస్‌ఆర్‌ ఆసరా పథకంతో లబ్ధిచేకూరతుందన్నారు. రూ. వెయ్యి పింఛన్‌ను రూ.2వేలకు పెంచడంతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఎంతో ఆసరాగా ఉంటుందని, పేద కుటుంబాల్లోని పిల్లల చదువుకు ఏడాదికి రూ.10వేల నుంచి రూ.20వేలు నేరుగా తల్లులకే ఇచ్చే విధంగా అమ్మ ఒడి పథకంతో పిల్లల భవిష్యత్‌ ఉజ్వలమవుతుందన్నారు. పేద కుటుంబాలకు సొంతింటి కల నెలవేరుతుందని, ఆరోగ్య శ్రీ పథకానికి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్జ ప్రాజెక్టుల పూర్తి, మూడు దశల్లో మద్యపాన నిషేధం కార్యక్రమాలతో రాష్ట్రంలో తిరిగి రాజన్నరాజ్యం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  
 
మహా సంగ్రామంలో వైఎస్‌ఆర్‌సీపీదే విజయం
2019 కురుక్షేత్ర మహా సంగ్రామంలో వైఎస్సార్‌పీదే విజయమని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య చెప్పారు. 2014 ఎన్నికల్లో 600 అబద్ధాలు చెప్పి చంద్రబాబు గద్దెనెక్కారన్నారు. వైఎస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలతో ప్రజలకు అన్ని విధాలా మేలు జరుగుతుందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి గుండం వెంకట సూర్యప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేస్తే 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రా హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పాలనతో ప్రజలు విసిగిపోయారని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీకి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
 
కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సిద్ధంరెడ్డి రాంమోహన్‌రెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు శివరామిరెడ్డి, జిల్లా కార్యదర్శి గుండం శేషిరెడ్డి, కోవెలకుంట్ల, సంజామల జెడ్పీటీసీ సభ్యులు గాండ్ల పుల్లయ్య, చిన్నబాబు, ఎంపీపీ గౌరుగారి ఓబుళరెడ్డి, కాటసాని తిరుపాల్‌రెడ్డి, దేశాయ్‌రెడ్డి, కోవెలకుంట్ల, బనగానపల్లె, అవుకు, సంజామల, కొలిమిగుండ్ల మండలాల పార్టీ ఇన్‌చార్జ్‌లు శింగిరెడ్డి రామేశ్వరరెడ్డి, గుండం నాగేశ్వరరెడ్డి, కాట్రెడ్డి మల్లికార్జునరెడ్డి, రామచంద్రారెడ్డి, రాజారెడ్డి, నంద్యాల డివిజన్‌ ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు పులిప్రకాష్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గుర్విరెడ్డి, కలుగొట్ల బూస భాస్కర్‌రెడ్డి, బిజనవేముల ఎంపీటీసీ భీంరెడ్డి ప్రతాప్‌రెడ్డి, సర్పంచ్‌లు ఎల్వీ సుధాకర్‌రెడ్డి, పోచా వెంకటరామిరెడ్డి, జనార్ధన్‌రెడ్డి, మురళీమోహన్‌రెడ్డి, మైనార్టీ నాయకులు అబ్దుల్‌ ఫైజ్, అబ్దుల్‌ఖైర్, డాక్టర్‌ మహమ్మద్‌ఉసేన్,  ఆయామండలాల నాయకులు జీసీఆర్‌ వెంకటేశ్వరరెడ్డి, ఎర్రం ఈశ్వరరెడ్డి, మధుసుధాకర్,  ఎర్రం సుబ్బారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు భాస్కర్‌రెడ్డి, రాంమోహన్‌రెడ్డి, ఎల్‌ఐసీ రామసుబ్బారెడ్డి, గాధంశెట్టి రమణయ్య, తులసిరెడ్డి పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement