కర్నూలు(రాజ్‌విహార్) : అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రజా సమస్యలపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు నినదించారు. జిల్లాలో నెలకొన్న కరువు, ముస్లింలకు హజ్ హౌస్ నిర్మాణ అవశ్యకత, ఎమ్మెల్యేలపై రౌడీషీటు తెరవడం, పెరుగుతున్న రోడ్డు ప్రవూదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని డివూండ్ చేస్తూ తవు వాణిని బలంగా వినిపించారు. ప్రశ్నోత్తరాల సవుయుం, జీరో అవర్‌తో పాటు ఏకంగా స్పీకరుకు ప్రివిలేజ్ మోషన్‌నూ ఇచ్చారు. ఐదు రోజుల పాటు సాగిన ఈ సమావేశాల్లో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల గొంతు నొక్కేందుకే అధికారపార్టీ ప్రయుత్నించింది.
దీంతో జిల్లాలోని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలందరికీ వూట్లాడే అవకాశం రాలేదు. అరుునప్పటికీ జిల్లా సవుస్యలను లేవనెత్తేందుకు తవు వంతు కృషి చేశారు. వురోవైపు అధికారపార్టీ సభ్యులు వూత్రం బుడగ జంగాలకు ఎస్టీ హోదా కల్పించాలని కోరడం మినహా మిగిలిన ఏ సవుస్యనూ ప్రస్తావించే సాహసం చేయులేదు. మంత్రులను మాట్లాడనీయడం లేదని చెప్పి కేఈ కృష్ణమూర్తి సరిపెట్టుకోగా బుడగ జంగాలను ఎస్టీలుగా గుర్తించాలని బీవీ జయనాగేశ్వరరెడ్డి చెప్పి సరిపెట్టుకున్నారు.
హౌజ్ హౌస్ ఏమైంది?
- భూమా నాగిరెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే
కర్నూలులో నిర్మించేందుకు హజ్‌హౌస్ మంజూరు అయింది. అందుకు కేటాయించిన నిధులు నిరుపయోగమయ్యాయి. ముస్లింలకు ఉపయోగపడే హజ్‌హౌస్ నిర్మాణానికి గత ప్రభుత్వం రూ. 2.95 కోట్లు మంజూరు చేసింది. అయితే, ఎన్నికల కోడ్, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆ పనులు ఆగిపోయాయి. ఆ నిధులను సకాలంలో సద్వినియోగం చేసుకోకపోవడంతో అవి కాస్తా నిరుపయోగం అయ్యాయి. కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలలు గడిచినా హజ్‌హౌస్ నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అ నిధులు చాలా చిన్న మొత్తం. వాటిని మళ్లీ మంజూరు చేస్తే ముస్లింలకు మేలు జరుగుతుంది. మైనారిటీల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని జిల్లాలోని ముస్లింలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక ముస్లిం జనాభా కర్నూలులో ఉన్నందున వెంటనే నిర్మాణ పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది. నిధులు మంజూరు చేయలేకపోతే కనీసం స్థలం చూపితే చందాలతో మేమే హజ్ హౌస్‌ను కట్టించుకుంటాం.
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలేవి?
ప్రభుత్వ నిర్లక్ష్యానికి అమాయక ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో బలవుతున్నారని దివంగత శోభా నాగిరెడ్డి తనయ, ఆళ్లగడ్డ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యురాలు భూమా అఖిల ప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమె తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టి తన తల్లి మృతికి కారణమైన అంశం రోడ్డు ప్రమాదాలపైనే మాట్లాడారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టారు? చాగలమర్రి - నంద్యాల రోడ్డులో ఇటీవల కాలంలో 12 ప్రమాదాలు జరిగాయి. రోడ్లపైనే దారి మళ్లింపు గుర్తులు, గుంతలు ఉండడం, మరమ్మతులు చేపట్టకపోవడం వంటి చర్యల కారణంగా చివరకు అమ్మనే కోల్పోయాను. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. ఈ ప్రమాదాల నివారణకు అమ్మ భూమా శోభ నాగిరెడ్డి అనేక సార్లు లేఖలు రాసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రమాదాల నివారణపై చూస్తాం.. చేస్తాం అని చెప్పకుండా మంత్రి నుంచి సరైన సమాధానం చెప్పించాలని డిమాండ్ చేశారు.
- భూమా అఖిల ప్రియ, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే
రైతుల భూమలు లాక్కోవద్దు
రాష్ట్రంలో కొత్తగా నిర్మించబోయే రాజధాని పేరుతో రైతులు పండించుకునే వ్యవసాయ భూములను లాక్కొవడం సరైంది కాదు. రాజధానికి స్థల సేకరణకు వ్యవసాయ భూములను సేకరించరాదని శివరామకష్ణ కమిటీ పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. 60 శాతం ప్రజల ఆమోదం ఉంటేనే భూసేకరణ చేపట్టాలనే నిబంధనను ప్రభుత్వం పక్కనపెట్టింది. 50 వేల ఎకరాలు, లక్ష ఎకరాల పేరుతో రైతుల నుండి లాక్కోవాలని చూస్తున్నారు. ఇలా చేస్తే ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. ల్యాండ్ పూలింగ్‌పై కోర్టుకెళ్లే రైతుల ఆలోచనల గురించి ప్రభుత్వం చెప్పే మాటలు వారిని అవమానించేలా ఉన్నాయి. రైతులు భూములను ఇవ్వకపోతే ఏ చట్టాన్నైనా తీసుకొచ్చి లాక్కుంటామని ఓ మంత్రి చెబుతున్నారు. కేవలం రాజధానికే ఇన్ని వేల ఎకరాలు ఎందుకు సేకరిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. సీఆర్‌డీఏ బిల్లులో రైతులు, రైతు కూలీలకు ఏ మాత్రం భద్రత లేదు. ఉపగ్రహాలు తయారు చేసే సత్తా ఉన్న యువత దేశంలో ఉంటే సింగపూర్ సహాయం ఎందుకని ప్రశ్నించారు.
- బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డి, డోన్ ఎమ్మెల్యే
ఎమ్మెల్యేలపైనే రౌడీ షీట్లు తెరుస్తారా
పోలీసులు శాసన సభ సభ్యుల పట్ల వ్యవహరిస్తున్న తీసు సభా హక్కులను భంగం కలిగించేలా ఉంది. ఎమ్మెల్యేలుగా విధులు నిర్వహిస్తున్నప్పుడే పోలీసులు కేసులు పెట్టి రౌడీ షీటు తెరిచారు. మాపై కేసులు పెడుతుంటే చూస్తూ ఉంటారా? మా హక్కులు కాపాడలేరా? ప్రజల కోసం ఎన్నుకోబడిన నేను ప్రజా సమస్యల కోసమే నేను ఆ రోజు సంఘటనా స్థలానికి వెళ్లాను.అలాంటప్పుడు అది వ్యక్తిగత అంశం ఎలా అవుతుంది.
- భూమా నాగిరెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే
సమస్యలు చెప్పనీయకుండా గొంతు నొక్కేశారు
అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో సమస్యలను చెప్పనీయకుండా గొంతు నొక్కేశారు. ముఖ్యంగా జీరో అవర్‌లో నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సి ఉంది. జీరో అవర్‌ను ముందే ముంగించేశారు. వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేలు మాట్లాడనీయకుండా మైకుల కనెక్షన్లు కట్ చేశారు. ఐదు రోజుల అసెంబ్లీ సమావేశంలో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు కాకుండా ప్రభుత్వం తన బిల్లులను పాస్ చేయించుకునేందుకే నిర్వహించినట్లు ఉంది. - బుడ్డా రాజశేఖరరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఆలూరులోని ఆరు మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలి
కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో కరువు విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా ఆలూరులో వర్షాభావ పరిస్థితుల కారణంగా వలసలు అధికమయ్యాయి. ఆలూరులోని ఆరు మండలాలను కరువు మండలాల జాబితాలో చేర్చాలి. వెంటనే ఉపాధి పనులు చేపట్టి వ్యవసాయ కూలీలను ఆదుకోవాలి. కరువును అంచనా వేసి నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలి.
- గుమ్మనూరు జయరాం, ఆలూరు ఎమ్మెల్యే
బుడగ జంగాలకు ఎస్టీల హోదా కల్పించాలి
కర్నూలు జిల్లాలోని బుడగ జంగాలకు ఎస్టీల హాదా కల్పించాలి. గతంలో ఎస్టీల జాబితాలో చేర్చాలని చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కాని ఇప్పుడు దీనిపై ఏక సభ్య కమిషన్ వేస్తారని చెబుతున్నారు. ఇది కాలయాపన తప్ప సమస్యను త్వరగా పరిష్కరించేది కాదు. కమిషన్‌తో పనిలేకుండా వెంటనే ఎస్టీ హోదా కల్పించాలి.
- ఎస్‌వి. మోహన్‌రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే.
ఎస్టీలుగా గుర్తించాలి
జిల్లాలోని బుడగ జంగాలకు ఎస్టీల హాదా కల్పించాలి. వెనుకబడిన వారి అభివృద్ధికి ఇదే సరైన మార్గం. కాలయాపన చేయకుండా వెంటనే బుడగ జంగాలను ఎస్టీలుగా గుర్తించాలి.
- జయ నాగేశ్వరరెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే
ప్రజా సమస్యలపై ఏకరువు
Published Wed, Dec 24 2014 4:11 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement
Advertisement