కడప: వైఎస్ఆర్ జిల్లా కమలాపురం శివారులో మల్లికార్జునరెడ్డి (35) అనే రైతు... తన పొలంలో ఎద్దులతో పొలం దున్నుతున్నాడు. ఆ క్రమంలో పిడుగు పడింది. దీంతో మల్లికార్జునరెడ్డి అక్కడికక్కడే మరణించాడు. రెండు ఎద్దులు కూడా మరణించాయి. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు చోటు చేసుకుంది.