సాక్షి, విజయవాడ: ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్‌గా ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చైర్మన్ మల్లికార్జునరెడ్డి అన్నారు. ఉద్యోగుల భద్రత విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, సీఎం జగన్ ఆర్టీసీని ఇప్పటికే ప్రభుత్వంలో విలీనం చేశారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ చైర్మన్‌గా మల్లికార్జునరెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటానని తెలిపారు. చైర్మన్‌గా ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పారు. అధికారులను సమన్వయం చేసుకొని చైర్మన్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తామని తెలిపారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆర్టీసీని సీఎం ఇప్పటికే ప్రభుత్వంలో విలీనం చేశారని, ఉద్యోగుల భద్రత విషయంలో ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉందని చెప్పారు. రాబోయే రోజుల్లో సంస్థ అభివృద్ధే లక్ష్యమని, ఆర్టీసీ ఎండీతో కలిసి నడుస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment