APSRTC Chairman
-
సంక్రాంతికి 6,400 స్పెషల్ బస్సులు.. రిజర్వేషన్‌పై 10శాతం రాయితీ!
సాక్షి, అమరావతి: సంక్రాంతి పండగకు స్వగ్రామం వెళ్లాలని భావిస్తున్నవారికి ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ శుభవార్త అందించింది. సంక్రాంతి రద్దీకి తగ్గట్లుగా అదనపు బస్సులు ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సోమవారం ప్రకటించారు. సంక్రాంతి కోసం మొత్తం 6,400 బస్సులు అదనంగా తిప్పనున్నట్లు వెల్లడించారు. సంక్రాంతి పండగ సందర్భంగా అదనపు బస్సులు ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవన్నారు ఎండీ తిరుమలరావు. సాధారణ ఛార్జీలతోనే బస్సులు నడుపుతామన్నారు. జనవరి 6 నుంచి 14 వరకు 3,120 బస్సులు, సంక్రాంతి తర్వాత మరో 3,280 బస్సులు అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అప్ అండ్ డౌన్ రిజర్వేషన్ చేసుకుంటే అదనంగా 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: విజయవాడ: క్రిస్మస్ తేనీటి విందుకు హాజరుకానున్న సీఎం జగన్ -
చైర్మన్‌గా ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడిపిస్తా: మల్లికార్జునరెడ్డి
సాక్షి, విజయవాడ: ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్‌గా ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చైర్మన్ మల్లికార్జునరెడ్డి అన్నారు. ఉద్యోగుల భద్రత విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, సీఎం జగన్ ఆర్టీసీని ఇప్పటికే ప్రభుత్వంలో విలీనం చేశారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ చైర్మన్‌గా మల్లికార్జునరెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటానని తెలిపారు. చైర్మన్‌గా ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పారు. అధికారులను సమన్వయం చేసుకొని చైర్మన్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తామని తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆర్టీసీని సీఎం ఇప్పటికే ప్రభుత్వంలో విలీనం చేశారని, ఉద్యోగుల భద్రత విషయంలో ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉందని చెప్పారు. రాబోయే రోజుల్లో సంస్థ అభివృద్ధే లక్ష్యమని, ఆర్టీసీ ఎండీతో కలిసి నడుస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
రాజీనామా చేసిన వర్ల రామయ్య
సాక్షి, విజయవాడ: ఎట్టకేలకు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆర్టీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి శనివారం పంపించారు. కాగా ప్రభుత్వం మారి అయిదు నెలలు తర్వాత వర్ల రామయ్య తన పదవికి రిజైన్ చేయడం గమనార్హం. ఆర్టీసీ నిబంధనల ప్రకారం చైర్మన్ పదవీ కాలం కేవలం ఏడాది మాత్రమే ఉంటుంది. కానీ వర్ల రామయ్య పదవీ కాలం ఏప్రిల్ 24, 2019లో ముగిసినా ఆయన మాత్రం పదవి నుంచి వైదొలగలేదు. దీంతో ఏపీఎస్ ఆర్టీసీ 1950 చట్టం సెక్షన్-8లోని ఉప నిబంధన-2 ప్రకారం నెల రోజుల గడువిస్తూ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు సెప్టెంబర్‌లో నోటీసు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నోటీసులు అందుకున్న ఆయన నెల రోజుల తర్వాత ఆర్టీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. -
వర్ల రామయ్యకు నెల గడువిచ్చిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి: ప్రభుత్వం మారినా టీడీపీ సీనియర్ నేత, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య మాత్రం ఆ పదవిని పట్టుకుని వేళ్లాడుతూనే ఉన్నారు. దీంతో ఆ పదవి నుంచి వైదొలగడానికి రాష్ట్ర ప్రభుత్వం నెల రోజులు గడువు ఇస్తూ నోటీసులు జారీ చేసింది. ఆర్టీసీ నిబంధనల ప్రకారం చైర్మన్ పదవీ కాలం కేవలం ఏడాది మాత్రమే ఉంటుంది. కానీ, వర్ల రామయ్య పదవీ కాలం ఏప్రిల్ 24, 2019లో ముగిసినా ఆయన మాత్రం పదవి నుంచి వైదొలగలేదు. దీంతో ఏపీఎస్ ఆర్టీసీ 1950 చట్టం సెక్షన్-8లోని ఉప నిబంధన-2 ప్రకారం నెల రోజుల గడువిస్తూ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు నిన్న నోటీసు జారీ చేశారు. అదే విధంగా విజయవాడ జోనల్ చైర్మన్ పార్థసారధికి కూడా ఒక నెల గడువిస్తూ ఆర్టీసీ నోటీసులు ఇచ్చింది. ఇదే సమయంలో కడప జోనల్ చైర్మన్ రెడ్యం వెంకట సుబ్బారెడ్డి రాజీనామాను ఆమోదించింది. -
పవన్ కల్యాణ్‌పై వర్ల రామయ్య సెటైర్లు!
సాక్షి, విజయవాడ : జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌పై ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్న పవన్.. సీఎం పదవి కోసమే రోడ్లపై తిరుగుతున్నారని ఆయన విమర్శించారు. కృష్ణా జిల్లా విజయవాడలో ఆదివారం వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ.. నేను సినిమా హీరోను.. సీఎం పదవి ఇచ్చేయమంటే ప్రజలు పవన్‌కు అధికారాన్ని ఇవ్వరని ఎద్దేవా చేశారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో పవన్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి కూడా సీఎం పదవి కోసం ఇలానే తిరిగారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. సినిమా హీరోలను ముఖ్యమంత్రులుగా ఆదరించే పరిస్థితి రాష్ట్రంలో లేదని అభిప్రాయపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు మాత్రమే ప్రజలు ఓట్లేసి సీఎంగా ఆదరించారని వర్ల రామయ్య అన్నారు. -
ప్రకంపనలు రేపుతున్న వర్ల రామయ్య వ్యాఖ్యలు