( ఫైల్ ఫోటో )
సాక్షి, అమరావతి: సంక్రాంతి పండగకు స్వగ్రామం వెళ్లాలని భావిస్తున్నవారికి ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ శుభవార్త అందించింది. సంక్రాంతి రద్దీకి తగ్గట్లుగా అదనపు బస్సులు ఏర్పాటు చేస్తామని ఆర్‌టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సోమవారం ప్రకటించారు. సంక్రాంతి కోసం మొత్తం 6,400 బస్సులు అదనంగా తిప్పనున్నట్లు వెల్లడించారు.
సంక్రాంతి పండగ సందర్భంగా అదనపు బస్సులు ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవన్నారు ఎండీ తిరుమలరావు. సాధారణ ఛార్జీలతోనే బస్సులు నడుపుతామన్నారు. జనవరి 6 నుంచి 14 వరకు 3,120 బస్సులు, సంక్రాంతి తర్వాత మరో 3,280 బస్సులు అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అప్ అండ్ డౌన్ రిజర్వేషన్ చేసుకుంటే అదనంగా 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: విజయవాడ: క్రిస్మస్ తేనీటి విందుకు హాజరుకానున్న సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment