special bus services
-
పండుగ ప్రయాణంపై ‘డైనమిక్’ పిడుగు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి వేళ దూర ప్రాంతాల్లోని సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులపై తెలంగాణ ఆర్టీసీ ‘డైనమిక్ చార్జీ’ రూపంలో పెను భారం మోపింది. దాదాపు రెట్టింపు చార్జీలతో జేబులు గుల్ల చేస్తోంది. గతంలో పండుగ సమయంలో నడిపే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు రుసుము వసూలు చేసే విధానం ఉండేది. కానీ ఇటీవల దాన్ని రద్దు చేసి సాధారణ చార్జీలకే ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటు ఆర్టీసీ కల్పించింది. కానీ సంక్రాంతి వేళ.. డైనమిక్ ఫేర్ విధానం పేరిట.. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా అదనపు రుసుము వసూలు చేస్తోంది. విశాఖ స్పెషల్ రూ.3 వేలు వాస్తవానికి కొన్ని నెలలుగా దశల వారీగా డైనమిక్ ఫేర్ విధానాన్ని విస్తరిస్తూ వచ్చిన టీఎస్ఆర్టీసీ.. సంక్రాంతి రద్దీ సమయానికి దూరప్రాంత రూట్లను కూడా ఈ విధానంలోకి తెచ్చేసింది. ఫలితంగా పండుగ ప్రత్యేక బస్సుల్లో చార్జీలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సాధారణ రోజుల్లో విశాఖపటా్ననికి స్లీపర్ బస్సులో టికెట్ ధర రూ.1,500 లోపు ఉండగా, ఇప్పుడు ప్రత్యేక బస్సుల్లో అది రూ.3 వేలను దాటింది. విజయవాడ మార్గంలో సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ.300, రాజధానిలో రూ.550, గరుడలో రూ.800 వరకు చార్జీలు పెరిగాయి. మిగతా దూరప్రాంతాల మార్గాల్లోని బస్సుల్లోనూ ఇదే బాదుడు కనిపిస్తోంది. డిమాండ్, ముందు.. వెనుక సీట్లను బట్టి చార్జీలు డిమాండ్ పెరిగే కొద్దీ చార్జీలను సవరించి పెంచుకోవటాన్నే డైనమిక్ ఫేర్ విధానం అంటున్నారు. సాధారణంగా విమానయాన సంస్థలు దీన్ని అను సరిస్తుంటాయి. నెల రోజుల ముందు బుక్ చేసుకునే విమాన టికెట్ ధరకు, అదేరోజు బుక్ చేస్తే ఉండే చార్జీకి పొంతనే ఉండదు. మూడు నాలుగు రెట్లు కూడా చార్జీ పెరుగుతుంది. ఇదే విధానాన్ని తెలంగాణ ఆర్టీసీ అనుసరిస్తోంది. తొలిసారిగా గతేడాది బెంగళూరు మార్గంలో దీనిని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఆ తర్వాత విస్తరిస్తూ తాజాగా ఇతర రాష్ట్రాల రూట్లలో అమలు ప్రారంభించింది. సాధారణ రోజుల్లో డిమాండ్ ఉండక బస్సుల్లో సీట్లు మిగిలిపోతుంటాయి. అలాంటి సమయంలో సాధారణ టికెట్ ధరలో 80% మొత్తాన్నే వసూలు చేస్తోంది. అంటే రూ.100గా ఉండే టికెట్ ధరను రూ.80గా మారుస్తోంది. కానీ డిమాండ్ పెరిగే కొద్దీ టికెట్ ధరలను క్రమంగా పెంచుతూ గరిష్టంగా 150 శాతంగా ఖరారు చేస్తోంది. ఇక ముందు వైపు ఉండే సీట్లలో ఒక ధర, వెనక సీట్లలో మరో ధర, కిటికీ వైపు సీటుకు ఓ ధర, పక్క సీటుకు మరో ధర, ఉదయం వేళ ఒక ధర, సాయంత్రం, రాత్రి వేళ వేరు ధరలు.. ఇలా ఎప్పటికికప్పుడు సందర్భాన్ని బట్టి చార్జీలను సవరిస్తోంది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో కూడా ఈ విధానం అనుసరిస్తున్నారు. డిమాండ్ లేని సాధారణ రోజుల్లో చార్జీలో సగం మాత్రమే వసూలు చేస్తుండటంతో ఆ బస్సులు నిండిపోయి ప్రయాణిస్తుంటాయి. అదే సమయంలో ఆర్టీసీ బస్సులు ఖాళీగా కన్పిస్తుంటాయి. ఇక డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో రెండు మూడు రెట్లకు టికెట్ ధర పెంచి ప్రైవేటు ట్రావెల్స్ వసూలు చేస్తుంటాయి. ఈ విధానం లాభసాటిగా ఉండటంతో తెలంగాణ ఆర్టీసీ కూడా దీన్ని అమల్లోకి తెచ్చింది. ఆదుకున్న ఏపీఎస్ ఆర్టీసీ సాధారణంగా సంక్రాంతి, దసరా, దీపావళి పండగ వేళల్లో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరుగుతుంది. 15 లక్షల నుంచి 20 లక్షల మంది తరలి వెళ్తారు. దీంతో ఏపీకి టీఎస్ఆర్టీసీ అదనంగా బస్సులు నడుపుతుంది. అలా ఈ సంక్రాంతికి 1,550 బస్సులను ఏపీకి తిప్పాలని భావించింది. కానీ మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటులోకి రావటంతో రద్దీ విపరీతంగా పెరిగి బస్సులు సరిపోని పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో నామమాత్రంగా 400 అదనపు బస్సులతో సరిపెట్టింది. ఇదే సమయంలో ఏపీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు 1,450 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది. అవి సరిపోక పోవడం ఎంజీబీఎస్, జేబీఎస్‌లకు ప్రయాణికులు పొటెత్తుతుండటంతో మూడు రోజుల క్రితం ప్రత్యేక బస్సుల సంఖ్య పెంచాల్సిందిగా ఏపీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులను టీఎస్ఆర్టీసీ అధికారులు కోరారు. దీంతో గత మూడు రోజులుగా మరో 350 ప్రత్యేక బస్సులను ఏపీఎస్ ఆర్టీసీ రంగంలోకి దించింది. ప్రైవేటు బస్సు చార్జీలూ భగ్గు తెలంగాణ ఆర్టీసీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 4,420 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. దక్షిణమధ్య రైల్వే విశాఖ, కాకినాడ, తిరుపతి, నర్సాపూర్, తదితర ప్రాంతాలకు రద్దీకనుగుణంగా అదనపు రైళ్లను ఏర్పాటు చేసింది. ఇవి ఏ మూలకూ చాలటం లేదు. దీంతో ప్రయాణికులు ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. ట్రావెల్స్ నిర్వాహకులు పెరిగిన డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని చార్జీలను పెంచేశారు. వైజాగ్, అమలాపురం, కాకినాడ వంటి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో రూ.950 నుంచి రూ.2000 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. విశాఖపటా్ననికి నగరం నుంచి సాధారణ రోజుల్లో రూ.1300గా ఉండే స్లీపర్ బస్సు చార్జీ ఇప్పుడు రూ.4000 వరకు చేరుకుంది. రాజమండ్రికి రూ.3,800 వరకు, విజయవాడకు రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారు. -
TSRTC: దసరా బస్సుల్లో అదనపు ఛార్జీల్లేవ్
సాక్షి, హైదరాబాద్: దసరా పండుగకు ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలను చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బతుకమ్మ, దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం 5265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది. 12 రోజులకు పైగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు నిర్ణయించుకుందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ►అక్టోబర్ 13 నుంచి 25వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ►ఈ ప్రత్యేక బస్సుల్లో 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని సంస్థ కల్పించింది. ► అక్టోబర్ 22న సద్దుల బతుకమ్మ, 23న మహార్ణవమి, 24 దసరాకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముండటంతో.. ఆయా రోజుల్లో అవసరాన్ని బట్టి మరిన్నీ ప్రత్యేక బస్సులు ► హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులు నడుస్తాయి. ►హైదరాబాద్ లో ప్రధాన బస్టాండ్లైన ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్ తో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్ బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను సంస్థ నడిపించనుంది. ► పండుగ రోజుల్లో ఎంజీబీఎస్-ఉప్పల్, ఎంజీబీఎస్-జేబీఎస్, ఎంజీబీఎస్-ఎల్బీనగర్ మార్గాల్లో ప్రతి 10 నిమిషాలకో సిటీ బస్సును అందుబాటులో!. ►అక్టోబర్ 21 నుంచి 23 వరకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రెగ్యూలర్, స్పెషల్ సర్వీసులను ఎంబీజీఎస్ నుంచి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి నడపాలని సంస్థ నిర్ణయించింది. ► ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, మాచర్ల వైపునకు వెళ్లే బస్సులు సీబీఎస్ నుంచి బయలుదేరుతాయి. ►ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపునకు వేళ్లేవి జేబీఎస్, పికెట్ నుంచి వెళ్తాయి. ► వరంగల్, హన్మకొండ, జనగామ, పరకాల, నర్సంపేట, మహబుబాబాద్, తొర్రూరు, యాదగిరిగుట్ట బస్సులు ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్ నుంచి నడుస్తాయి. ► విజయవాడ, విజయనగరం, గుంటూరు, విశాఖపట్నం బస్సులు ఎల్బీనగర్ నుంచి బయలుదేరుతాయి. ► మిగతా సర్వీసులు యథావిధిగా ఎంజీబీఎస్ నుంచే నడుస్తాయి. “బతుకమ్మ, దసరా పండుగలకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం 5265 ప్రత్యేక బస్సులను నడపాలని టీఎస్ఆర్టీసీ ప్రణాళికలు సిద్దం చేసింది. అక్టోబర్ 13 నుంచి 25వ తేది వరకు ఈ ప్రత్యేక సర్వీసులన్ని నడుస్తాయి. గత దసరాకు 4280 ప్రత్యేక నడపగా.. అందులో 239 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ కల్పించాం. గత దసరా కన్నా ఈ సారి దాదాపు 1000 (20 శాతం) బస్సులను అదనంగా నడుపుతున్నాం. ముందస్తు రిజర్వేషన్ సర్వీసులను కూడా 535కి పెంచాం. ప్రధానంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముండటంతో ఆ మేరకు ఏర్పాట్లు చేయడం జరిగింది. రెగ్యూలర్ సర్వీసుల మాదిరిగానే ప్రత్యేక బస్సులకు సాధారణ చార్జీలనే సంస్థ వసూలు చేస్తుంది. స్పెషల్ సర్వీసులకు ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేయడం లేదు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడమే లక్ష్యంగా సంస్థ అన్ని చర్యలు తీసుకుంది. ఈ ప్రత్యేక సర్వీసులను ఉపయోగించుకుని క్షేమంగా, సురక్షితంగా ప్రయాణికులకు గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రభుత్వ రంగ సంస్థైన టీఎస్ఆర్టీసీ కోరుతోంది.” :::టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ ఈ ప్రత్యేక సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ ను సంస్థ అధికారిక వెబ్ సైట్ tsrtconline.in లో చేసుకోవాలని కోరారు. దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు. -
TSRTC: దసరా పండుగ వేళ ప్రయాణికులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: దసరా పండుగకు ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలను చేర్చేందుకు TSRTC అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బతుకమ్మ, దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం 5,265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది. అక్టోబర్ 13 నుంచి 25వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రత్యేక బస్సుల్లో 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని సంస్థ కల్పించింది. అక్టోబర్ 22న సద్దుల బతుకమ్మ, 23న మహార్ణవమి, 24 దసరాకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముండటంతో.. ఆయా రోజుల్లో అవసరాన్ని బట్టి మరిన్ని ప్రత్యేక బస్సులను నడపనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులు నడుస్తాయి. హైదరాబాద్‌లో ప్రధాన బస్టాండ్లైన ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్‌తో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్‌బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను సంస్థ నడిపించనుంది. పండుగ రోజుల్లో ఎంజీబీఎస్-ఉప్పల్, ఎంజీబీఎస్-జేబీఎస్, ఎంజీబీఎస్-ఎల్బీనగర్ మార్గాల్లో ప్రతి 10 నిమిషాలకో సిటీ బస్సును అందుబాటులో ఉంచనుంది. అక్టోబర్ 21 నుంచి 23 వరకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రెగ్యూలర్, స్పెషల్ సర్వీసులను ఎంబీజీఎస్ నుంచి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి నడపాలని సంస్థ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, మాచర్ల వైపునకు వెళ్లే బస్సులు సీబీఎస్ నుంచి బయలుదేరుతాయి. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపునకు వేళ్లేవి జేబీఎస్, పికెట్ నుంచి వెళ్తాయి. వరంగల్, హన్మకొండ, జనగామ, పరకాల, నర్సంపేట, మహబుబాబాద్, తొర్రూరు, యాదగిరిగుట్ట బస్సులు ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్ నుంచి నడుస్తాయి. విజయవాడ, విజయనగరం, గుంటూరు, విశాఖపట్నం బస్సులు ఎల్బీనగర్ నుంచి బయలుదేరుతాయి. మిగతా సర్వీసులు యథావిధిగా ఎంజీబీఎస్ నుంచే నడుస్తాయి. సజ్జనార్ ట్వీట్.. ‘బతుకమ్మ, దసరా పండుగలకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం 5265 ప్రత్యేక బస్సులను నడపాలని టీఎస్ఆర్టీసీ ప్రణాళికలు సిద్దం చేసింది. అక్టోబర్ 13 నుంచి 25వ తేది వరకు ఈ ప్రత్యేక సర్వీసులన్ని నడుస్తాయి. గత దసరాకు 4280 ప్రత్యేక నడపగా.. అందులో 239 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ కల్పించాం. గత దసరా కన్నా ఈ సారి దాదాపు 1000 (20 శాతం) బస్సులను అదనంగా నడుపుతున్నాం. ముందస్తు రిజర్వేషన్ సర్వీసులను కూడా 535కి పెంచాం. ప్రధానంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముండటంతో ఆ మేరకు ఏర్పాట్లు చేయడం జరిగింది. రెగ్యూలర్ సర్వీసుల మాదిరిగానే ప్రత్యేక బస్సులకు సాధారణ చార్జీలనే సంస్థ వసూలు చేస్తుంది. స్పెషల్ సర్వీసులకు ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేయడం లేదు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడమే లక్ష్యంగా సంస్థ అన్ని చర్యలు తీసుకుంది. ఈ ప్రత్యేక సర్వీసులను ఉపయోగించుకుని క్షేమంగా, సురక్షితంగా ప్రయాణికులకు గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రభుత్వ రంగ సంస్థైన టీఎస్ఆర్టీసీ కోరుతోంది. దసరా పండుగకు ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలను చేర్చేందుకు #TSRTC అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బతుకమ్మ, దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం 5265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది. అక్టోబర్ 13 నుంచి 25వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు… — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) October 1, 2023 -
సాధారణ చార్జీలతోనే సంక్రాంతి బస్సులు
సాక్షి, అమరావతి: సంక్రాంతి ప్రత్యేక బస్సు సర్వీసులను కూడా సాధారణ చార్జీలతోనే నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. గత 25ఏళ్లుగా దసరా, సంక్రాంతి సీజన్లో ప్రయాణికుల రద్దీని సొమ్ము చేసుకునేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు (అంటే 150శాతం చార్జీలు) వసూలు చేస్తూ వచ్చింది. కానీ తొలిసారిగా ఈ ఏడాది దసరా సీజన్లో ప్రత్యేక బస్సులను సాధారణ చార్జీలతోనే నడిపింది. అదే రీతిలో రానున్న సంకాంత్రి సీజన్లో కూడా ప్రత్యేక బస్సులను సాధారణ చార్జీలతోనే నడపనుంది. సంక్రాంతికి సొంతూరు వెళ్లి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం 6,400 ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు విజయవాడలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంక్రాంతి ప్రత్యేక బస్సుల వివరాలను వెల్లడించారు. సంక్రాంతి ప్రత్యేక బస్సు సర్వీసులకు సంబంధించిన వివరాలు సంక్రాంతికి ముందుగా జనవరి 6 నుంచి 14 వరకు 3,120 ప్రత్యేక బస్సు సర్వీసులను నిర్వహిస్తారు. సంక్రాంతి అనంతరం జనవరి 15 నుంచి 18 వరకు 3,280 ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతారు. మొత్తం 6,400 ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచే 3,600 బస్సులను ఏపీకి నిర్వహించనుండటం విశేషం. బెంగళూరు నుంచి 430, చెన్నై నుంచి 150 బస్సు సర్వీసులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు నడుపుతారు. ► రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి విజయవాడకు 800 బస్సులు, విశాఖపట్నానికి 450 బస్సులు, రాజమహేంద్రవరానికి 200 బస్సులు, ఇతర ప్రాంతాలకు మరో 770 ప్రత్యేక బస్సులు నడుపుతారు. ► అన్ని బస్సులను జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా పర్యవేక్షిస్తారు. ► ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌కు అవకాశం కల్పించారు. ఆర్టీసీ పోర్టల్ (www.apsrtconline.in) ద్వారా నేరుగా రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఏటీబీ ఏజెంట్లు, ఏపీఎస్ఆర్టీసీ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ సేవలను సక్రమంగా నిర్వహించేందుకు అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాలు, హైదరాబాద్‌లోని వివిధ పాయింట్ల వద్ద ప్రత్యేకంగా అధికారులు, సిబ్బందిని ఏర్పాటుచేస్తారు. ► ప్రయాణికులకు సమాచారం కోసం 24/7 కాల్‌సెంటర్( 0866–2570005)ను ఆర్టీసీ నిర్వహిస్తుంది. ► ఆర్టీసీ నూతనంగా ప్రవేశపెట్టిన నాన్ ఏసీ స్లీపర్ సర్వీసు స్టార్ లైనర్ బస్సులను హైదరాబాద్, ఒంగోలు, కడప, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు నుంచి నడుపుతుంది. ► ఆర్టీసీ అన్ని దూర ప్రాంత సర్వీసులకు వచ్చి వెళ్లేందుకు ముందుగా రిజర్వేషన్ చేసుకుంటే తిరుగు ప్రయాణచార్జీలో 10శాతం రాయితీ కల్పించింది. -
సంక్రాంతికి 6,400 స్పెషల్ బస్సులు.. రిజర్వేషన్‌పై 10శాతం రాయితీ!
సాక్షి, అమరావతి: సంక్రాంతి పండగకు స్వగ్రామం వెళ్లాలని భావిస్తున్నవారికి ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ శుభవార్త అందించింది. సంక్రాంతి రద్దీకి తగ్గట్లుగా అదనపు బస్సులు ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సోమవారం ప్రకటించారు. సంక్రాంతి కోసం మొత్తం 6,400 బస్సులు అదనంగా తిప్పనున్నట్లు వెల్లడించారు. సంక్రాంతి పండగ సందర్భంగా అదనపు బస్సులు ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవన్నారు ఎండీ తిరుమలరావు. సాధారణ ఛార్జీలతోనే బస్సులు నడుపుతామన్నారు. జనవరి 6 నుంచి 14 వరకు 3,120 బస్సులు, సంక్రాంతి తర్వాత మరో 3,280 బస్సులు అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అప్ అండ్ డౌన్ రిజర్వేషన్ చేసుకుంటే అదనంగా 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: విజయవాడ: క్రిస్మస్ తేనీటి విందుకు హాజరుకానున్న సీఎం జగన్ -
Hyderabad: ఐటీ ఉద్యోగులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త..
సాక్షి, హైదరాబాద్: ఐటీ ఉద్యోగులకు శుభవార్త. నగరంలోని ఐటీ కారిడార్‌లో ప్రత్యేక షటిల్ బస్‌లను నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. హైటెక్‌సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఈ సర్వీస్‌లను త్వరలోనే నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఐటీ ఉద్యోగులు వ్యక్తిగత వాహనాల్లో గంటల కొద్దీ ప్రయాణించి అవస్థలు పడుతుండడంతో ప్రత్యేక షటిల్ సర్వీసుల సదుపాయంతో తక్కువ వ్యయంతోనే సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ షటిల్ సర్వీస్‌ల కోసం ఆన్లైన్ సర్వే ద్వారా ఐటీ ఉద్యోగుల నుంచి అభిప్రాయాలను టీఎస్ఆర్టీసీ కోరుతోంది. ఆ సర్వే వివరాల మేరకు భవిష్యత్‌లో ఐటీకారిడార్‌లో మరిన్ని షటిల్ సరీ్వసులను నడుపుతామని ప్రకటించింది. ఈ షటిల్ సర్వీస్ సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకునే ఐటీ ఉద్యోగులు ‘షార్ట్‌యూఆర్‌ఎల్.ఏటీ/ఏవీసీహెచ్‌ఐ’ లింక్‌పై క్లిక్ చేసి వివరాలను నమోదు చేసుకోవాలని టీఎస్ఆర్టీసీ సూచించింది. ఉద్యోగులు తమ కంపెనీ వివరాలు, లొకేషన్, పికప్, డ్రాపింగ్ ప్రాంతాలను విధిగా నమోదు చేయడంతో పాటు తమ విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరింది. బుకింగ్‌కు ప్రత్యేక యాప్... ఐటీ ఉద్యోగులు సురక్షితంగా గమ్యస్థానాలను చేర్చడమే ప్రత్యేక షటిల్ బస్ సర్వీస్ ప్రధాన ఉద్దేశం. అందుకు సాంకేతికత ద్వారా ఈ సేవలను సులువుగా అందించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ సేవలను వినియోగించుకునేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తోంది. ఆ యాప్‌లోనే టికెట్ బుకింగ్ సదుపాయాన్ని కల్పించనుంది. ఈ సరీ్వస్‌లకు ట్రాకింగ్ సదుపాయం కూడా ఉంది. ప్రస్తుతం బస్ ఎక్కడుంది, ఏఏ ప్రాంతాల్లో తిరుగుతుంది అనే విషయాలను ట్రాకింగ్ సదుపాయం ద్వారా తెలుసుకోవచ్చు. మహిళల భద్రత నేపథ్యంలో షటిల్ బస్సుల్లో ట్రాకింగ్ సదుపాయాన్ని కల్పించినట్లు టీఎస్ఆర్టీసీ తెలిపింది. యాప్‌లో సర్వీస్ నంబర్, డ్రైవర్, కండక్టర్ ఫోన్ నంబర్లు, ఇతర వివరాలూ ఉంటాయని వివరించింది. ఈ సదుపాయాన్ని ఐటీ ఉద్యోగులు విరివిగా వినియోగించుకోవాలని సూచించింది. చదవండి: అమెరికా టూ ఇండియా!.. తక్కువ ధరకే విమాన టికెట్.. నమ్మితే అంతే! -
విద్యార్థుల ప్రయాణం సురక్షితం.. సుఖవంతం
పాఠశాలలు.. కళాశాలలకు వెళ్లేందుకు.. తిరిగి ఇంటికి చేరేందుకు విద్యార్థులకు బెంగలేదిక. చదువు సమయం వృథా అవుతుందన్న ఆందోళన అవసరం లేదు. సమయానికి అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. రాయితీ ప్రయాణాలు కల్పిస్తూ... విద్యార్థుల బంగారు భవితకు పరోక్షంగా బాటలు వేస్తోంది. పార్వతీపురం టౌన్: ఆర్టీసీ సంస్థ సేవలను విస్తరిస్తోంది. ఓ వైపు ప్రయాణికులతో పాటు కార్గో సేవలను అందిస్తూ ప్రశంసలు అందుకుంటోంది. అధిక ఆదాయం ఆర్జిస్తోంది. మరోవైపు విద్యార్థులకు సురక్షిత, సుఖమయ ప్రయాణ సదుపాయం కల్పిస్తోంది. విద్యాలయాల సమయానికి అనుగుణంగా బస్సు సర్వీసులు నడుపుతోంది. రాయితీపై పాసులు జారీ చేస్తోంది. దీనివల్ల చదువు సమయం వృథా కాకుండా.. విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు పరోక్షంగా సాయపడుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులు రాకపోకలు సాగించే రూట్లలో ప్రత్యేక బస్‌సర్వీసులను నడుపుతూ సకాలంలో గమ్యస్థానాలకు చేర్చుతోంది. ప్రత్యేక సర్వీసులు ఇలా.. జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, పాలకొండ నియోజకవర్గాల్లోని గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వెళ్లే విద్యార్థుల కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. పార్వతీపురం ఆర్టీసీ డిపో నుంచి 3, పాలకొండ నుంచి 5, సాలూరు డిపో నుంచి ఒక బస్సును పాఠశాల, కళాశాల వేళల్లో నడుపుతున్నారు. ఉచిత బస్‌పాస్‌లు ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు ఉచిత బస్‌పాస్‌లను జారీ చేస్తోంది. తల్లిదండ్రులకు పిల్లల చదువుల భారం లేకుండా చేస్తోంది. సురక్షిత, సుఖమయ ప్రయాణ సదుపాయం కల్పిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లాలో 1800 ఉచిత బస్సు పాసులను ఆర్టీసీ అధికారులు జారీ చేశారు. జిల్లాలోని 1,03,733 మంది విద్యార్థులు ఉండగా, అందులో సుమారు 40 శాతం మంది గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చి విద్యను అభ్యసించిన వారే. 12–18 ఏళ్లలోపు విద్యార్థులు 15,970 మందికి 60 శాతం రాయితీపై పాసులు జారీ చేశారు. అర్హులందరికీ ఉచిత పాసులు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలోని మూడు ఆర్టీసీ డిపోల పరిధిలోని 1800 మంది విద్యార్థులకు ఉచిత బస్సుపాసు లను అందజేశాం. 15, 970 మంది విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా జిల్లాలోని 9 విద్యార్థుల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశాం. విద్యార్థులు ఎక్కువుగా ప్రయాణించే ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాలకు అదనపు బస్సులను పంపించేందుకు చర్యలను చేపట్టాం. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. – టీవీఎస్ సుధాకర్, జిల్లా ప్రజారవాణా అధికారి, పార్వతీపురం మన్యం ఇబ్బందులు లేకుండా... గతంలో కళాశాలలకు రావాలన్నా, తిరిగి ఇంటికి వెళ్లాలన్నా బస్సులలో నిలబడి వెళ్లేవాళ్లం. ఒక్కోరోజు బస్సులు ఉండకపోవడంతో ఆటోలపై వెళ్లేవాళం. ఇప్పుడు మా కష్టాలన్నీ తీరాయి. విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రాయితీతో బస్సు పాసులను అందజేసి సమయానికి ఇంటికి, పాఠశా లలకు, ఇళ్లకు చేరేలా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నారు. – సాయి, విద్యార్థి, పుట్టూరు, పార్వతీపురం మండలం సమయానికి చేరుకుంటున్నాం కళాశాలల సమయానికి చేరుకుంటున్నాం. ఆర్టీసీ మా ప్రాతం నుంచి పార్వతీపురం పట్టణానికి ప్రత్యేక బస్సు వేశారు. దీనివల్ల ఎటువంటి భయంలేకుండా సమయానికే పాఠశాలలకు చేరుకుంటున్నాం. పాఠశాల పూర్తయిన తరువాత ఆర్టీసీ బస్టాండ్‌లో గంటల తరబడి వేచి ఉండకుండా సమయానికే బస్సు దొరుకుతుంది. తొందరగా ఇళ్లకు చేరుకుంటున్నాం. – దేవి ప్రసాద్, కొత్తపల్లి, కురుపాం మండలం -
మేడారం జాతరకు 3,845 ప్రత్యేక బస్సులు
సాక్షి, హైదరాబాద్: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు 3,845 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. ఈనెల 13 నుంచి 20 వరకు ఈ బస్సులు రాకపోకలు కొనసాగిస్తాయన్నారు. మేడారం జాతరకు ఆర్టీసీ సర్వీసుల నిర్వహణపై ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్‌తో కలిసి సోమవారం బస్‌భవన్‌లో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. కరోనా నుంచి రక్షించుకునేందుకు సిబ్బందికి స్పెషల్‌డ్రైవ్ ద్వారా బూస్టర్‌డోసులను ఇప్పించాలని, హ్యాండ్ శానిటైజర్స్, మాస్కులను అందించాలన్నారు. డిపో నుంచి బయలుదేరే సమయంలో బస్సును పూర్తిగా శానిటైజేషన్ చేయాలని సూచించారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి మాట్లాడుతూ జాతర బస్సుల రాకపోకల పర్యవేక్షణకు 12 వేల మంది సిబ్బంది, 150 మంది అధికారులను నియమించినట్లు చెప్పారు. 50 సీసీ కెమెరాలతో బస్సుల రాకపోకల వివరాలను తెలిపేందుకు ఆయా బస్టాండులలో ప్రత్యేక కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసినట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు. -
సంక్రాంతికి 6,970 స్పెషల్ బస్సులు
సాక్షి, అమరావతి: సంక్రాంతి సమీపిస్తున్న తరుణంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసేందుకు ఏపీఎస్ ఆర్టీసీ సన్నద్ధమైంది. భారీ సంఖ్యలో ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ సంక్రాంతి సీజన్లో ఏకంగా 6,970 ప్రత్యేక సర్వీసులు నిర్వహించనుంది. వాటిలో పండగ ముందు 4,145 ప్రత్యేక సర్వీసులు, పండగ తరువాత 2,825 ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ప్రణాళికను ఆమోదించింది. గత ఏడాది కంటే 35 శాతం అధికంగా ఈ ఏడాది ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. సంక్రాంతి స్పెషల్ సర్వీసులు ఇలా.. సంక్రాంతికి ముందు అంటే జనవరి 8వ తేదీ నుంచి 14 వరకు 4,145 ప్రత్యేక బస్సులు నిర్వహిస్తుంది. వీటిలో 1,500 బస్ సర్వీసులు హైదరాబాద్‌కు కేటాయించారు. విశాఖపట్నానికి 650, విజయవాడకు 250, బెంగళూరుకు 100, చెన్నైకి 45 సర్వీసులు నిర్వహిస్తారు. మిగిలిన 1,600 సర్వీసులు అన్ని జిల్లా కేంద్రాలతోపాటు ప్రధాన పట్టణాలకు కేటాయించారు. గత ఏడాది సంక్రాంతి ముందు మొత్తం 2,982 ప్రత్యేక బస్సులే ఆర్టీసీ నడిపింది. ఈసారి 1,163 సర్వీసులను అధికంగా కేటాయించింది. తిరుగు ప్రయాణానికీ ఇబ్బంది లేకుండా.. పండగ తరువాత తిరుగు ప్రయాణమయ్యే వారి కోసం కూడా తగినన్ని ప్రత్యేక బస్సు సర్వీసులను ఆర్టీసీ నడుపుతోంది. జనవరి 15 నుంచి 17 వరకు 2,825 ప్రత్యేక బస్సులు నడపనుంది. వాటిలో హైదరాబాద్‌కు అత్యధికంగా వెయ్యి బస్సులను కేటాయించారు. విశాఖపట్నానికి 200, విజయవాడకు 350, బెంగళూరుకు 200, చెన్నైకు 75 బస్సులతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వెయ్యి ప్రత్యేక బస్సులు నిర్వహిస్తారు. గతేడాది సంక్రాంతి తరువాత 2,151 ప్రత్యేక బస్సులు నిర్వహించారు. ఈ ఏడాది 674 బస్సులను అధికంగా కేటాయించారు. -
దసరా స్పెషల్ రూ.135 కోట్లు
సాక్షి, అమరావతి: దసరా సందర్భంగా ప్రత్యేక బస్సుల్ని నడపటం ద్వారా ఏపీఎస్ఆర్టీసీ రూ.135 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నడిపిన దసరా ప్రత్యేక బస్సులకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించింది. అత్యధికంగా ఈ నెల 18న రూ.17.05 కోట్ల రాబడి సాధించింది. ప్రత్యేక బస్సుల ద్వారా మొత్తం 1.40 లక్షల మంది అదనపు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. దసరా స్పెషల్ కింద ఆర్టీసీ 907 బస్సు సర్వీసులు నడిపింది. వాటిలో హైదరాబాద్‌కు 303, విజయవాడకు 152, విశాఖపట్నానికి 122, బెంగళూరుకు 95, రాజమహేంద్రవరానికి 89, తిరుపతికి 41, చెన్నైకి 12, ఇతర ప్రాంతాలకు 93 ప్రత్యేక బస్సులను నడిపింది. కాగా, రోజువారీ సర్వీసుల కింద నడిపిన 3,332 బస్ సర్వీసుల్లో సాధారణ చార్జీలనే వసూలు చేశారు. కోవిడ్ నిబంధనల్ని అనుసరించి, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా 50 మంది అధికారులు, 250 మంది సూపర్వైజర్లను వివిధ ప్రాంతాల్లో వినియోగించి బస్ సర్వీసుల నిర్వహణను ఆర్టీసీ పర్యవేక్షించింది. ఆర్టీసీని ఆదరించిన ప్రయాణికులకు ఆ సంస్థ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు కృతజ్ఞతలు తెలిపారు. దసరా రద్దీ సమయంలో సమర్థంగా విధులు నిర్వర్తించిన ఆర్టీసీ ఉద్యోగులను అభినందించారు. -
పల్లెకు పోదాం చలో.. చలో
బస్‌స్టేషన్(విజయవాడ సెంట్రల్): సకుటుంబ సపరివారంగా తెలుగింట నిర్వహించుకునే సంప్రదాయ పండుగ సంక్రాంతి సందడి అంతటా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అంతా పల్లెబాట పట్టారు. పట్టణాలు, టౌన్లలో వివిధ ఉద్యోగాలు, పనుల రీత్యా స్థిరపడిన వారు అంతా పల్లె బాట పట్టారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. ఇతరత్రా ప్రాంతాల నుంచి నగరానికి వచ్చేవారు, విద్య, ఉద్యోగాల నిమిత్తం నగరానికి వచ్చిన వారు తమ గమ్యస్థానాలకు వెళ్లేవారితో బస్టాండ్‌లో పండుగ వాతావరణం అలముకుంది. గత వారం రోజులుగా ప్రధానంగా రాయలసీమ, విశాఖపట్నం సెక్టార్, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లు షెడ్యూల్ ప్రకారం ఉన్న బస్సులు కిక్కిరిసి నడుస్తున్నాయి. ఆర్టీసీ107 ప్రత్యేక సర్వీసులు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్టాండ్‌లో షెడ్యూల్ ప్రకారం కాకుండా అదనపు సర్వీసులను 50 శాతం అదనపు చార్జీలతో 107 ప్రత్యేక బస్సులుగా ఏర్పాటు చేశారు. ఈ మేరకు విశాఖపట్నం–27, రాజమండ్రి–31, రాయలసీమ–27, కాకినాడ–4 అమలాపురం–11, నెల్లూరు–2, ఒంగోలు–4, రావులపాలెం–1బస్సుల్ని అదనంగా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా విజయవాడ నగరంతోపాటు రూరల్ ప్రాంతాలకు తరలివచ్చే ప్రయాణికుల కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నుంచి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఇక్కడి నుంచి బస్సుల్ని పంపించారు. వారిని తరలించేందుకు కృష్ణా రీజియన్ నుంచి 87 బస్సుల్ని హైదరాబాద్ పంపారు. ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక బస్సులకు సంబంధించి రిజర్వేషన్లు ఆన్లైన్ అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. అవి కూడా ఎప్పటికప్పుడు పూర్తయిపోతున్నట్లు వివరించారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: ట్రాఫిక్ మేనేజర్ మూర్తి సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులు తాకిడి ఎక్కువైందని, వారికి సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో అప్రమత్తంగా వ్యవహరించాలని పండిట్ నెహ్రూ బస్టాండ్ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ మూర్తి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు బస్టాండ్‌లో శుక్రవారం కిందిస్థాయి అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. ప్రయాణికుల రాకపోకల విషయంలో నిరంతరం ప్రత్యేక శ్రద్ధతో ఉండాలన్నారు. ట్రాఫిక్ సిబ్బంది బస్సుల నిలుపుదల విషయంలో డ్రైవర్లు అలసత్వం వహిస్తారని ట్రాఫిక్ సమస్య రాకుండా వారిని అప్రమత్తం చేయాలన్నారు. బుకింగ్ సూపర్వైజర్స్ వచ్చిన బస్సుల్ని వచ్చినట్లుగా ప్రయాణికుల్ని ఎక్కించి పంపించాలన్నారు. స్టాల్స్ నిర్వాహకులు ఎటువంటి అధికధరలకు విక్రయించకుండా చూసుకోవాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ మనోహర్, ట్రాఫిక్ సీఐలు, అసిస్టెంట్లు, బుకింగ్ సూపర్‌వైజర్స్‌లు పాల్గొన్నారు. -
పండగ చేస్కోండి!
సాక్షి, సిటీబ్యూరో: దసరా ప్రత్యేక బస్సులకు ఆర్టీసీ ప్రణాళికలను రూపొందించింది. ఈ నెల 8వ తేదీ నుంచి 18 వరకు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు 4480 బస్సులను అదనంగా నడిపేందుకు చర్యలు చేపట్టింది. మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్సుఖ్నగర్, కాచిగూడ బస్స్టేషన్లతో పాటు లింగంపల్లి, చందానగర్, కేపీహెచ్‌బీ, ఎస్ఆర్నగర్, అమీర్‌పేట్, టెలిఫోన్‌భవన్, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్‌రోడ్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ఆర్టీసీ అధీకృత టికెట్ బుకింగ్ కేంద్రాల నుంచి కూడా ప్రత్యేక బస్సులను నడుపుతారు. ఈ మేరకు ఒకే రూట్లో ప్రయాణించే ఎక్కువ మంది ప్రయాణికులు ఉన్న కాలనీల నుంచి నేరుగా బస్సులు బయలుదేరుతాయి. ప్రయాణికుల రద్దీ మేరకు బస్సుల సంఖ్యను పెంచేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. మరోవైపు దూరప్రాంతాలకు వెళ్లే ప్రత్యేక బస్సుల్లో యదావిధిగా 50 శాతం అదనపు చార్జీలను వసూలు చేయనున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు, విజయవాడ, విజయనగరం, తెనాలి, గుంటూరు, గుడివాడ, రాజమండ్రి, రాజోలు, పోలవరం, మచిలీపట్నం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, విశాఖపట్నం, శ్రీకాకుళం, భీమవరం, నర్సాపురం, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ఉదయగిరి, కనిగిరి, కందుకూరు, పామూరు, పొదిలి తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయి. రద్దీకి అనుగుణంగా బస్సులు సాధారణంగా ప్రతి రోజు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి 1.25 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో తెలుగు రాష్ట్రాలకు రాకపోకలు సాగిస్తారు. మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్ల నుంచే ఎక్కువ సంఖ్యలో బయలుదేరుతారు. దసరా రద్దీ నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య ప్రతి రోజు 1.5 లక్షల నుంచి1.6 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా 15వ తేదీ నుంచి 18 వరకు ప్రయాణికుల రాకపోకలు భారీగా ఉంటాయి. ఈ మేరకు ప్రత్యేక బస్సుల సంఖ్య కూడా పెరగనుంది. దీంతో నగరంలో ట్రాఫిక్ రద్దీ చోటుచేసుకోకుండా ఆ మూడు రోజుల పాటు శివారు ప్రాంతాల నుంచే బస్సులు బయలుదేరేవిధంగా చర్యలు చేపట్టినట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ యాదగిరి తెలిపారు. 8 నుంచే స్పెషల్ బస్సులు ఈ నెల 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 1981 ప్రత్యేక బస్సులను 16వ తేదీ నుంచి 18 వరకు 2499 బస్సులను ఏర్పాటు చేస్తారు. 16వ తేదీ ఒక్క రోజే 1110 బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలను సిద్ధం చేసింది. 17వ తేదీన మరో 1085 బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకున్నారు. 18వ తేదీన 304 బస్సులు అదనంగా బయలుదేరుతాయి. ఈ బస్సులన్నీ ప్రతి రోజు రాకపోకలు సాగించే సుమారు 3500 రెగ్యులర్ బస్సులకు అదనంగా నడిపే బస్సులే. ప్రయాణికులు ఆర్టీసీ ఏటీబీ కేంద్రాల నుంచి, బస్స్టేషన్లలోని టిక్కెట్ బుకింగ్ కౌంటర్ల నుంచి ముందస్తు రిజర్వేషన్లు తీసుకోవచ్చు. అలాగే ఠీఠీఠీ. http://www.tsrtconline.in/oprs-web వెబ్సైట్ నుంచి కూడా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఏ రూట్ బస్సులు ఎక్కడి నుంచి.... ♦ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల బస్సులు జేబీఎస్ నుంచి బయలుదేరుతాయి. ♦ నంద్యాల, ఆత్మకూరు (కె), వెలుగోడు, నందికొట్కూరు, పులివెందుల, ఆళ్లగడ్డ, మైదుకూరు, బనగానపల్లి, బద్వేల్, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కడప, రాజంపేట్, రాయచోటి, కోడూరు, చిత్తూరు వైపు వెళ్లే బస్సులు కాచిగూడ బస్‌స్టేషన్ నుంచి బయలుదేరుతాయి. ♦ జనగామ, పరకాల, నర్సంపేట్, మహబూబాద్, వరంగల్ వైపు వెళ్లే బస్సులు ఉప్పల్ నుంచి బయలుదేరుతాయి, ♦ మిర్యాలగూడ, నల్గొండ, కోదాడ, సూర్యాపేట వైపు వెళ్లే బస్సులను దిల్సుఖ్నగర్ బస్‌స్టేషన్ నుంచి నడుపుతారు. ఎంజీబీఎస్ నుంచి.... మహాత్మాగాంధీ బస్స్టేషన్లలోని వివిధ ప్లాట్పామ్ల నుంచి బయలుదేరే బస్సుల వివరాలు ఇలా ఉన్నాయి. ♦ బస్సుల సమాచారం కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు... మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ : 8330933419, జూబ్లీబస్‌స్టేషన్ : 8330933532, ఏటీఎం ఏపీఎస్ ఆర్టీసీ : 9100948191 -
తీర్థయాత్రా స్పెషల్
రాజమహేంద్రవరం సిటీ: కార్తికమాసంలో పంచారామాలు, శ్రీశైలం తీర్థయాత్రలకు, నవంబర్‌లో శబరిమల వెళ్లే భక్తుల కోసం 490 ప్రత్యేక బస్ సర్వీసులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ చింతా రవికుమార్ తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రత్యేక సర్వీసులకు నిర్ణయించిన ధరల బ్రోచర్‌ను ఆవిష్కరించారు. నవంబరు 23, 29 తేదీలలో శబరిమలకు 4 రోజులు, 5 రోజుల తీర్థయాత్ర ప్యాకేజీతో సూపర్ లగ్జరీ బస్సులు సిద్ధం చేసామన్నారు. 4 రోజుల ప్యాకేజీలో విజయవాడ, తడ బైపాస్, తేనేగాటి, శబరిమల ఉంటాయని, ధర రూ.3500 అని చెప్పారు. 5 రోజుల యాత్రలో కాణిపాకం, ఎరుమేళి, శబరిమల, తిరుపతి, విజయవాడ, రాజమహేంద్రవరం ఉంటాయని, ధర రూ.3800గా నిర్ణయించామన్నారు. గత ఏడాది 22 బస్సులు నడపడం ద్వారా రూ.29 లక్షల ఆదాయం గడించగా ఈ ఏడాది 60 బస్సులు నడపనున్నట్టు చెప్పారు. ఆదాయంలో తూర్పు రీజియన్‌కు అగ్రస్థానం.. ఆరు నెలల కాలంలో ఆర్టీసీలో తూర్పురీజియన్ రూ.9.83 కోట్ల రాబడి సాధించి రాష్ట్రవ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచిందని ఆర్ఎం చెప్పారు. రీజియన్ చరిత్రలో ఇంత ఆదాయం సాధించడం ఇదే మొదటి సారన్నారు. దసరాకు గత ఏడాది 610 ప్రత్యేక బస్సులు నడపడం ద్వారా రూ.1.18 కోట్లు ఆదాయం సాధించామని, ఈ ఏడాది 925 బస్సులను నడిపి రూ.రెండు కోట్లు సాధించామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం డిపో మేనేజర్ టి.పెద్దిరాజు, అసిస్టెంట్ మేనేజర్ కుమార్, ప్రత్యేక బస్సుల నిర్వహణాధికారి బాషా, పీఆర్ఓ రాజబాబు పాల్గొన్నారు. -
పుష్కరాలకు ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు
అనంతపురం న్యూసిటీ: పుష్కర భక్తుల సౌకర్యార్థం జిల్లాలోని 12 ఆర్టీసీ డిపోల నుంచి స్పెషల్ సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్ఎం భట్టు చిట్టిబాబు తెలిపారు. విజయవాడకు రెగ్యులర్‌గా నడిపే 12 బస్సులతో పాటు మరో 15 బస్సులను అదనంగా పంపుతున్నామన్నారు. అలాగే కర్నూలుకు 25 ఎక్స్‌ప్రెస్ బస్సులు, విజయవాడకు 175 బస్సులు పంపుతున్నట్లు ఆయన వెల్లడించారు. అందులో విజయవాడకు 100, కర్నూలుకు 75 బస్సులు కేటాయించామన్నారు. అనంతపురం బస్సులు బయలుదేరే సమయం డిపో ఉదయం సాయంత్రం అనంతపురం – విజయవాడ 6 గంటలకు 5 గంటలకు హిందూపురం–విజయవాడ 5 గంటలకు 5గంటలకు ఉరవకొండ–విజయవాడ 5 గంటలకు 7 గంటలకు తాడిపత్రి–విజయవాడ 7గంటలకు 6 గంటలకు గుంతకల్లు–విజయవాడ 8గంటలకు 8 గంటలకు కదిరి–విజయవాడ(ఈ బస్సు కదిరి నుంచే వెళ్తుంది.అనంతకు రాదు) 8 గంటలకు 8 గంటలకు పుట్టపర్తి 8.30 గంటలకు – అనంతపురం–శ్రీశైలం 6.గంటలకు – అనంతపురం–బీచుపల్లి 7గంటలకు –