శుక్రవారం రాత్రి పిల్లలిద్దరిని గొంతు నులిపి చంపేశారు. అనంతరం మరో ఇద్దరితో కలిసి మృత దేహాలను కారులో తరలించడానికి ప్రయత్నించారు. అనుమానం వచ్చి ఇంటి యజమాని బయటకు వచ్చి చూడగా కారులో మృతదేహాలు కనిపించాయి. ఈ విషయాన్ని చుట్టుపక్కల వారితో చెప్పి వారిని అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం నిందితులను చైతన్యపురి పోలీసు స్టేషన్‌కు తరలించారు. కాగా పిల్లల మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్లే హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే పిల్లల తల్లిదండ్రులకు తెలిసే ఈ హత్య జరిగిందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.