నాణ్యతకు చిరునామా భారతి సిమెంట్ | Bharathi Cement is major manufacturers in Cement supplier India. | Sakshi
Sakshi News home page

నాణ్యతకు చిరునామా భారతి సిమెంట్

Published Wed, Feb 24 2016 1:17 AM | Last Updated on Sun, Sep 3 2017 6:15 PM

నాణ్యతకు చిరునామా భారతి సిమెంట్

నాణ్యతకు చిరునామా భారతి సిమెంట్

అనంతపురం రూరల్:  అత్యంత నాణ్యత గత సిమెంట్‌గా భారతి సిమెంట్ పేరుగాంచిందని ఆ కంపెనీ మార్కెటింగ్ విభాగం అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎంసీ మల్లారెడ్డి తెలిపారు. మంగళవారం రాత్రి అనంతపురంలో ఇంజనీర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ భారతి సిమెంట్‌ను ప్రజలకు చేరువ చేయడంలో ఇంజనీర్ల సహాయ సహకారాలు, చేయూత మరువలేనివన్నారు. ప్రస్తుతం నాలుగు దేశాలకు భారతి సిమెంట్ ఎగుమతి అవుతోందన్నారు. అక్కడ సైతం వినియోగదారుల ఆదరాభిమానాలు పొందిందన్నారు. జేఎన్‌టీయూ మాజీ రెక్టార్, ఏసీఎస్ డెరైక్టర్ సుదర్శన్‌రావు మాట్లాడుతూ, భారతి సిమెంట్ వాడడం వల్ల బిల్డింగ్ జీవితకాలం పెరుగుతుందని ఇటివల నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైందన్నారు. ఎక్కడా రాజీపడకుండా అత్యంత నాణ్యతతో కూడిన సిమెంట్‌ను సరఫరా చేస్తున్న కంపెనీగా భారతి సిమెంట్ పేరుగాంచిందన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎంఎన్ రెడ్డి, టెక్నికల్ మేనేజర్ సీ ఓబుళ్‌రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ విజయవర్ధన్ రెడ్డి, ఇంజనీర్లు,  కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement