భారతి, కల్బుర్గి సిమెంట్ ప్లాంట్లకు ఎనర్జీ ఎఫిసియెంట్ అవార్డులు
భారత్‌లో వికాట్ సిమెంట్ తయారీ కర్మాగారాలు- కల్‌బుర్గి ప్లాంట్ (కల్‌బుర్గి సిమెంట్), కడప ప్లాంట్ (భారతి సిమెంట్ కార్పొరేషన్)లకు భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ప్రతిష్టాత్మక ఎనర్జీ ఎఫిసియెంట్ అవార్డులు లభించాయి. హైదరాబాద్, హెచ్‌ఐసీసీలో సీఐఐ 2016 ఎక్స్‌లెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ 17వ జాతీయ అవార్డుల ప్రక్రియ కార్యక్రమం ఈ నెల 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ జరిగింది. ప్రతిష్టాత్మక అవార్డులను దక్కించుకోడానికి సిమెంట్ విభాగంలో ఏకంగా 80 ప్లాంట్స్ పోటీపడ్డాయి. అయితే చివరకు అవార్డులను గెలుచుకున్న 32 ప్లాంట్లలో కల్‌బుర్గి ప్లాంట్, భారతి సిమెంట్ (కడప) ప్లాంట్ నిలిచాయి.
కల్‌బుర్గి సిమెంట్స్‌సహా మొత్తం ఎనిమిది సిమెంట్ ప్లాంట్స్ ‘‘ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిసియెంట్ యూనిట్’’ అవార్డులను దక్కించుకున్నాయి. భారతి సిమెంట్ కార్పొరేషన్‌సహా 24 సిమెంట్ ప్లాంట్స్‌కు ‘‘ఎనర్జీ ఎఫిసియెంట్ యూనిట్’’ గుర్తింపు లభించింది. వికాట్ ఇండియా సీఓఓ అనూప్ కుమార్ సక్సేనా, భారతి సిమెంట్ కడప ప్లాంట్ హెడ్ ఎం.సాయి రమేశ్, కల్‌బుర్గి ప్లాంట్ హెడ్ అనుభవ్ వర్మలు అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు.