అగ్ర స్థానానికి భారతి సిమెంట్ | bharathi cement is now top possition | Sakshi
Sakshi News home page

అగ్ర స్థానానికి భారతి సిమెంట్

Published Sat, Jul 2 2016 1:35 AM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM

అగ్ర స్థానానికి భారతి సిమెంట్ - Sakshi

అగ్ర స్థానానికి భారతి సిమెంట్

సాక్షి, హైదరాబాద్: నిర్మాణ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సరికొత్త టెక్నాలజీతో వినియోగదారులకు అత్యుత్తమ ఉత్పత్తిని, సేవల్ని అందించి వారి మన్ననలు పొందుతున్నామని భారతి సిమెంట్ మార్కెటింగ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎం.సీ.మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో ఈస్ట్ జోన్ పరిధిలోని ఇంజనీర్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ ఈస్ట్‌జోన్ పరిధిలో భారతి సిమెంట్ ఇంజనీర్ల సహకారంతో మొదటిస్థానంలో నిలిచిందని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లి అభివృద్ధి దిశగా భారతి సిమెంట్‌ను అన్ని ప్రాంతాల్లోనూ అగ్రస్థానంలో నిలుపుతామని అన్నారు.

  అత్యంత నాణ్యమైన సిమెంటును అందిస్తూ ప్రీమియం సిమెంటుగా వినియోగదారుల ఆదరణతో మొదటి స్థానంలో నిలిచిందని అన్నారు. హైదరాబాద్ ఐఐఐటీ ప్రొఫెసర్, సివిల్ ఇంజనీర్ డా.ప్రదీప్‌కుమార్... భూకంపాలకు కూడా చెదరకుండా వుండే భవనాలు కట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫ్లైఓవర్‌లు, పెద్ద భవనాలు కట్టేటప్పుడు తీసుకోవాల్సిన మెళకువల గురించి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇంజనీర్లకు పలు సూచనలు, సలహాలు ఇచ్చి అవగాహన కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement