
భారతి సిమెంట్‌కు ఆదరణ
బచ్చన్నపేట : భారతి సిమెంట్‌కు మార్కెట్‌లో రోజురోజుకు ఆదరణ పెరుగుతుందని ఆ సంస్థ ఏరియా సేల్స్ మేనేజర్ నాగేశ్వర్‌రావు, రీజినల్ టెక్నికల్ మేనేజర్ మారుతీకుమార్ అన్నారు. స్థానిక కుర్మ సంఘ భవనంలో శ్రీసాయి, నిర్మల ఎలక్ట్రికల్ యజమానులు బైరి రాజు, దిడిగ లచ్చయ్య ఆధ్వర్యంలో తాపీమేస్త్రీలకు ప్రొజెక్టర్ ద్వారా శుక్రవారం అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్మనీ, రోబోటెక్ టెక్నాలజీతో దేశంలోనే అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో సిమెంట్ తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఇతర కంపెనీల సిమెంట్‌తో పోలిస్తే ఇందులో అత్యధిక గ్రేడ్ కలిగి ఉం డడమే కాకుండా సున్నపురాయి శాతం తక్కువగా ఉంటుం దని స్పష్టం చేశారు. భారతి సిమెంట్‌తో ఇళ్లు, ఇతర కట్టడా లు నిర్మించుకునే వారికి ఉచితంగా కంపెనీ నుంచి సల హాలు, సూచనలు అందిస్తామని వెల్లడించారు. భారతి సిమెంట్‌తో నిర్మాణం లాభదాయకంగా ఉంటుందని అన్నా రు. అనంతరం ఇంటి నిర్మాణం చేసే సమయంలో జాగ్రత్తలు, కాంక్రీట్‌ను సమపాళ్లలో కలిపే విధానం, నాణ్యమైన నిర్మాణ పద్ధతులపై తాపీమేస్త్రీలకు ప్రొజెక్టర్ ద్వారా అవగాహన కల్పించారు. అలాగే కంపెనీ నుంచి తాపీమేస్త్రీలకు రూ.లక్ష ప్రమాద బీమా సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మేస్త్రీలు కేశయ్య, ఎద్దు ప్రభాకర్, జెరిపోతు ల సిద్ధయ్యతోపాటు 50 మంది పాల్గొన్నారు.