నిజామాబాద్ బిజినెస్,న్యూస్‌లైన్: నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడకుండా ఆరంభం నుంచి దృఢమైన సిమెం ట్‌ను అందించడమే లక్ష్యంగా భారతి సిమెంట్ కంపెనీ ముందుకుసాగుతోందని భారతి సిమెంట్ కంపెనీ జనరల్ మేనేజర్ మల్లారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో గల ఓ హోటల్‌లో ఆదిలాబాద్,నిజామాబాద్ జి ల్లాల డీలర్లతో సమావేశం నిర్వహించారు. మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అత్యాధునిక సాంకేతిక యం త్రాంగంతో భారతి సిమెంట్‌ను తయారుచేస్తున్నామన్నారు. జర్మనీ టెక్నాలజీతో రోబోటిక్ ప్రమాణాలను పాటిస్తున్నామని తెలిపారు. భారతి సిమెంట్ అనతికాలంలోనే ప్రజల విశ్వాసాన్ని చూరగొందన్నారు. మార్కెట్‌లో చలామణిలో ఉన్న 36 బ్రాండెడ్ సిమెంట్ కంపెనీల్లో భారతి సిమెంట్ ఒకటిగా నిలిచిందన్నారు.
ఉత్తర భారతదేశంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని సీమాంధ్రతోపాటు తెలంగాణ జిల్లాల్లో కూడా భారతి సిమెంట్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయన్నారు. అమ్మకాలను రెట్టింపు చేసుకుందన్నారు. తమ కంపెనీ లాభాపేక్షతో కాకుండా మేలైన సిమెంట్‌ను అందించాలన్న ఏకైక లక్ష్యం తో ముందుకు సాగుతోందన్నారు. మరిం త పురోగతి సాధించేందుకు డీలర్ల సహకారం ఎంతైన అవసరమన్నారు. ప్రజలకు మంచి సిమెంట్‌ను అందించడంతోపాటు సేవా కార్యక్రమాలను కూడా చేపడుతోందన్నారు. అనంతరం భారతి సిమెంట్ డీజీఎం కొండల్‌రెడ్డి, రీజినల్ మేనేజర్ ప్రమోద్‌రెడ్డి, టెక్నికల్ మేనేజర్ ఓబుల్‌రెడ్డిలు ప్రసంగించారు. డీలర్ల సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకున్నారు.
నాణ్యతకు మారుపేరు భారతి సిమెంట్
Published Thu, Sep 26 2013 2:28 AM | Last Updated on Tue, Oct 9 2018 5:34 PM
Advertisement