మనిషిని వెంటాడిన బుల్లి ఉడత.. చివరకు.. | Baby Squirrel Chased A Man In Germany | Sakshi
Sakshi News home page

మనిషిని వెంటాడిన బుల్లి ఉడత.. చివరకు..

Published Sat, Aug 11 2018 2:47 PM | Last Updated on Tue, Aug 21 2018 6:08 PM

Baby Squirrel Chased A Man In Germany - Sakshi

మనిషిని వెంటాడిన బుల్లి ఉడత

బెర్లిన్‌ : ఓ మనిషిని వెంటాడిన బుల్లి ఉడత అతన్ని ముప్పతిప్పలు పెట్టింది. వెంటపడి ఓ వీధి నుంచి మరో వీధికి పరుగులు పెట్టించింది. ఆ ఉడత భారి నుంచి తప్పించుకోవటానికి ఆ వ్యక్తి ఏకంగా పోలీసులను సంప్రదించాడు. స్పందించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ఉడతను అదుపులోకి తీసుకున్నారు. ఈ వింతైన సంఘటన జర్మీనీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... గురువారం ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్‌ చేసి తనను ఓ ఉడత వెంటాడుతోందని ఎలాగైనా రక్షించండని వారిని బతిమాలుకున్నాడు.  స్పందించిన పోలీసులు అతను చెప్పిన ప్రాంతానికి చేరుకున్నారు.

అయితే పోలీసులు అక్కడికి చేరుకునేలోపే కథ సుఖాంతమైంది. అతన్ని వెంటాడి అలసిపోయిన ఆ ఉడత రోడ్డు పక్కన నిద్రపోయింది. దాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు దానికి కార్ల్‌ ఫ్రెండ్‌రిచ్‌ అని పేరు పెట్టి జంతునిలయానికి ఇచ్చేశారు. జంతు సంరక్షకురాలు క్రిస్టినా క్రెంజ్‌ మాట్లాడుతూ.. ఆ ఉడత తల్లినుంచి వేరుపడి ఆ వ్యక్తిని తల్లిగా ఉహించుకుని వెంటపడినట్లు తెలిపారు. ఇలా తల్లికి దూరమైన ఉడతలు తల్లి స్థానంలో వేరే వారిని ఊహించుకుంటాయని వెల్లడించారు. బుల్లి ఉడత ఒక్కసారిగా వెంటబడేసరికి ఆ వ్యక్తి భయపడిపోయి ఉంటాడని అంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement