Squirrel
-
రిపబ్లికన్లకు ‘ఉడుత సాయం’!
న్యూయార్క్: నేడు మొదలవుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పటిదాకా ట్యాక్స్‌లు, అబార్షన్ హక్కులు, అక్రమ వలసలు ప్రధాన అంశాలుకాగా చిట్టచివర్లో ఒక ఉడుత చొరబడింది! రేబిస్ అనుమానంతో దాన్ని అధికారులు చంపేయడం చర్చనీయంగా మారింది. రిపబ్లికన్లు దీన్ని తమ ప్రచారాంశంగా మార్చుకున్నారు. బుల్లి టోపీలు, గమ్మతైన ట్రిక్కులతో మిఠాయిలపై గెంతుతూ ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన ఈ ఉడుతకు ‘పీనట్’ అని పేరు. న్యూయార్క్‌లో మార్క్ లాంగో అనే వ్యక్తి ఏడేళ్లుగా పెంచుతున్నాడు. దీంతోపాటు నక్కలా చిన్నగా ఉండే రఖూన్ అనే జీవినీ పెంచుతున్నాడు. ఈ వన్య ప్రాణుల పెంపకానికి అనుమతి, లైసెన్స్ తప్పనిసరి. అవి లేకపోవడంతో అధికారులు వాటిని స్వాదీనం చేసుకున్నారు. ఉడుత ఇటీవల ఒకరిని కరిచిందట. దాంతో ప్రాణాంతకర రేబిస్ వ్యాధి ప్రబలే ఆస్కారముందంటూ పీనట్, రఖూన్ రెండింటినీ గత వారం విషమిచ్చి చంపేశారు. దీన్ని రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ రన్నింగ్ మేట్ వాన్స్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘బైడెన్ సర్కారు నిరంకుశ పాలనకు ఇది నిదర్శనం. ప్రభుత్వం మతిలేని, దయలేని యంత్రంగా మారింది. అనాథ ఉడుతను నిర్దయగా చంపేసింది. ఇలాంటి ఉడుతలను సైతం ట్రంప్ కాపాడగలరు’’ అంటూ మస్క్ పోస్ట్ చేశారు. ‘‘6 లక్షల మంది నేరస్తులు, 13 వేల మంది హంతకులు, 16 వేల మంది రేపిస్టులు స్వేచ్ఛగా అమెరికాలోకి అడుగు పెట్టేలా చేసిన డెమొక్రటిక్ ప్రభుత్వం ఒక పెంపుడు ఉడుతను మాత్రం బతకనీయలేదు’’ అంటూ వాన్స్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఉడుతలకు, పావురాలకు గర్భనిరోధక మాత్రలు
పావురాలు, ఉడుతలు.. ప్రకృతికి, మనిషికి ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయనే సంగతి మీకు తెలుసా? అమెరికన్, యూరోపియన్ శాస్త్రవేత్తలు ఈ చిన్ని ప్రాణులు మనకు ఎంతో హాని చేస్తున్నాయనే విషయాన్ని గుర్తించారు. దీంతో ఈ జంతువుల సంఖ్యను తగ్గించడంపై దృష్టి సారించారు. దీనిలో భాగంగా పావురాలకు, కుందేళ్లకు గర్భనిరోధక మాత్రలు ఇవ్వాలని శాస్త్రవేత్తలు యోచిస్తున్నారు.పావురాలు, ఉడుతలేకాదు అడవి పందులు, చిలుకలు, జింకలు మొదలైనవి అటు ప్రకృతికి ఇటు మనుషులకు ముప్పుగా మారుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోజురోజుకు వీటి సంఖ్య పెరగడమే ఇందుకు కారణమని వారు అంటున్నారు. ఉడుతలలోని గ్రే స్క్విరెల్ జాతిని 1800లో అమెరికా నుండి ఇంగ్లండ్‌కు తీసుకువచ్చారు. ఇప్పుడు ఇక్కడ వాటి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇవి చెట్ల బెరడును తొలిచి కలపనునాశనం చేస్తున్నాయి. ఈ ఉడుతల వల్ల ఏటా దాదాపు రూ.40 కోట్ల మేర నష్టం వాటిల్లుతున్నట్లు రాయల్ ఫారెస్ట్రీ సొసైటీ ఆఫ్ ఇంగ్లండ్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.ఇక పావురాల విషయానికొస్తే అవి మనుషులకు శ్వాసకోశ సమస్యలను కలిగిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదేవిధంగా మరికొన్ని జంతువులు మనుషులకు హాని కలిగిస్తున్నాయి. అందుకే వాటి సంఖ్యను నియంత్రించేందుకు వాటికి గర్భనిరోధక మాత్రలు ఇచ్చే ప్రయోగాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. కాంటినెంటల్ యూరప్, స్కాండినేవియాలో గతంలో అడవి పందుల సంఖ్య దాదాపు 5 లక్షలు ఉండగా, 2020 నాటికి వాటి సంఖ్య 10 లక్షలకు పెరిగిందని ఇటలీ రైతు సంఘాలు చెబుతున్నాయి. వీటి కారణంగా పంటలు దెబ్బతినడమే కాకుండా, రోడ్డు ప్రమాదాలు కూడా గణనీయంగా పెరిగాయి.ఈ జంతువుల సంఖ్యను తగ్గించడానికి, వాటిని చంపడం కంటే పునరుత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించడం ఉత్తమమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ది గార్డియన్‌లో ప్రచురితమైన కథనం ప్రకారం ఈ జంతువులు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, పర్యావరణ నష్టాలను కలిగిస్తున్నాయని న్యూయార్క్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ జియోవన్నా మాస్సే తెలిపారు. ఈ జంతువుల సంఖ్యను నియంత్రించేందుకు, వాటి ఆహార గింజల్లో గర్భనిరోధక మాత్రలు కలపాలని యోచిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.బ్రిటన్‌లో ఉడుతలకు హాజెల్‌నట్ అనే పండులో గర్భనిరోధక మాత్రలు ఉంచి వాటికి ఇస్తున్నారు. ఈ ప్రయోగ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పావురాలు, ఇతర పక్షుల సంఖ్యను నియంత్రించడానికి వాటికి అవి తినే గింజలలో గర్భనిరోధక మాత్రలు కలిపి ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
Viral Video: ఉడుత పళ్లకు ఇంత ట్రీట్మెంటా?
-
ఓసినీ వేషాలో..! ఉడుత చేష్టలకు నెటిజన్స్ ఫిదా.. వీడియో వైరల్
సాధారణంగా జంతువులు యజమాని దృష్టిని ఆకర్షించడానికి రకరకాల తిక్క పనులు చేస్తుంటాయి. ఇటు.. అటు.. దూకుతుంటాయి. పక్క జంతువులతో ఊరికే గొడవ పడుతుంటాయి. కొన్ని సార్లు దెబ్బతగిలినట్లు యాక్టింగ్ కూడా చేస్తుంటాయి. ఇలాంటి చేష్టలను మన పెంపుడు కుక్కల్లో చూస్తుంటాం. కానీ ఉడుతలు కూడా ఈ కొవలోకి వచ్చేశాయా? అని అనిపిస్తుంది మీరు ఈ వీడియో చూస్తే..! ఇంతకూ ఓ నల్లని ఉడత ఏ చేసిందో తెలుసా..? ఉడుతలు కూడా యాక్టింగ్ చేస్తాయా? అంటే అవుననే అనాలి. దానికి ఏం అనిపించిందో తెలియదు కానీ ఇంట్లో చీపురుతో కాసేపు ఆటలాడింది. అనంతరం ఆ చీపురును మీద వేసుకుని గది ఫ్లోర్‌పై బోర్లా పడుకుంది. చీపురు దాని పొట్టపై పడి ఉండడంతో.. ఉడుతపై చీపురు పడి గాయపడినట్లుందే అని అనిపించాల్సిందే సదరు వీక్షకునికి. దాని నటనకు ఆస్కార్ ఇవ్వొచ్చనుకోండి..! ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. ఉడుత కొంటె చేష్టలకు వ్యూవర్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నట్లు కామెంట్ పెట్టారు. (ఫ్లైయింగ్ ఉండుత.. లైయింగ్ ఉడుత) 'ఎగిరే ఉడుత.. అబద్దాల ఉడుత' అని మరొకరు కామెంట్ చేశారు. Squirrel fakes an injury pic.twitter.com/5xXeTFUv7U — Crazy Clips (@crazyclipsonly) June 3, 2023 ఉడుతలు చాలా చురుకుగా ఉంటాయని ఓ జంతు నిపుణుడు తెలిపారు. నిత్యం ఎగురుతూ, దూకుతూ ఆటలాడుతుంటాయని చెప్పారు. పట్టణాల్లోని గదులు వాటికి చాలా చిన్న ప్రదేశం కావున ఆడుకోవడానికి కావాల్సిన ప్రదేశం ఉండదని అన్నారు. నల్లని ఉడుతలను పెంచడానికి అనుమతి లేదని చెప్పారు. వాటికి ప్రత్యేకమైన కేర్ అవసరమని పేర్కొన్నారు. వెటర్నరీ సెంటర్లలో లభించవని తెలిపారు. సాధారణంగా ఇండోనేషియా, మలేషియా లాంటి దేశాల్లో ఉంటాయని చెప్పారు. ఇదీ చదవండి: వార్నీ..! కుక్కకు ఇంత పెద్ద నాలుకా..! గిన్నీస్ రికార్డ్ -
ఉడుత సాయం కాదు... ఉడుతకే సాయం!
‘ఉడుత సాయం’ అంటారు కానీ ఇక్కడ ఒక ఉడత మాత్రం సాయం కోసం మనిషి దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చింది. తనకు దాహం వేస్తోందని ఆ వ్యక్తికి సైగలు చేస్తూ చూపించింది. సదరు దయగల వ్యక్తి ఉడుతకు వాటర్ బాటిల్‌తో నీళ్లు తాగించాడు. ఈ వీడియో పాతదే అయినప్పటికీ ఎవరో ‘రెడ్డిట్’లో రీ–షేర్ చేశారు. పాతదా, కొత్తదా అనే విషయం పక్కన పెడితే ఈ వీడియో ఎంతోమందిని భావోద్వేగానికి గురిచేసింది. -
పిల్లల కథ: ఏయ్ ఉడుతా.. నీకేం పనీ పాట లేదా?
వంశీ పెరట్లో నిల్చుని చూస్తున్నాడు. జామచెట్టు మీద ఉడుత అటూ ఇటూ పరుగులు తీస్తోంది. మధ్యలో ఆగి కాయనందుకుకుని, కాసేపు కొరికి కింద పడేసింది. ఆ తర్వాత ఎక్కడి నుంచో ఓ కాకి రివ్వున వచ్చింది. దాంతో ఉడుత కొమ్మల చాటుకు మాయమైపోయింది. కాకి చెట్టు కొమ్మ మీద దర్జాగా వాలింది. వెంటనే ఠాప్ మని ఏదో పడ్డ చప్పుడు. కిందకు చూస్తే సగం కొరికిన బాదం కాయ. కాకి కాసేపు నాలుగు దిక్కులా పరిశీలనగా చూసి, స్నేహితులకు తన ఉనికి తెలియజేస్తూ మళ్లీ కావ్ కావ్ అంటూ ఎగిరిపోయింది. ‘ఎవరింట్లోని బాదం చెట్టు కాయో.. ఈ పక్షులు, జంతువులు అన్నీ ఇలా పాడుచేస్తున్నాయి. కష్టపడి చెట్లను పెంచుకుంటే మధ్యలో ఇవొచ్చి అన్నిటినీ తిన్నంత తిని, పారేస్తుంటాయి’ కోపంగా అనుకున్నాడు. అంతలో రెండు కోతులు వచ్చాయి. వంశీ భయంతో వెనక్కు నడిచి, లోపలికి వెళ్ళాడు. అయినా ఆ కోతుల్ని చూడాలనే కుతూహలంతో మెష్ తలుపు వేసి, అక్కడ నిలబడి చూస్తున్నాడు. ‘అయ్యో! ఆకుల చాటు జామకాయల్ని చూడనే చూశాయి. తీరిగ్గా కొరుక్కు తింటున్నాయి. తను తినాల్సిన జామకాయల్ని ఈ కోతులు తింటున్నాయి’ కోపంగా అనుకున్నాడు. అటువైపు పావురాలు కూడా సపోటా చెట్టు మీద వాలుతూ, ఎగురుతూ విన్యాసాలు చేస్తున్నాయి. తన జామకాయల్ని తినేసిన కోతుల మీద పట్టరాని కోపం వచ్చింది. తలుపు వెనక ఉన్న కర్ర తీసుకుని వాటిని బెదిరించాడు. అవి వంశీ వంక గుర్రుగా చూస్తూ, తమ భాషలో వంశీపై అరచి వెళ్లిపోయాయి. హమ్మయ్య అనుకున్నాడు వంశీ. ఆ వెంటనే ఉడుత బయటికి వచ్చింది. వంశీకి మళ్లీ కోపం వచ్చింది. ‘ఏయ్ ఉడుతా.. నీకేం పనీ పాట లేదా? నీకు తోడు ఆ కాకులు, పావురాలు, కోతులు.. మీరంతా చెట్లకు శత్రువులు. అన్ని కాయల్ని నాశనం చేస్తారు. మీరు తిండికి తప్ప ఎందుకూ పనికిరారు’ అని విసుక్కుంటూ పెరట్లోకి నడిచి, ఉష్ ఉష్ అంటూ ఉడుతను తోలాడు. అది చటుక్కున మరో కొమ్మ మీదకు చేరి ‘మిత్రమా.. వంశీ!’ అనడంతోనే ఆశ్చర్యంతో నోరు తెరుచుకుని అలాగే ఉండిపోయాడు. ‘ఏమన్నావు, మాకు పనీ పాట లేదా? జంతువులు.. పక్షులు కాయలు, పళ్లను కొరికేసే మాట నిజమే. కానీ అలా కొరికి పడేయడం వల్ల ఆ గింజలు, విత్తనాలుగా నేలలో చేరి, మళ్లీ మొలకెత్తి.. మొక్కలై, క్రమంగా చెట్లై, మహావృక్షాలవుతున్నాయని, పూలు, కాయలు, పండ్లను ఇస్తున్నాయని నువ్వు తెలుసుకోవాలి. పైగా మా ఉడుత జాతి అయితే మంచుకురిసే ప్రాంతాల్లో, చలికాలం కోసం ముందు చూపుతో గింజల్ని పోగుచేసి వేర్వేరు చోట్ల, గుంతల్లో దాచిపెట్టుకుంటుంది. కానీ మాకు, మీకు మాదిరే కాస్తంత మతిమరుపు. దాంతో ఆ తర్వాత గింజల్ని ఎక్కడ దాచుకున్నదీ మర్చిపోవటంతో ఆ గింజలన్నీ మొలకెత్తి, చెట్లుగా ఎదుగుతాయి. పక్షి జాతులయితే దూర దూర ప్రాంతాలకు విత్తనాలను ఎంతగా వ్యాప్తి చేస్తాయో! అంతేనా, మా విసర్జనల ద్వారా కూడా రకరకాల విత్తనాలు నేలకు చేరి, మొలకెత్తి, మొక్కలుగా ఎదుగుతున్నాయి తెలుసా? నిజానికి మానవులు, అంటే మీరు నాటే చెట్ల కన్నా మేం నాటే చెట్లే ఎక్కువ. మేం తినేది గోరంత, నాటే చెట్లు కొండంత. ఆవిధంగా మేం, మీకు ఎంతో సేవ చేస్తున్నాం. పర్యావరణ పరిరక్షణకు చెట్లు అధికంగా పెంచాలని నువ్వు చదువుతుంటావుగా! మేం ఆ పని చేస్తున్నాం. పర్యావరణం బాగుండాలంటే సకల జీవుల ఉనికి అవసరమే. అదే.. జీవ వైవిధ్యం ఉండడం ప్రధానం. మరి, మేం మీ మిత్రులమని ఇప్పటికైనా ఒప్పుకుంటావా? ’ అంది ఉడుత. అంతా విన్న వంశీ ‘ఉడుతా! నన్ను క్షమించు. ఇన్ని రోజులూ నీ సేవలు తెలుసుకోలేక పోయాను. ఇవాళ్టి నుంచి మనం స్నేహితులం. ఒట్టు’ అంటుంటే.. ‘ఒరే వంశీ! ఎంత ఆదివారమైనా మరీ ఇంత పొద్దెక్కేదాకా పడుకుంటావా? పైగా కలలొకటి.. ఎవరితో క్షమించు, ఒట్టు.. అని ఏదేదో అంటున్నావు’ అంటూ అమ్మ అరవడంతో వంశీ ఉలిక్కిపడి లేచాడు. ఏమీ అర్థం కాలేదు. ‘పెరట్లో ఉడుత, కాకి, కోతులు మాట్లాడడం అంతా కలా? ఎంత బాగుంది కల’ అనుకుంటూ ఒక్క ఉదుటున లేచి పెరట్లోకి పరుగుతీశాదు. జామచెట్టు మీద ఉడుత ఏదో కొరుకుతూ కనిపించింది. ‘అమ్మ దొంగా! కల్లో మేం కూడా విత్తనాలు నాటుతాం అని పాఠం చెప్పి, ఇప్పుడేమో ఏమీ తెలీనట్లు అమాయకంగా చూస్తావా?’ అని వంశీ అంటుంటే వెనకే ఉన్న అమ్మ నవ్వింది. -
సైకోలా మారిన ఉడత.. 18 మందిపై దాడి!
ఉడతలు మనుషులను చూస్తే భయపడుతూ! చెట్లపై తిరగటం చూస్తూ ఉంటాం. కానీ ఓ ఉడత మనుషులపై దాడులకు తెగపడి సుమారు 18మంది గాయపరిచింది. ఈ ఘటన యూకేలోని బక్లీ టౌన్లో చోటుచేసుకుంది. గత వారంలో ఆ ఉడత సైకోలా ప్రవర్తిస్తూ రెండు రోజులు పాటు మనుషులపై దాడికి చేసిందని ఆ దేశ మీడియా పేర్కొంది. డిసెంబర్ 26న బక్లీ రెసిడెంట్స్ ఫేస్బుక్ గ్రూప్‌లో ఉడతకు దాడి విషయాన్ని షేర్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ‘నా వేలు పైన దంతాల గుర్తులు ఉన్నాయని, నాపై దాడికి చేసిన ఉడతను వదిలించుకోవడానకి ఇబ్బందిపడ్డాను.దాని దంతాలు పిన్నుల వలే ఉన్నాయి’ అని షెరీ డేవిడ్సన్ అనే స్థానికుడు చెప్పారు. క్రిస్మస్ సమయంలో రెండు రోజుల వ్యవధిలోనే ఈ ఉడుత 21సార్లు దాడి చేసి 18 మందిని గాయపరిచిందని స్థానికులు పేర్కొన్నారు. అనంతరం ఆ ఉడతను పట్టుకున్నామని, అది ప్రస్తుతం సురక్షితంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందిస్తూ.. ‘ఉడతలు కూడా సైకోగా మారుతాయా?’ అని కామెంట్లు చేస్తున్నారు. -
Current Shock: ఎంతపని చేశావ్.. ఉడతా..
ప్యాపిలి(కర్నూలు జిల్లా): కరెంట్ స్తంభంపై ఒక ఉడుత తీగలను తాకడంతో అవి తెగి కింద పడి విద్యుదాఘాతంతో రెండు ఎద్దులు మృతి చెందగా ఒక బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు..రాయలచెరువు గ్రామానికి చెందిన చౌడప్ప, లలితల కుమారుడు జగదీశ్ (10) ఎడ్ల బండిపై పొలానికి బయలుదేరాడు. పొలానికి వెళ్లే దారిలో 11 కేవీ విద్యుత్ తీగ తెగి పడి ఉండటాన్ని గమనించకుండా బండిని వెళ్లనిచ్చాడు. చదవండి: పిల్లలు పుట్టడం లేదని బొడ్డుపేగు తిన్న వివాహిత.. ఆ తర్వాత.. విద్యుత్ తీగ ఎద్దులకు తగలగానే అవి షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాయి. బండిపై ఉన్న జగదీశ్ సైతం షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. బండి వెనుక వస్తున్న బాలుడి పెద్దనాన్న మద్దయ్య గమనించి బాలుడిని కాపాడాడు. తీవ్రంగా గాయపడిన జగదీశ్‌ను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కరెంట్ స్తంభంపై ఒక ఉడుత తీగలను తాకడంతో ప్రమాదవశాత్తు తెగి కింద పడినట్లు ట్రాన్స్‌కో ఏఈ వినయ్ కుమార్ తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి నివేదికను ఉన్నతాధికారులకు పంపినట్లు ఆయన తెలిపారు. -
ఇదేం ట్రెండ్రా నాయనా... డస్ట్‌బిన్ కవరే డ్రెస్సు.!
లండన్: ఈ మధ్యకాలంలో చాలామంది విన్నూత్న రీతిలో రకరకాల డ్యాన్స్‌లు లేదా ఫీట్లు లేదా రకరకాల వంటలకు సంబంధించిన వీడియోలతో ప్రజలను ఆకర్షించడం చూస్తునే ఉన్నాం. ఆఖరికీ అసాధ్యమనే వాటిని కూడా సుసాధ్యం అనిపించేలా చేసి ప్రజలందరీ మనస్సులను గెలుచుకున్న వాళ్ల గురించి విని ఉన్నాం. కానీ కొంతమంది తమ వెర్రి చెష్టలు చూస్తే మనకు గందరగోళంగా అనిపిస్తుంది. (చదవండి: ఫిజిక్స్‌లోని ఒక ప్రశ్నకోసం .... హెలికాఫ్టర్‌నే అద్దెకు తీసుకున్నాడు) అలా అని వాళ్లు తెలివిలేని అమాయకులా అంటే ఆది కాదు. ఎందువల్ల కొంత మంది ఈ విధంగా అర్ధంకాని రీతిలో ప్రవర్తిస్తారో తెలియదు కానీ. వాటికి కూడా ఏదైనా అర్థం ఉంటుందేమో. ఏదిఏమైనా వారే నేరుగా చెబితే గానీ మనకు తెలియదు. ఇందంతా ఎందుకు చెబుతున్నానంటే. ఆహారం పై ఉప్పు చల్లడం, నమ్మశక్యం కానీ వస్తువులతో మాంసాన్ని కోసి చూపించే వీడియోలతో సాల్ట్ బేగా ప్రసిద్ధిగాంచిన టర్కిష్ చెఫ్ నస్రెట్ గోక్సే ఇప్పుడు సరికొత్త వీడియోతో ప్రజలను విస్మయానికే గాక గందరగోళానికి గురి చేస్తున్నాడు. అయితే ఆ వీడియోలో సాల్ట్ బేగా పిలుసున్న చెఫ్ నస్రెట్ పైన డస్ట్‌బిన్ కవర్‌ను టీ షర్ట్‌లా ధరించి, కింద ఒక షార్ట్ వేసుకుని వినూత్నరీతిలో కనపడతాడు. అంతేకాదు నస్రెట్ ఒక పార్క్‌లో ఉడుతలకు, పావురాలకు ఆహారం తినిపిస్తూ ప్రకృతితో మమేకమవుతున్నట్లు కనిపిస్తాడు. ఈ మేరకు దీనికి సంబంధించిన వీడియో తోపాటుగా "ప్రకృతి ప్రేమికులు ఆనందంగా ఉంటారు" అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో నెట్టింట ఈ వీడియో తెగ వైరల్ అవ్వడమే కాక నస్రెట్ ఎందుకలా చెత్త సంచిని టీషర్ట్గా ధరించాడు అంటూ నెటిజన్లు పెద్ద చర్చకు తెర తీస్తారు. పైగా నస్రెట్ యునైటెడ్ కింగ్‌డమ్‌లోని తన రెస్టారెంట్లో అధిక ధరల నేపథ్యంలో ఇలా వైరటీగా ధరించాడు కాబోలు అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వస్తున్నాయి. మీరు ఓ లుక్ వేయండి. (చదవండి: బాప్రే!.. ఆ జంట దొంగలించిన వైన్ బాటిల్స్ ఖరీదు రూ.3 కోట్లా!) View this post on Instagram A post shared by Nusr_et#Saltbae (@nusr_et) -
ఉడుతను పొడిచిన కాకులు.. వైద్యం చేయించడంతో అక్కడే మకాం..!
సాక్షి,సూర్యాపేట( నల్గొండ): గంతులు వేస్తూ చెట్లపై తిరగాల్సిన ఓ చిన్ని ఉడుత ఇంట్లో అల్లారుముద్దుగా ఆడుకుంటోంది. ఏకంగా మనుషుల మీదనే కోలాడుతోంది. ఈ దృశ్యాలు చూపరులను ఆశ్చర్యపరుస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట మండలం జనగామ క్రాస్‌రోడ్డులో నివాసముంటున్న షేక్ ఖలీం–హలీమా దంపతుల కుమారుడు అస్లం ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. రెండునెలల క్రితం అస్లం ఓ రోజు జనగామ క్రాస్ సమీపంలోని పిల్లలమర్రి రోడ్డులో స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. అదే క్రమంలో నాలుగైదు కాకులు కలిసి ఓ చిన్న ఉడుత పిల్లను పొడుస్తున్నాయి. రక్తం కారుతున్న ఆ ఉడుతను చూసి చలించిపోయిన అస్లం వెంటనే దాన్ని పట్టుకొని ఇంటికి తీసుకొచ్చాడు. దానికి అయిన గాయానికి ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించి అప్పటినుంచి ఇంట్లోనే అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. రోజూ ఆ ఉడుతకు పాలు పోస్తూ, ఆహారం పెడుతున్నారు. ఇంకేముంది ఆ ఉడుతకు ఆ ఇంటి వాళ్లంతా తెగ నచ్చేసినట్టున్నారు కాబోలు నిత్యం వాళ్ల మీదనే ఆడుకుంటోంది. చదవండి: ఎవరు ఈమె..నా పియానో వాయిస్తుంది ? -
ఇంట్లోనుంచి పోనంటున్న ఉడుత
-
హృదయాన్ని తాకే వీడియో: నీళ్ల కోసం ఉడత..
చిట్టి ఉడత ఓ అబ్చాయిని నీళ్లు అడుగుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించి వీడియోను సుశాంత్ నందా అనే ఆటవీ అధికారి శుక్రవారం ట్విటర్లో షేర్ చేశారు. ‘నీళ్లు అడుగుతున్న ఉడత’ అంటూ షేర్ చేసిన ఈ వీడియోలో ఉడత తన వెనక కాళ్లపై నిలుచుని నీళ్లు అడుగుతున్న వీడియో ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటోంది. దాహంతో ఉన్న ఆ చిట్టి ఉడత రోడ్డుపై వెళుతున్న అబ్బాయి చేతిలో వాటర్ బాటిల్ చూసింది. (చదవండి: ఎమోజీ డే: భావాలెన్నో పలికించొచ్చు!) Squirrel asking for water.... pic.twitter.com/JNldkB0aWU — Susanta Nanda IFS (@susantananda3) July 16, 2020 అతడి వెనకాలే పరిగెత్తి రెండు కాళ్లపై నిలుచుని నీళ్లు కావాలంటూ దీనంగా ముందు కాళ్లు చాచింది. ఆ తర్వాత అబ్బాయి బాటిల్ మూత తీసి ఉడత నోటికి అందించడంతో గటగటా తాగేసి దాని దారిన అది వెళ్లిపోయింది. ఈ వీడియోకు ఇప్పటి వరకు లక్షల్లో వ్యూస్ వేలల్లో కామెంట్లు వచ్చాయి. ఇది చూసిన నిర్మాత నీలా నందా స్పందిస్తూ.. ‘ఈ వీడియో చూసి నా గుండె బరువెక్కింది. దీని లాగే నీళ్ల కోసం, ఆహారం కోసం అలమటించే మనుషులు జంతువులు చాలా వరకు ఉండొచ్చు. ఈ వీడియో ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేసింది’ అంటూ రీట్వీట్ చేశారు. (చదవండి: ఫేక్ అకౌంట్లతో విద్యార్థినుల నగ్న చిత్రాలు..) -
ఈ ఉడుత.. మరో బాబా రాందేవ్
ముంబై : యోగా ఆరోగ్యానికి మంచిదంటారు.. అలాంటి యోగాను మనలో ఎంతమంది చేస్తున్నారో తెలీదు కానీ ఒక ఉడుత మాత్రం తన యోగాతో నెటిజన్ల మనుసులు గెలుచుకుంటుంది. ఇండియన్ ఫారెస్ట్ అధికారి సాకెత్ భదోలా షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఆ వీడియోలో ఉడుత ఒక చెక్కపై నిల్చుని ఉదర బాగాన్ని లోనికి బయటకు తీస్తూ శ్వాస తీసుకుంది. కాగా ఉడుత చేసిన ఆసనం పేరు 'కపల్బాతి ఆసన' అని పేర్కొన్నారు. కపల్బాతి ఆసనం అంటే గట్టిగా శ్వాస పీలుస్తూ ఉంటే ఉదర బాగంలో ఉండే ప్రతీ అవయవం కదులుతుంది. ఈ వీడియోనూ ఇప్పటికే 11వేల మందికి పైగా వీక్షించారు. 'ఉడుత యోగాసనం కొత్తగా ఉంది.. ఈ ఉడుత మరో బాబా రాందేవ్' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వంట చేయటం అంత వీజీ కాదు! మాస్టర్ చెఫ్‌కి యాక్షన్ హీరో అవార్డ్ -
పాపం.. ఈ ఉడుతను చూస్తే జాలేస్తోంది
-
పాపం.. ఈ ఉడుతను చూస్తే జాలేస్తోంది
ఉడుతా ఉడుతా ఊచ్! ఎక్కడికెళ్తావోచ్ ! అని చిన్నప్పుడు పాడుకున్న పాట మీకందరికి గుర్తుండే ఉంటుంది.ఇప్పుడు ఇది ఎందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం.. ఒక ఉడుత ఆహారం కోసం చేసిన పని ప్రసుత్తం తెగ నవ్వు తెప్పిస్తుంది. పక్షుల కోసమని ఒక ఇనుప ఊచపై ఆహారాన్ని పెట్టి ఉంచారు. అదే సమయంలో అక్కడే ఉన్న ఉడుతకు ఆకలైందో లేక దానిని అందుకోవాలని భావించిందో... వెంటనే ఇనుప ఊచను ఎక్కడానికి ప్రయత్నించింది. అయితే ఎన్నిసార్లు ఎక్కినా కిందకు జారిపోతుండడంతో చేసేదేంలేక అక్కడినుంచి నిరాశతో వెళ్లిపోయింది. అసలు విషయం ఏంటంటే ఇనుప ఊచకు గ్రీస్ రాసి ఉండడంతో ఉడుత ఎక్కిన ప్రతీసారి పట్టును నిలుపుకోలేక జర్రున జారిపోతుంది. దీనిని వీడియో తీసి ట్విటర్లో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆహారం అందుకోవడం కోసం ఉడుత చేసిన ప్రయత్నం చూసిన ప్రతీ ఒక్కరికి నవ్వు తెప్పిస్తుంది. పక్షుల కోసమని ఇనుప ఊచపై పెట్టిన ఆహారాన్ని వేరే జంతువులు తినకుండా ఇలా చేసి ఉంటారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
ఉడత మాంసం వాసన చూపిస్తూ..
లండన్: డియోనిసి ఖ్లేబ్నికోవ్ , గాటిస్ లాగ్డిన్స్ అనే ఇద్దరు వ్యక్తులు చనిపోయిన ఉడత పచ్చి మాంసాన్ని బహిరంగంగా తినడంతో కలకలం రేగింది. లండన్‌లోని ఓ శాఖాహార మర్కెట్ ముందు ఉడత మాంసాన్ని తిన్న వీడియోను గాటిస్ లాగ్డిన్స్ తన యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేశాడు. వీడియో ప్రకారం.. బహిరంగంగా ఉడతను తినే క్రమంలో చిన్న పిల్లలు, వారి తల్లిదండ్రులు తినవద్దంటూ.. ఎంత వారించినా వారు వినకుండా వీరంగం సృష్టించారు. ఈ ఉడత మాంసం వాసన ఎలా ఉందని అడుగుతూ.. రోడ్డుపై వెళ్లేవారిని ఇబ్బందిపెట్టారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి పచ్చి మాంసం ఎందుకు తింటున్నారంటూ ప్రశ్నించగా.. ఉడికించుకొని తింటే పోషక విలువలు లభించవని సమాధానమిచ్చారు. కాగా న్యూసెన్స్ చేస్తున్న వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని.. కోర్టులో హాజరుపరచారు. ఈ క్రమంలో ‘ శాఖాహారానికి వ్యతిరేకంగా మాంసాహారం తినాలని అవగాహన కల్పించడానికి, ఇలా ఉడత పచ్చి మాంసం తిన్నామని వారు కోర్టుకు తెలిపారు. దీంతో బహిరంగంగా ఉడత మాంసం తినటం, పలువురుకి ఇబ్బంది కలిగించడాన్ని నేరంగా పేర్కొన్న కోర్టు వారికి 200 పౌండ్ల జరిమానా విధించింది. అయినా ప్రవర్తన మార్చుకోకుండా వారు తదుపరి విచారణకు కోర్టుకు హాజరుకాలేదు. దీంతో కోర్టు వారికి మరో 400 పౌండ్లు జరిమానా విధించింది. -
వైరల్ ఫోటో : బాబోయ్.. ఇదేం ఉడత
ఉడత.. చూడటానికి చాలా చిన్నగా, బుజ్జిగా భలే ముద్దుస్తోంటుంది. రామయణంలో కూడా దీనికో ప్రత్యేక స్థానం ఉంది. రాముని మీద భక్తితో తనకు తోచిన సాయం చేసి.. ఉడతా భక్తిగా ప్రసిద్ధి పొందింది. అలాంటి ఆ చిన్న ప్రాణిని చూస్తే ఎవరికైనా ముద్దుస్తోంది. కానీ ఇప్పుడు మేం చెప్పబోయేది వింటే.. ఇక మీదట ఉడతల్ని చూసినా భయపడతారు. సాధరణంగా పాము, ముంగిసల మధ్య వైరం సాధరణం. ఒక వేళ పాము, ఉడతల మధ్య ఘర్షణ జరిగితే.. ఏది గెలుస్తుంది. పాము అనుకుంటాం. కదా. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ఉడత కాస్తా పామును చంపి తింది. నమ్మశక్యంగా లేకపోయిన ఇది వాస్తవం. ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ వైరలవుతోంది. అమెరికా నేషనల్ పార్క్ అధికారులు షేర్ చేసిన ఈ ఫోటోలో ఓ ఉడత.. పామును తల దగ్గర గట్టిగా పట్టుకుని.. తినడానికి సిద్ధంగా ఉంది. ఈ ఫోటో గురించి అధికారులు మాట్లాడుతూ.. ‘ఉడతలనగానే.. పళ్లు, గింజలు లాంటివి తిని జీవిస్తాయి అనుకుంటాం. కానీ రాక్ ఉడతలు ఆకులు, అలమలతో పాటు బల్లులు, పాములు, గుడ్లను కూడా తింటాయి. ఈ ఫోటోలో ఉన్న రాక్ ఉడత కూడా పామును తినేస్తుంది. ఇది వాటి స్వభావం’ అని తెలిపారు. సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఈ ఫోటో ఇప్పటికే వేల షేర్స్, కామెంట్స్ అందుకుంది. ‘ఇక మీదట ఉడతల్ని చూసి కూడా భయపడాలి’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. అయితే ఈ ఫోటో ఇప్పటిది కాదని.. 2009లో తీశారని... దాన్ని ఇప్పుడు ఇంటర్నెట్లో మరో సారి షేర్ చేశారని తెలిపారు అధికారులు. -
ఉడుత పచ్చి మాంసం తిన్నందుకు..
మాస్కో : మెరుగైన ఆరోగ్యం కోసమని ఉడుత పచ్చి మాంసాన్ని తిన్న దంపతులు మృత్యువాత పడ్డారు. ప్లేగు వ్యాధితో వారు మరణించడంతో ఇరుగుపొరుగు వాళ్లతో పాటు స్థానిక ప్రజలంతా ఊరు విడిచి వెళ్లిపోతున్నారు. ఈ ఘటన మంగోలియా- రష్యా సరిహద్దులోని సగనూర్ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు.. మంగోలియా సరిహద్దు వద్ద భద్రతా ఏజెంట్‌గా పనిచేసే ఓ వ్యక్తికి అనారోగ్యం సోకడంతో ఉడుత మాంసం తినాలని భావించాడు. ఈ క్రమంలో భార్యతో కలిసి ఉడుత కిడ్నీలు, గాల్ బ్లాడర్, ఉదర భాగాన్ని పచ్చిగానే ఆరంగించాడు. దీంతో ఇన్ఫెక్షన్ సోకి జ్వరం, తీవ్రమైన తలనొప్పితో పాటు శరీరంలోని వివిధ అవయవాలు పాడైపోవడంతో రావడంతో సదరు వ్యక్తి పదిహేను రోజుల క్రితం మరణించగా.. ఈనెల 1న అతడి భార్య ఆస్పత్రిలో మృతిచెందింది. దీంతో సగనూర్ పట్టణ ప్రాంతంలో అలర్ట్ విధించడంతో స్థానికులంతా అక్కడి నుంచి దూర ప్రాంతాలకు పయనమవుతున్నారు. ఈ విషయం గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వాలంటీర్ ఆరిన్‌తుయా ఓచిర్‌పురేవ్ మాట్లాడుతూ.. పచ్చి మాంసం తినడం వల్లే దంపతులిద్దరు చనిపోయారని పేర్కొన్నారు. వీరికి తొమ్మిది నుంచి 14 నెలల వయస్సు గల నలుగురు పిల్లలు ఉన్నారని.. ప్రస్తుతం వారిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలిపారు. మృతులకు సోకిన అత్యంత ప్రమాదకర నిమోనిక్ ప్లేగు వ్యాధి వేగంగా వ్యాప్తి చెందే కారణంగా ప్రభుత్వాధికారులు ప్రజలను వెంటనే అప్రమత్తం చేశారని వెల్లడించారు. ప్రజలతో పాటు టూరిస్టులను కూడా వేరే చోటికి తరలిస్తున్నారని పేర్కొన్నారు. కాగా 2010-15 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 3200 మందికి ప్లేగు వ్యాధి సోకగా.. అందులో 584 మంది మరణించారని డబ్ల్యూహెచ్ఓ నివేదిక వెల్లడించింది. అదే విధంగా అమెరికాలో ఏడాదికి సగటున ఏడు ప్లేగు వ్యాధి కేసులు నమోదవుతున్నాయని సీడీసీ పేర్కొంది. ముఖ్యంగా న్యూ మెక్సికో, నార్తన్ అరిజోనా, సదరన్ కొలరెడో, కాలిఫోర్నియా, సదరన్ ఓరెగాన్, వెస్ట్రన్ నెవాడలో ఇలాంటి కేసులు ఎక్కువగా ఉంటున్నాయని తెలిపింది. ఇక పచ్చి మాంసం తినడం వల్ల మరణాలు సంభవించడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదని హవాయి యూనివర్సిటీ ట్రాపికల్ మెడిసన్ డైరెక్టర్ విలియం గోస్నెల్ అన్నారు. పచ్చి మాంసం తినడం వల్ల శరీరంలోకి అనేక రకాల చెడు బ్యాక్టీరియా సులభంగా ప్రవేశించి.. ఇన్ఫెక్షన్ కలిగిస్తుందని పేర్కొన్నారు. దీని కారణంగా విపరీతమైన కడుపు నొప్పి , తలనొప్పి, తీవ్ర జ్వరం, షాక్‌కు గురవ్వడం, చర్మ సంబంధ వ్యాధులు సోకుతాయని తెలిపారు.ఉడికించి తినడం వల్ల మాంసంలోని బ్యాక్టీరియా చనిపోతుందని.. తద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తవని పేర్కొన్నారు. -
ఉడత దేశ భక్తి
హైదరాబాద్ : త్రేతాయుగంలోనే ఉడత తన భక్తిని చాటుకుందని పురాణాలు చెబుతున్నాయి. నేటికీ ‘ఉడత భక్తి’ అనే పదం చాలా సందర్భాల్లో మనం వాడుతుంటాం.. అయితే ఇక్కడ ఉడత తన దేశభక్తిని చాటుకుంది. బుధవారం అందరూ స్వాతంత్య్ర వేడుకల్లో ఉండగా చిన్నారులు చిట్టి జెండాలను తీసుకొని ఆట స్థలంలో పెట్టి వందనం చేసి వెళ్లగా.. ఓ చెట్టుపై నుంచి వచ్చిన ఉడత చిట్టి జెండాకు వందనం చేస్తున్నట్లు కనిపించడంతో కొండాపూర్‌లోని గౌతమి ఎన్క్లేవ్ కాలనీవాసుల దృష్టంతా అటువైపే మళ్లింది. అక్కడే ఉన్న ఓ ఫొటో గ్రాఫర్ ఈ చిత్రాన్ని తన కెమెరాలో బందించారు. -
మనిషిని వెంటాడిన బుల్లి ఉడత.. చివరకు..
బెర్లిన్ : ఓ మనిషిని వెంటాడిన బుల్లి ఉడత అతన్ని ముప్పతిప్పలు పెట్టింది. వెంటపడి ఓ వీధి నుంచి మరో వీధికి పరుగులు పెట్టించింది. ఆ ఉడత భారి నుంచి తప్పించుకోవటానికి ఆ వ్యక్తి ఏకంగా పోలీసులను సంప్రదించాడు. స్పందించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ఉడతను అదుపులోకి తీసుకున్నారు. ఈ వింతైన సంఘటన జర్మీనీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... గురువారం ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి తనను ఓ ఉడత వెంటాడుతోందని ఎలాగైనా రక్షించండని వారిని బతిమాలుకున్నాడు. స్పందించిన పోలీసులు అతను చెప్పిన ప్రాంతానికి చేరుకున్నారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకునేలోపే కథ సుఖాంతమైంది. అతన్ని వెంటాడి అలసిపోయిన ఆ ఉడత రోడ్డు పక్కన నిద్రపోయింది. దాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు దానికి కార్ల్ ఫ్రెండ్రిచ్ అని పేరు పెట్టి జంతునిలయానికి ఇచ్చేశారు. జంతు సంరక్షకురాలు క్రిస్టినా క్రెంజ్ మాట్లాడుతూ.. ఆ ఉడత తల్లినుంచి వేరుపడి ఆ వ్యక్తిని తల్లిగా ఉహించుకుని వెంటపడినట్లు తెలిపారు. ఇలా తల్లికి దూరమైన ఉడతలు తల్లి స్థానంలో వేరే వారిని ఊహించుకుంటాయని వెల్లడించారు. బుల్లి ఉడత ఒక్కసారిగా వెంటబడేసరికి ఆ వ్యక్తి భయపడిపోయి ఉంటాడని అంది. -
ఉడతా ఉడతా ఊచ్.. ఆటలు ఆడుదామోచ్..!
ఆటలు మనుషులకేనా.. మీకే ఒలింపిక్స్ గేమ్స్ ఉంటాయా.. మేమూ ఆడతాం అంటూ చాలెంజ్ చేస్తున్నాయి ఈ ఉడతలు. అంతేకాదు ఐస్ స్కేటింగ్ వంటి గేమ్స్ కూడా ఆడేస్తున్నాయి. ఆడటమే కాదు ఒలింపిక్స్ పతకాలను కూడా గెలుచుకున్నాయి. ఉడతల ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయబ్బా.. ఎక్కడా వినలేదే అనుకుంటున్నారా.. అవును ఒలింపిక్స్ ఏం జరగలేదు. ఇదంతా గీర్ట్ వెగెన్ అనే ఫొటోగ్రాఫర్ మాయాజాలం. తన ఇంటికి వచ్చే ఉడతలకు కొన్ని తిండి గింజలు వేసి.. వాటితో పాటు చిన్న చిన్న ఆటవస్తువులు కూడా పెట్టేవాడు. వాటిని తినేందుకు వచ్చే ఉడతలు.. ఆట వస్తువులపైకి ఎక్కినపుడు ఈ ఫొటోలను తీశాడు. చాలా అద్భుతంగా ఉన్నాయి కదూ..! అయితే వాటిని చూసినంత సులువేం కాదు ఫొటోలు తీయడం అంటే.. ఈ ఫొటోల వెనుక చాలా కష్టం దాగి ఉందని చెబుతున్నాడు వెగెన్. దాదాపు 5 ఏళ్లుగా ఈ ఉడతల ఫొటోలను తీస్తున్నాడట. ఇప్పుడు అవి తనకు మంచి స్నేహితులుగా మారాయని మురిసిపోతున్నాడు. -
గూడు చెదిరె..ప్రేమ మిగిలె..
సృష్టిలో వెల కట్టలేనిది.. వర్ణించలేనంత గొప్పది ఏదన్నా ఉందంటే అది తల్లి ప్రేమే. సకల జీవరాశిలోనూ మాతృప్రేమ కనిపిస్తుందనడానికి ఈ చిత్రాలే నిదర్శనం. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలోని చెట్టు కొమ్మపై ఓ ఉడత గూడుకట్టుకుని పిల్లలను పెట్టింది. అనుకోకుండా ఆ గూడు చెదిరిపోయింది. దీంతో తల్లి ఉడత తన పిల్లలను కాపాడుకునేందుకు కళ్లు తెరవని తన బిడ్డలను నోట పట్టుకుని వేరేచోటికి తీసుకెళ్లింది. బుధవారం కనిపించిన ఈ అపురూపమైన దృశ్యాన్ని ‘సాక్షి’ కెమెరా బంధించింది. – ఫొటోలు: వి.రవీందర్ -
ప్రపంచంలోనే బుల్లి ఉడత
జకార్తా: ఇండోనేసియాలోని బోర్నియో అడవుల్లో ప్రపంచంలోనే అంతరించి పోయే జాతుల జాబితాలో ఉన్న అతి చిన్నదైన ఉడతను పరిశోధకులు కనుగొన్నారు. 73 మిల్లీమీటర్ల పొడవు, 17 గ్రాముల బరువైన ఈ బుల్లి ఉడతను సెప్టెంబర్ 16 వ తేదీన కనుగొన్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. దక్షిణ కాలిమంతన్ ప్రావిన్స్‌లోని మెరటస్ కొండలపై కనిపించిన ఈ ఉడతను శాస్త్రీయ పరిభాషలో బోర్నియన్ పిగ్మీ లేదా ఎక్సిలిసియురస్ ఎక్సిలిస్ అని పిలుస్తారు. సముద్ర మట్టానికి వెయ్యి మీటర్ల ఎత్తులో ఇవి సంచరిస్తుంటాయని శాస్త్రవేత్తలు వివరించారు. -
ఉడుతలకు జ్ఞాపకశక్తి ఎక్కువే..
ఆహారాన్ని మట్టిలో దాచిపెట్టుకుని.. అవసరమైనప్పుడు వెలికితీసి తినగల సామర్థ్యం ఉడుతలకు సొంతం. అయితే వీటి జ్ఞాపకశక్తి ఇక్కడికే పరిమితం కాలేదని.. సమస్యల పరిష్కారానికి ఉపయోగించిన పద్ధతులను ఇవి రెండేళ్ల వరకూ గుర్తు పెట్టుకోగలవని గుర్తించారు ఎక్స్‌టెక్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. ఐదు ఉడుతలపై నిర్వహించిన ఓ ప్రయోగం ద్వారా ఈ విషయం తెలిసిందని పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త డాక్టర్ థో రాబర్ట్ తెలిపారు. ఎరగా ఉంచిన ఆహారాన్ని అందుకునేందుకు కొన్ని అడ్డంకులు సృష్టించిన శాస్త్రవేత్తలు.. ఉడుతలు ఆ అడ్డంకులను ఎలా అధిగమించాయో గమనించారు. మొదట్లో అవి 8 సెకన్ల సమయం తీసుకున్నా.. కొంతకాలం తర్వాత ఈ సమయం 2 సెకన్లకు తగ్గింది. దాదాపు 22 నెలల తర్వాత కొన్ని మార్పులతో ఇదే రకమైన ప్రయోగం చేసినప్పుడు ఆ ఉడుతలు ముందు కొంచెం తటపటాయించినా ఆ తర్వాత మూడు సెకన్ల వ్యవధిలో ఆహారాన్ని అందుకున్నాయని దీని ద్వారా అవి తమ పాత పద్ధతులను గుర్తుంచుకున్నట్లు అయిందని రాబర్ట్ వివరించారు. -
మధ్యాహ్న భోజనం ఉడుతలు..ఎలుకలే!
♦ ఆకలిబాధ తట్టుకోలేక ఉడుతల్ని, ఎలుకల్ని తింటున్న జార్ఖండ్ గిరిజన బాలలు ♦ అధికారుల జేబుల్లోకి చేరుతున్న మధ్యాహ్న భోజనం నిధులు ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారి పేరు పింకి. మధ్యాహ్నం కాగానే ఉడతలు పట్టడం పింకి దినచర్య. దొరకకపోతే ఎలుకలు కూడా పడుతుంది. వాటితో ఆడుకోవడానికో.. సరదా కోసమో పింకి ఉడతలను, ఎలుకలను పట్టడంలేదు. కడుపు కాలి.. ఆకలి బాధను భరించలేక ఈ పనిచేస్తోంది. ఆమె మధ్యాహ్న భోజనం ఇదే అంటే ఆశ్చర్యమేస్తోంది కదూ! కానీ ఇది నిజం. మరి పింకి అలా.. ఉడుతలను, ఎలుకలనే ఎందుకు తింటోంది? ...ఎందుకంటే అధికారుల రూపంలో ఉన్న పందికొక్కులు పింకి నోటికాడి ముద్దను లాగేసుకుంటున్నాయి. మధ్యాహ్న భోజనానికి వందలు.. కాదు వేలు.. కాదు కాదు లక్షల కోట్ల రూపాయలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్నా అవేవీ దేశంలోని చాలామంది పిల్లల వద్దకు చేరడంలేదనేందుకు ఈ పింకే నిదర్శనం. వివరాల్లోకెళ్తే... జార్ఖండ్‌లోని సాహెబ్‌గంజ్ జిల్లా రాజ్‌మహల్ హిల్స్ ప్రాంతం చుహా పహర్ అనే ఓ కుగ్రామం ఉంది. ఇక్కడ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ పాఠశాల ఉంది. ఐదేళ్ల వయసున్నప్పుడే పింకిని పాఠశాలలో చేర్చారు. ఇప్పుడు పింకి వయసు తొమ్మిదేళ్లు. పింకి వయసు పెరుగుతోందే తప్ప.. తరగతి పెరగడంలేదు. కారణం.. పాఠశాల ఉంది పేరుకు మాత్రమే. ఆ ఊరిలో బడి ఈడు పిల్లలున్నా పాఠశాలలో మాత్రం ఒక్కరు కూడా ఉండరు. ఎందుకంటే చదువు చెప్పేందుకు అసలు టీచరే ఉండడు. ప్రభుత్వ లెక్కల్లో పక్కాగా.. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల్లో మాత్రం గత నాలుగు సంవత్సరాలుగా పింకి పేరుమీద నిధులు విడుదలవుతూనే ఉన్నాయి. స్కూల్ యూనిఫారంకు, పోషకాహారాలతో కూడిన మధ్యాహ్న భోజనానికి రూపాయి రూపాయి లెక్కగడుతూ నిధులు విడుదల చేస్తూనే ఉన్నారు. వీటితో పింకికి యూనిఫారం ఇచ్చినట్లు, ఆకుకూరలు, అన్నం, రోజుకో గుడ్డుతో భోజనం పెడుతున్నట్లు ప్రభుత్వానికి నివేదికలు కూడా అందుతున్నాయి. అయితే ఇక్కడ పింకి తింటోంది మాత్రం ఎలుకలు, ఉడతలు. ఎంత దారుణం!! పదివేల కోట్లు... ఈ ఏడాది బడ్జెట్లో పాఠశాల పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయలను కేటాయించింది. వీటితో 10.03 కోట్ల మంది చిన్నారుల చదువు, పోషకాహారం అందించనున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూ.6కు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమవంతుగా మరో రూ.4 కలిపి మొత్తం రూ.10తో పిల్లలకు పోషకాహారం పెట్టాలి. నిధులైతే మంజూరవుతున్నాయి. అయినా పింకి మాత్రం పస్తూలుంటూనే ఉంది. జార్ఖండ్‌లోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి పింకిలు ఎంతోమంది కనిపిస్తారు. సొమ్మంతా అధికారుల జేబుల్లోకి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న వేలాది కోట్ల రూపాయల నిధులు ఏమవుతున్నాయంటే... సమాధానం సుస్పష్టం. అవన్నీ అధికారుల జేబుల్లోకి చేరుతున్నాయి. పిల్లల నోటికాడి ముద్దను మాత్రమే కాదు... వారి భవిష్యత్తునూ లాగేసుకుంటున్నారు విద్యాశాఖ అధికారులు. ఎందుకంటే... బడిలో భోజనం పెడతారనే ఆశతో పాఠశాలకు వచ్చే చిన్నారులు మనదేశంలో ఇప్పటికే కోట్లాదిమందే ఉన్నారు. ఆ భోజనం దొరకనప్పుడు వారు బడికి రారు. దీంతో వారి భవిష్యత్తు నాశనమైనట్లే కదా? –సాక్షి, స్కూల్ ఎడిషన్