ఉడుతా ఉడుతా ఊచ్! ఎక్కడికెళ్తావోచ్ ! అని చిన్నప్పుడు పాడుకున్న పాట మీకందరికి గుర్తుండే ఉంటుంది.ఇప్పుడు ఇది ఎందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం.. ఒక ఉడుత ఆహారం కోసం చేసిన పని ప్రసుత్తం తెగ నవ్వు తెప్పిస్తుంది. పక్షల కోసమని ఒక ఇనుప ఊచపై ఆహారాన్ని పెట్టి ఉంచారు. అదే సమయంలో అక్కడే ఉన్న ఉడుతకు ఆకలైందో లేక దానిని అందుకోవాలని భావించిందో... వెంటనే ఇనుప ఊచను ఎక్కడానికి ప్రయత్నించింది. అయితే ఎన్నిసార్లు ఎక్కినా కిందకు జారిపోతుండడంతో చేసేదేంలేక అక్కడినుంచి నిరాశతో వెళ్లిపోయింది.
పాపం.. ఈ ఉడుతను చూస్తే జాలేస్తోంది
Published Sat, Feb 15 2020 8:01 PM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM