ఉడతతో ‘కోటి’ కష్టాలు
వాషింగ్టన్: వేలెడంత కూడా లేని ఉడత ‘కోటి’ కష్టాలు తెచ్చిపెట్టింది. అమెరికాలోని నిర్మాణంలో ఉన్న ఒక భవంతిలో విలువైన సామగ్రిని ధ్వంసం చేసి అధికారులకు చుక్కలు చూపింది. ఇండియానాలోని మెక్‌మిలిన్ పార్క్‌లో కమ్యూనిటీ సెంటర్ నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
అందుకు అనుగుణంగా ఒక భవనంలో విద్యుత్ సామగ్రి, ఇతర వస్తువులను ఉంచారు. అయితే అక్కడే ఉన్న ఉడత తనకు కనిపించిన ప్రతీ వస్తువును నాశనం చేసి కనిపించకుండా పోయింది. అధికారులు ధ్వంసం అయిన సామగ్రి విలువను లెక్కతేల్చి చూసే సరికి వారి కళ్లు బైర్లు కమ్మాయి.... ఉడత వల్ల నష్టపోయిన సామగ్రి విలువ ఏకంగా 1.80 కోట్లుగా తేలింది. అయితే దీని వల్ల పెద్ద ఇబ్బంది లేదని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. డ్యామేజీ అయిన సామగ్రికి ఇన్సూరెన్స్ ఉందని తెలిపారు.