
ముంబై : యోగా ఆరోగ్యానికి మంచిదంటారు.. అలాంటి యోగాను మనలో ఎంతమంది చేస్తున్నారో తెలీదు కానీ ఒక ఉడుత మాత్రం తన యోగాతో నెటిజన్ల మనుసులు గెలుచుకుంటుంది. ఇండియన్ ఫారెస్ట్ అధికారి సాకెత్ భదోలా షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఆ వీడియోలో ఉడుత ఒక చెక్కపై నిల్చుని ఉదర బాగాన్ని లోనికి బయటకు తీస్తూ శ్వాస తీసుకుంది. కాగా ఉడుత చేసిన ఆసనం పేరు 'కపల్బాతి ఆసన' అని పేర్కొన్నారు. కపల్బాతి ఆసనం అంటే గట్టిగా శ్వాస పీలుస్తూ ఉంటే ఉదర బాగంలో ఉండే ప్రతీ అవయవం కదులుతుంది. ఈ వీడియోనూ ఇప్పటికే 11వేల మందికి పైగా వీక్షించారు. 'ఉడుత యోగాసనం కొత్తగా ఉంది.. ఈ ఉడుత మరో బాబా రాందేవ్' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
వంట చేయటం అంత వీజీ కాదు!
మాస్టర్ చెఫ్‌కి యాక్షన్ హీరో అవార్డ్
Comments
Please login to add a commentAdd a comment