
ఉడుతా ఉడుతా ఊచ్! ఎక్కడికెళ్తావోచ్ ! అని చిన్నప్పుడు పాడుకున్న పాట మీకందరికి గుర్తుండే ఉంటుంది.ఇప్పుడు ఇది ఎందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం.. ఒక ఉడుత ఆహారం కోసం చేసిన పని ప్రసుత్తం తెగ నవ్వు తెప్పిస్తుంది. పక్షుల కోసమని ఒక ఇనుప ఊచపై ఆహారాన్ని పెట్టి ఉంచారు. అదే సమయంలో అక్కడే ఉన్న ఉడుతకు ఆకలైందో లేక దానిని అందుకోవాలని భావించిందో... వెంటనే ఇనుప ఊచను ఎక్కడానికి ప్రయత్నించింది. అయితే ఎన్నిసార్లు ఎక్కినా కిందకు జారిపోతుండడంతో చేసేదేంలేక అక్కడినుంచి నిరాశతో వెళ్లిపోయింది. అసలు విషయం ఏంటంటే ఇనుప ఊచకు గ్రీస్ రాసి ఉండడంతో ఉడుత ఎక్కిన ప్రతీసారి పట్టును నిలుపుకోలేక జర్రున జారిపోతుంది. దీనిని వీడియో తీసి ట్విటర్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆహారం అందుకోవడం కోసం ఉడుత చేసిన ప్రయత్నం చూసిన ప్రతీ ఒక్కరికి నవ్వు తెప్పిస్తుంది. పక్షుల కోసమని ఇనుప ఊచపై పెట్టిన ఆహారాన్ని వేరే జంతువులు తినకుండా ఇలా చేసి ఉంటారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment