ఎంచక్కా బీరు లాగించేసి..అంతటితో ఊరుకోక.. | Drunk squirrel causes hundreds of pounds of damage | Sakshi
Sakshi News home page

ఎంచక్కా బీరు లాగించేసి..అంతటితో ఊరుకోక..

Published Sat, Jul 18 2015 1:36 PM | Last Updated on Sun, Sep 3 2017 5:45 AM

ఎంచక్కా బీరు లాగించేసి..అంతటితో ఊరుకోక..

ఎంచక్కా బీరు లాగించేసి..అంతటితో ఊరుకోక..

లండన్: ఇల్లు పీకి పందిరేయడమంటే ఇదేనేమో! అయితే పీకింది మనుషులు కాదు ఓ ఉడుత. ఇంగ్లండ్‌లోని వర్‌సెస్టర్‌షైర్ ఈప్‌షామ్‌లో ఈ ఘటన జరిగింది. స్థానిక రైల్వే క్లబ్‌లో రాత్రిపూట ఓ బుల్లి ఉడుత ప్రవేశించి ఎంచక్కా బీరు లాగించేసింది. అంతటితో ఊరుకోక అక్కడున్న మద్యం సీసాలు పగులగొట్టి, ఆహార పదార్థాలు, ఇతర వస్తువులు లాగేసి చిందరవందర చేసిపెట్టింది.

 

ఉదయాన్నే క్లబ్‌కు వచ్చిన యజమాని చూసి అవాక్కయ్యాడు. దొంగలు పడ్డారేమోనని పరిశీలిస్తుండగా ఓ చిప్స్ ప్యాకెట్ నుంచి ఉడుత బయటకొచ్చింది. దాన్ని పట్టుకొని బయటకు పంపేసరికి తలప్రాణం తోకకొచ్చింది. ఉడుత చేసిన పనికి భారీ నష్టం వాటిల్లిందని యజమాని వాపోయాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement