లండన్: ఈ మధ్యకాలంలో చాలామంది విన్నూత్న రీతిలో రకరకాల డ్యాన్స్‌లు లేదా ఫీట్లు లేదా రకరకాల వంటలకు సంబంధించిన వీడియోలతో ప్రజలను ఆకర్షించడం చూస్తునే ఉన్నాం. ఆఖరికీ అసాధ్యమనే వాటిని కూడా సుసాధ్యం అనిపించేలా చేసి ప్రజలందరీ మనస్సులను గెలుచుకున్న వాళ్ల గురించి విని ఉన్నాం. కానీ కొంతమంది తమ వెర్రి చెష్టలు చూస్తే మనకు గందరగోళంగా అనిపిస్తుంది.
(చదవండి: ఫిజిక్స్‌లోని ఒక ప్రశ్నకోసం .... హెలికాఫ్టర్‌నే అద్దెకు తీసుకున్నాడు)
అలా అని వాళ్లు తెలివిలేని అమాయకులా అంటే ఆది కాదు. ఎందువల్ల కొంత మంది ఈ విధంగా అర్ధంకాని రీతిలో ప్రవర్తిస్తారో తెలియదు కానీ. వాటికి కూడా ఏదైనా అర్థం ఉంటుందేమో. ఏదిఏమైనా వారే నేరుగా చెబితే గానీ మనకు తెలియదు. ఇందంతా ఎందుకు చెబుతున్నానంటే. ఆహారం పై ఉప్పు చల్లడం, నమ్మశక్యం కానీ వస్తువులతో మాంసాన్ని కోసి చూపించే వీడియోలతో సాల్ట్ బేగా ప్రసిద్ధిగాంచిన టర్కిష్ చెఫ్ నస్రెట్ గోక్సే ఇప్పుడు సరికొత్త వీడియోతో ప్రజలను విస్మయానికే గాక గందరగోళానికి గురి చేస్తున్నాడు.
అయితే ఆ వీడియోలో సాల్ట్ బేగా పిలుసున్న చెఫ్ నస్రెట్ పైన డస్ట్‌బిన్ కవర్‌ను టీ షర్ట్‌లా ధరించి, కింద ఒక షార్ట్ వేసుకుని వినూత్నరీతిలో కనపడతాడు. అంతేకాదు నస్రెట్ ఒక పార్క్‌లో ఉడుతలకు, పావురాలకు ఆహారం తినిపిస్తూ ప్రకృతితో మమేకమవుతున్నట్లు కనిపిస్తాడు. ఈ మేరకు దీనికి సంబంధించిన వీడియో తోపాటుగా "ప్రకృతి ప్రేమికులు ఆనందంగా ఉంటారు" అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
దీంతో నెట్టింట ఈ వీడియో తెగ వైరల్ అవ్వడమే కాక నస్రెట్ ఎందుకలా చెత్త సంచిని టీషర్ట్గా ధరించాడు అంటూ నెటిజన్లు పెద్ద చర్చకు తెర తీస్తారు. పైగా నస్రెట్ యునైటెడ్ కింగ్‌డమ్‌లోని తన రెస్టారెంట్లో అధిక ధరల నేపథ్యంలో ఇలా వైరటీగా ధరించాడు కాబోలు అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వస్తున్నాయి. మీరు ఓ లుక్ వేయండి.
(చదవండి: బాప్రే!.. ఆ జంట దొంగలించిన వైన్ బాటిల్స్ ఖరీదు రూ.3 కోట్లా!)
Comments
Please login to add a commentAdd a comment