సాక్షి,సూర్యాపేట( నల్గొండ): గంతులు వేస్తూ చెట్లపై తిరగాల్సిన ఓ చిన్ని ఉడుత ఇంట్లో అల్లారుముద్దుగా ఆడుకుంటోంది. ఏకంగా మనుషుల మీదనే కోలాడుతోంది. ఈ దృశ్యాలు చూపరులను ఆశ్చర్యపరుస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట మండలం జనగామ క్రాస్‌రోడ్డులో నివాసముంటున్న షేక్ ఖలీం–హలీమా దంపతుల కుమారుడు అస్లం ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. రెండునెలల క్రితం అస్లం ఓ రోజు జనగామ క్రాస్ సమీపంలోని పిల్లలమర్రి రోడ్డులో స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు.
అదే క్రమంలో నాలుగైదు కాకులు కలిసి ఓ చిన్న ఉడుత పిల్లను పొడుస్తున్నాయి. రక్తం కారుతున్న ఆ ఉడుతను చూసి చలించిపోయిన అస్లం వెంటనే దాన్ని పట్టుకొని ఇంటికి తీసుకొచ్చాడు. దానికి అయిన గాయానికి ఆర్‌ఎంపీ వద్ద వైద్యం చేయించి అప్పటినుంచి ఇంట్లోనే అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. రోజూ ఆ ఉడుతకు పాలు పోస్తూ, ఆహారం పెడుతున్నారు. ఇంకేముంది ఆ ఉడుతకు ఆ ఇంటి వాళ్లంతా తెగ నచ్చేసినట్టున్నారు కాబోలు నిత్యం వాళ్ల మీదనే ఆడుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment