మునుగోడు: ధూమపానం చట్టరిత్యానేరం. బహిరంగ ప్రదేశాల్లో తాగకూడదని ఇప్పటికే అనేక చట్టాలను తీసుకొచ్చారు. అయితే దీన్ని కచ్ఛితంగా అమలు చేయాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉంది. అయితే ఇక్కడో పోలీస్ అధికారి సాక్షాత్తు పోలీస్ స్టేషన్ ఆవరణలోనే సిగరెటు తాగిన సంఘటన స్థానికంగా చర్చనీయాంశమయ్యింది. వివరాల్లోకి వెళ్తే. ఆదివారం మునుగోడు పోలీస్‌స్టేషన్‌లో ఓ అధికారి ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్నాడు.
ఈ క్రమంలో సిగరేట్ వెలిగించిన ఆ అధికారి తాను పోలీస్ స్టేషన్ ఆవరణలోఉన్నానన్న సంగతి కూడా మరిచిపోయాడు. అయితే దీనికి సంబంధించిన వీడియో స్థానికంగా వైరల్ అవుతోంది. సాధారణ పౌరులకు ఒక రూల్.. పోలీసులకు మరో రూల్ ఉంటుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
చదవండి: ఇక మధ్యప్రదేశ్‌లో ఆహారం కల్తీ చేస్తే జీవితాంతం జైల్లోనే!
Comments
Please login to add a commentAdd a comment