Cigarate
-
లైవ్‌లో సిగరెట్ తాగిన స్టార్ హీరో.. మండిపడుతున్న నెటిజన్స్!
కండలవీరుడిగా అభిమానుల్లో పేరు సంపాదించుకున్న హీరో సల్మాన్ ఖాన్. ఇటీవలే కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ప్రస్తుతం సల్మాన్ ఖాన్ బిగ్ బాగ్ ఓటీటీ సీజన్-2కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. (ఇది చదవండి: 'మనకు అలాంటి వారే ఉన్నారు.. హీరోయిన్ వివాదాస్పద కామెంట్స్') అయితే బిగ్ బాస్ షోలో సల్మాన్ ఖాన్‌కు చెందిన ఓ ఫోటో తెగవైరలవుతోంది. కంటెస్టెంట్స్‌తో మాట్లాడుతూ ఉండగా.. సల్మాన్ ఖాన్ సిగరెట్ పట్టుకున్న ఫోటో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. అంతే కాకుండా కొంతమంది హౌస్‌మేట్స్‌పై సల్మాన్ తీవ్రంగా కోప్పడినట్లు తెలుస్తోంది. దీంతో సల్మాన్ తీరుపై పలువురు నెటిజన్స్ మండిపడుతున్నారు. ఎంతోమంది అభిమానులకు ఆదర్శంగా ఉండే హీరో.. అందరికీ కనిపించేలా షోలో అలా చేయడమేంటని నిలదీస్తున్నారు. అసలు పొగ త్రాగడానికి అతన్ని షోలో ఎలా అనుమతించారని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరేమో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం కావడం వల్లే నిబంధనలకు విరుద్ధం కాదని అంటున్నారు. కాగా.. సల్మాన్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'టైగర్ -3' విడుదలకు సిద్ధమవుతోంది. అంతేకాకుండా సల్మాన్ 'కిక్ 2' కూడా లైన్లో ఉంది. అలాగే 'ప్రేమ్ కీ షాదీ' కోసం సూరజ్ బర్జాత్యాతో మళ్లీ కలిసి పనిచేయనున్నారు. (ఇది చదవండి: మీరు 'గే' కదా?.. ప్రముఖ డైరెక్టర్‌కు షాకిచ్చిన నెటిజన్! ) Salman Khan nahi sehmat gharwalon ke decision se! Kyun hai Falaq aur Avinash na ghar ke na ghat ke? Tune in to #WeekendKaVaar with Salman Khan now streaming free only on #JioCinemahttps://t.co/Nfmj7B7MFL#BBOTT2 #BBOTT2onJioCinema #BiggBossOTT2 pic.twitter.com/62y7uwG1aw — JioCinema (@JioCinema) July 8, 2023 -
స్పైస్‌జెట్ విమానంలో సిగరెట్ తాగిన పోకిరి.. సెల్ఫీ వీడియో వైరల్!
న్యూఢిల్లీ: విమానంలో ఏ చిన్న పొరపాటు జరిగినా వందల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అందువల్ల ప్రతి అంశాన్ని క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తారు. అయితే, ఓ వ్యక్తి స్పైస్‌జెట్ విమానంలో దర్జాగా సిగరెట్ తాగాడు. లైటర్‌తో సిగరేట్ వెలిగించుకుంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. దానిని సోషల్ మీడియాలో విడుదల చేయటంతో సంచలనంగా మారింది. అసలు విమానంలోకి లైటర్ ఎలా వెళ్లిందనే అంశం కీలకంగా మారింది. వందల మంది ప్రాణాలను ప్రమాదంలో పడేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు అధికారులు. సామాజిక మాధ్యమాల్లో ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి. అందులో గుర్గావ్కు చెందిన బాబీ కటారియా అనే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ విమానం సీట్లో పడుకుని సిగరెట్ అంటించాడు. పొగతాగుతున్న సంఘటనను సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అతడికి ఇన్‌స్టాగ్రామ్‌లో 6.30 లక్షల మంది అనుచరులు ఉన్నారు. ఈ వీడియోను పలువురు ట్విట్టర్లో షేర్ చేస్తూ విమానయాన శాఖ మంత్రి జోతిరాదిత్య సింధియాకు జత చేశారు. ‘దర్యాప్తు చేపట్టాం. అలా ప్రమాదకరంగా ప్రవర్తించే వారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలేసేది లేదు.’ అని ట్వీట్ చేశారు సింధియా. ‘బల్విందర్ కటారియా అనే వ్యక్తి స్పైస్‌జెట్ విమానంలో దుబాయ్ నుంచి న్యూఢిల్లీకి వచ్చాడు. జనవరి 23న ఢిల్లీలో ల్యాండయ్యాడు. ప్రస్తుతం వీడియో అతడి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజీల్లో లేదు. గతంలోనే విమానయాన భద్రతా విభాగం చర్యలు తీసుకుంది. ’అని పేర్కొన్నారు పౌర విమానయాన భద్రతా విభాగం అధికారులు. మరోవైపు.. ఈ సంఘటనపై మీడియాలో వార్తలు రావటాన్ని తీవ్రంగా ఖండించాడు కటారియా. కేవలం టీఆర్పీ రేటింగ్‌ల కోసమే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. New rule for Bobby kataria ? @JM_Scindia @DGCAIndia @CISFHQrs pic.twitter.com/OQn5WturKb — Nitish Bhardwaj (@Nitish_nicks) August 11, 2022 ఇదీ చదవండి: Allu Arjun: నోట్లో సిగరెట్, చెవికి పోగు.. అల్లు అర్జున్ న్యూ లుక్ వైరల్ -
సాక్షాత్తు పోలీసు అధికారే..
మునుగోడు: ధూమపానం చట్టరిత్యానేరం. బహిరంగ ప్రదేశాల్లో తాగకూడదని ఇప్పటికే అనేక చట్టాలను తీసుకొచ్చారు. అయితే దీన్ని కచ్ఛితంగా అమలు చేయాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉంది. అయితే ఇక్కడో పోలీస్ అధికారి సాక్షాత్తు పోలీస్ స్టేషన్ ఆవరణలోనే సిగరెటు తాగిన సంఘటన స్థానికంగా చర్చనీయాంశమయ్యింది. వివరాల్లోకి వెళ్తే. ఆదివారం మునుగోడు పోలీస్‌స్టేషన్‌లో ఓ అధికారి ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో సిగరేట్ వెలిగించిన ఆ అధికారి తాను పోలీస్ స్టేషన్ ఆవరణలోఉన్నానన్న సంగతి కూడా మరిచిపోయాడు. అయితే దీనికి సంబంధించిన వీడియో స్థానికంగా వైరల్ అవుతోంది. సాధారణ పౌరులకు ఒక రూల్.. పోలీసులకు మరో రూల్ ఉంటుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. చదవండి: ఇక మధ్యప్రదేశ్‌లో ఆహారం కల్తీ చేస్తే జీవితాంతం జైల్లోనే! -
మీకు అర్థమవుతోందా...!
సాక్షి, కోల్‌సిటీ(రామగుండం) : మీకు..అర్థమవుతోందా..పొగతాగడం ఆరోగ్యానికి హానికరం.. నో స్మోకింగ్ ప్లీజ్ అని సినిమాహాళ్లు, బహిరంగ ప్రదేశాల్లో ప్రచారం నిర్వహిస్తున్నా ధూమపానం మానడం లేదు జనం. తెరపై చూసిన పొగ రాయుళ్లు సినిమా మధ్యలోనే సిగరేట్ పొగను పీల్చేస్తున్నారు. తెరపై మీరేసుకున్నది మీరేసుకుంటే.. మేం తాగాలనుకున్నది తాగేస్తామంటూ గుప్పు గుప్పుమంటూ పొగలాగేస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నేటి యువత ధూమపానాన్ని ఓ ఫ్యాషన్‌గా భావిస్తోంది. ప్రాణాలు తీసే పొగ... ఫ్రెండ్స్‌తో..కాలేజీ రోజుల్లో ప్రారంభమయ్యే సిగరేట్ తాగే అలవాటుకి బీజం పడుతోంది. ఇలా సరదాగా మొదలై..హృదయానికి “పొగ’బెడుతోంది. మొదట్లో సరదాగానే ఉన్నా తర్వాత పొగకు అడిక్ట్ అయిపోతున్నారు. ఒక్కరోజు సిగరేట్ తాగకుంటే ఆ రోజంతా పిచ్చెక్కినట్టుగా, చిరాగ్గా ఉంటోందని చెబుతున్నారు. కొందరైతే రోజుకు ఒక సిగరేట్‌తో మొదలు పెట్టి..క్రమంగా రోజుకో పెట్టె వరకూ పీల్చేస్తుంటారు. ప్రకటనలు ఇస్తున్నా.. అంతే ప్రభుత్వాలు ఎన్ని రకాల ప్రకటనలు ఇస్తున్నా..ఇదొక వినోదంలా మారిపోయింది. ధూమపానం లేని లోకాన్ని చూడగలమా..? అనే సందేహం కలుగుతోంది. బహిరంగ ప్రదేశాల్లో ఎంత నిషేధం విధించినప్పటికీ పొగరాయుళ్లు దర్జాగా సిగరేట్ కాల్చుతూనే ఉన్నారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా మిలియన్ల కొద్దీ ప్రజలు పొగతాగడం ద్వారా మృత్యువాతకు గురవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఏటా పది లక్షల మంది మృత్యువాత... పొగాకు మనుషులకు హాని తలపెట్టే అత్యంత ప్రమాదకరమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పొగ తాగడం ద్వారా ఏటా 10 లక్షల మంది బాధితులు మృత్యువాతకు గురవుతున్నారని అంచనా. పొగాకు నివారణ చర్యలు పాటించకపోతే 2030 నాటికి 10 మిలియన్ వరకు మృతుల సంఖ్య చేరుకుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. బహిరంగంగానే... యువతలో సిగరేట్ ఇప్పుడు ఫ్యాషన్‌గా మారింది. పాశ్చాత్య సంస్తృతికి ఆకర్షితులై “పొగ’కు బానిసవుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగరాదని ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాన్ని తెచ్చినా ఫలితం లేకుండా పోతోంది. ఆస్పత్రులు, హోటళ్లు, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, క్రీడా మైదానాలతోపాటు బహిరంగ స్థలాల్లో పొగ తాగడం మాత్రం మానడం లేదు. ప్రభుత్వ హెచ్చరికలు ఎంతమాత్రం ఫలితం ఇవ్వలేకపోతున్నాయి. సిగరేట్లు, బీడీలు, అంబార్ తదితర పొగాకుతో కూడిన వస్తువులు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మైనర్లకు కూడా విక్రయించరాదని చట్టంలో ఉంది. కానీ ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. క్యాన్సర్‌కు కారణం పొగ సిగరేట్, బీడీలు, గుట్కా తదితర పొగాకు ఉపయోగించడం గొంతు, ఊపిరిత్తులు, పేగు క్యాన్సర్లు, కిడ్నీ, గుండె జబ్బులు, నోటి దుర్వాసన, పెదవులపై తెల్లపూత, పళ్లు రంగు మారడం తదితర జబ్బులకు గురవుతారని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. పుట్టబోయే బిడ్డకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అంగవైకల్యం కలిగే అవకాశం ఉంది. ధూమ ప్రియుల్లో లైంగిక సామర్థ్యం తగ్గిపోవడం, జ్ఞాపకశక్తి మందగించడం సమస్యలు వస్తాయి. గుట్కాలు తీసుకోవడం ద్వారా గర్భస్రావం జరిగే అవకాశాలు ఎక్కువ. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో 20 నుంచి 60 సంవత్సరాలు వయసు మధ్య ఉన్నవారు ఎక్కువగా పొగాకు వాడుతున్నారని అంచనా. జరుగుతున్న మరణాల్లోనూ 90శాతం వరకు పొగాకు వాడిన వారే ఉండడం బాధాకరం. ఆరోగ్యానికి మంచిదికాదు సిగరేట్, బీడీలు, గుట్కా తదితర పొగాకు ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిదికాదు. వీటితో గొంతు, ఊపిరిత్తులు, పేగు, కడుపులో క్యాన్సర్లు, కిడ్నీ, గుండె జబ్బులు, నోటి దుర్వాసన, పెదవులపై తెల్లపూత, పళ్లు రంగు మారడం, నరాల వ్యాధులు, గ్యాస్ట్రబుల్లాంటి జబ్బులకు గురవుతారు. పుట్టబోయే బిడ్డకు అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అంగవైకల్యం కలిగే అవకాశం కూడా ఉంది. ధూమ ప్రియుల్లో జ్ఞాపకశక్తి మందగించే సమస్యలు వస్తాయి. వీటికి దూరంగా ఉండడం మంచిది. – డాక్టర్ అహ్మద్, గయాసౌదీన్, జనరల్ ఫిజీషియన్, గోదావరిఖని చుక్కేస్తే.. చిక్కులే కరీంనగర్‌క్రైం : మద్యం తాగి వాహనాలతో రోడ్డెక్కితే పోలీసులు చుక్కలుచూపడం ఖాయం. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడుపుతున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించడమే ఈ సంవత్సరం ప్రధాన లక్ష్యంగా పోలీసులు గట్టిగా కృషి చేస్తున్నారు. ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్న పోలీసుల యంత్రాంగం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహిస్తోంది. ఒకవైపు ట్రాఫిక్ వినియోగంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతూనే మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తూ పట్టుబడ్డ వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. 2018 నుంచి 2020 వరకు 19631 కేసులు నమోదు కాగా 2020 సంవత్సరం జనవరి నుంచి 2354 కేసుల నమోదయ్యాయి. మద్యం తాగి వాహనాలు నడపొద్దని పోలీసులు సూచించినా వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. 23 మంది లైసెన్స్‌లు రద్దు తరచూ మద్యం తాగి పట్టుబడిన వ్యక్తుల లైసెన్స్‌ల రద్దుకు రవాణాశాఖ అధికారులకు పోలీసులు ప్రతిపాదన పంపుతున్నారు. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 23 మంది వాహనదారులకు సంబంధించిన లైసెన్స్‌లు 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకూ రద్దు చేశారు. పోలీసులు అన్నివేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతుండడంతో మహిళలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా తమ ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. క్యూఆర్ కోడ్ విధానం అమలు కూడా ప్రైవేటు వాహనాల డ్రైవర్ల దురుసు ప్రవర్తన, ఇతరత్రా విషయాల గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి దోహదపడుతోంది. దడపుట్టిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు పోలీసులు చేపడుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మందుబాబుల్లో దడపుట్టిస్తున్నాయి. మద్యం తాగి పట్టుబడిన వారందరికీ శిక్షలు పడుతున్నాయి. ఒక రోజు నుంచి మొదలుకొని మోతాదును మించి తాగిన వాహనాలు నడిపిన వారికి మూడునెలల వరకు జైలు శిక్షలు, జరిమానాలు విధిస్తున్నారు. మద్యంతాగి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలకు గురవడంతోపాటు ఎలాంటి సంబంధం లేని పాదాచారులు కూడా ప్రమాదాలకు గురవుతున్నారు. రెండేళ్లుగా జనవరి 2018 నుంచి డిసెంబర్ 2019 వరకు కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 17,277 మంది మద్యం తాగి వాహనాల తనిఖీల్లో పట్టుబడగా ఇందులో 4483 మందికి జైలుశిక్షలు, 8362 జరిమానా విధించారు. జరిమానా రూపంలో రూ.1,78,36,825లు వచ్చింది. జనవరి 2020 నుంచి మార్చి 6 వ తేదీ వరకు 2354 మంది పట్టుబడగా 464 మందికి జైలుశిక్ష, 1132 మందికి జరిమానా విధించారు. రూ.33,67,100లు జరిమానా రూపంలో వచ్చింది. అవగాహన...కౌన్సెలింగ్‌లు.. మద్యంతాగి వాహనాలు నడిపే వారిని నియంత్రించడానికి పోలీసులు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పట్టుబడిన వారికి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తూ కోర్టులో హాజరుపరుస్తున్నారు. పోలీసులు రోడ్డు ప్రమాదాలు నివారించాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కొంతమంది వాహనదారులు మాత్రం మారడం లేదు. ఆన్లైన్ ద్వారా కేసు నమోదు వాహనాల తనిఖీల సమయంలో బ్రీత్ అనలైజర్ ద్వారా డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో పట్టుబడిన వారు గతంలో డిపార్ట్మెంట్లో తెలిసిన వారితో ఫోన్ చేయిస్తున్నారు. ప్రస్తుతం వాహనదారులకు అలాంటి అవకాశం లేకుండా పరీక్షల్లో పట్టుబడిన వెంటనే వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్, బ్రీత్ అనలైజర్ చూపించిన అల్కాహల్శాతం రిపోర్టు తదితర వివరాలు ఆన్Œలైన్లో నమోదు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. బీఏసీ (బ్లడ్ అల్కాహాల్ కన్సంట్రేషన్) ప్రమాణాల మేరకు ప్రతీ వంద మీటర్ల రక్తంలో 30 మిల్లీ గ్రాములకు మించి మద్యం మోతాదు దాటకూడదు. అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తారు. డ్రంకెన్ డ్రైవ్ పరీక్షల్లో పట్టుబడిన వాహనం వెంటనే స్వాధీనం చేసుకొని స్టేషన్‌కు తరలించి, తర్వాత చార్జీషీట్ నమోదు చేసి కేసును కోర్టుకు పంపిస్తారు. కేసు తీవ్రతను బట్టి జరిమానా, జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. వాహనదారుల భద్రతలో భాగంగా.. వాహనదారుల భద్రత కోసమే డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నాం. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం తప్పనిసరి. ప్రమాదాలు సంభవించకముందే వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యంతాగి వాహనాలు నడపడం ద్వారా చాలామంది ప్రమాదాలబారినపడ్డారు. ట్రాఫిక్ రూల్స్‌ను వాహనదారులు బాధ్యతగా పాటించాలి. డ్రంక్ అండ్ డ్రైవ్‌ల నిర్వహణను అన్నివర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారు. – విబి.కమలాసన్‌రెడ్డి, కరీంనగర్ పోలీసు కమిషనర్ -
డ్రగ్స్: వీరే టార్గెట్.. జాగ్రత్త తప్పనిసరి
గుంటూరు నగరానికి చెందిన రోహిత్ (పేరు మార్చాం) పదో తరగతి, ఇంటర్మీడియట్లో బాగా చదివేవాడు. స్కూల్, కాలేజీ టాపర్. ఇంటర్ పూర్తవ్వగానే ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీ (బీటెక్)లో చేరాడు. మొదటి సంవత్సరం సెకండ్ క్టాస్లో పాసయ్యాడు. రెండో సంవత్సరం నుంచి బ్యాక్ లాగ్స్ మొదలయ్యాయి. ఉదయం కళశాలకు అని చెప్పి వెళ్లిన వాడు అర్ధరాత్రి దాటిన తర్వాత ఎప్పుడో ఇంటికి వచ్చేవాడు. చదువుపై కూడా శ్రద్ధ తగ్గింది. కుటుంబ సభ్యులతో సరిగా మాట్లాడటం మానేశాడు. వారితో కలవకుండా ఒంటరిగా ఉంటున్నాడు. ఒక రోజు గుంటూరు అర్బన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ నుంచి రోహిత్ తండ్రికి ఫోన్ వచ్చింది. మీ అబ్బాయి గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డాడని పోలీసులు చెప్పారు. దీంతో రోహిత్ తల్లిదండ్రులు షాకయ్యారు. ఇది కేవలం ఒక్క రోహిత్ తల్లిదండ్రుల విషయంలోనే కాదు. మత్తు పదార్థాలకు బానిసలైన అనేక మంది విద్యార్థుల కుటుంబాలకు ఎదురైన ఘటన. సాక్షి, గుంటూరు: చదువు కోవాల్సిన వయసు పక్కదారి పడుతోంది. పుస్తకాల ఉండాల్సిన బ్యాగుల్లో మత్తు పదార్థాలు కనిపిస్తున్నాయి. జల్సాలకు అలవాటు పడి ఉజ్వల భవిష్యత్తు చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. గుంటూరు నగరంలో కొందరు కాలేజీ యువకులు గంజాయితో పాటు మత్తు పదార్థాలకు ఆకర్షితులవుతున్నారు. ఆ మత్తులో మునగడమే కాకుండా వాటి విక్రయాల్లోనూ కూరుకుపోతున్నారు. విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయిని అక్రమంగా తీసుకొస్తున్న మత్తు పదార్థాల మాఫియా వాటిని విక్రయించి సొమ్ము చేసుకునేందుకు యువతను పావులుగా వాడుతోంది. మాయమాటలు నమ్మి.. జిల్లాలో ఇంజనీరింగ్, డిగ్రీ, ఇతర విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల్లో కొందరు గంజాయి మత్తులో జోగుతున్నారు. అప్పటి వరకూ పాఠశాలలు, కాలేజీల్లో చదివి ఉన్నత విద్యాల కోసం యూనివర్సిటీలు, ఇతర కళాశాలల్లో చేరడం, అదో కొత్త కలల ప్రపంచంలా కనిపించే సరికి చెడు వ్యసనాలకు అలవాటుపడుతున్నారు. తెలిసీ తెలియని వయసులో కొందు కేటుగాళ్ల మాటలు నమ్మి తరగతులకు డుమ్మా కొట్టి సినిమాలు, షికార్లు అంటూ తిరుగుతూ మత్తు పదార్థాలు తీసుకుంటూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. వాళ్ల టార్గెట్ వీళ్లే.. సంపన్న, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన పిల్లలను టార్గెట్ చేస్తూ గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. గుంటూరు, చిలకలూరిపేట, మంగళగిరి, తాడేపల్లి, నరసరావుపేట సహా పలు ప్రాంతాల్లోని ప్రైవేట్ కళాశాలలు, యూనివర్సిటీల వద్ద మకాం వేస్తున్న గంజాయి, ఇతర మత్తు పదార్థాల ముటా సభ్యులు మాటలు కలిపి విద్యార్థులతో స్నేహం చేస్తున్నారు. వారితో పరిచయాలు పెంచుకుని బర్త్‌డే, వీకెండ్ అంటూ నమ్మ బలికి పార్టీలకు ఆహ్వానిస్తున్నారు. పార్టీలకు వచ్చిన విద్యార్థులను ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావ్ అంటూ మాయమాటలు చెప్పి మద్యం, గంజాయి, మత్తు పదార్థాలు తీసుకునేలా ఉసుగొలుపుతున్నారు. అనంతరం వారిని గంజాయి రవాణా, ఇతరత్రా కార్యకలాపాల్లో పావులుగా వాడుకుంటున్నారు. జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం, సరఫరా చేస్తున్న వారిలో 50 శాతానికిపైగా ఇంజనీరింగ్ విద్యార్థులే ఉన్నట్టు పోలీస్, ఎక్సైజ్ అధికారుల పరిశీలనలో వెల్లడైంది. విచ్చలవిడిగా లభ్యం.. గత కొద్ది రోజుల కిందట నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న విదేశీ ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా సభ్యులతో సంబంధాలున్న గుంటూరు నగరానికి చెందిన ఓ హోటల్ యజమాని కుమారుడు, ఫిరంగిపురం సమీపంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని కూడా అదుపులోకి తీసుకున్నారు. విదేశీ ముఠా సభ్యులను మత్తు పదార్థాలు జిల్లాకు ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు. ఇక్కడ ఎవరెవరికీ విక్రయిస్తున్నారనే దానిపై పోలీసులు ఆరా తీయగా అధిక శాతం మంది బీటెక్, డిగ్రీ, ఇతర విద్యార్థులే వినియోగం, విక్రయం సాగిస్తున్నట్టు తేలింది. ఇదే తరహాలో అనేక ఘటనల్లో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, వినియోగిస్తూ, సరఫరాచేస్తూ కాలేజీ విద్యా ర్థులు పట్టుబడ్డారు. గడిచిన రెండు నెలల్లో ఈ తర హా 18కేసులు నమోదయ్యాయి. విచ్చలవిడిగా రూ.100–200లకే గంజాయి సిగరెట్లు, ఇతర మ త్తు పదార్థాలు లభిస్తుండటంతో విద్యార్థులు వా టికి బానిసలుగా మారి పెడదోవపడుతున్నారు. తల్లిదండ్రులు గుర్తించాలి ► కాలేజీలకు వెళ్లిన పిల్లలు ఏ సమయానికి తిరిగి ఇంటికి వస్తున్నారు. పార్టీలు, పర్యటనలని తరచూ ఎక్కడికైనా వెళ్తున్నారా? అని గమనించాలి. ► బ్యాక్‌లాగ్స్ నమోదవుతున్నాయంటే అందుకు గల కారణాలను లోతుగా విశ్లేషించాలి. ► చదువుల్లో వెనుకబడుతున్నప్పుడు కళాశాలలోని లెక్చరర్లతో మాట్లాడాలి. ► ఎవరెవరితో తిరుగుతున్నారో ఓ కంట కనిపెట్టాలి. అవసరం ఉన్న మేరకే డబ్బు ఇవ్వాలి. ఇచ్చిన డబ్బు ఎందుకోసం ఖర్చుపెట్టారో ప్రశ్నించాలి. ► ముఖ్యంగా పిల్లలతో సన్నిహితంగా ఉండాలి. ఎప్పటికప్పుడు వారి బాధలను, ఇబ్బందులను తెలుసుకుంటూ సలహాలు ఇస్తూ ప్రోత్సహించాలి. భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు యువత చెడు వ్యసనాల బాట పట్టొద్దు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయేతలు వాళ్ల అవసరాలాకు వాడుకోవడం కోసం మీతో సన్నిహితంగా మెలుగుతారు. యవత దీన్ని గుర్తుంచుకోవాలి. మత్తుకు బానిసలుగా మారితే భవిష్యత్తు నాశనం అవుతుంది. తల్లిదండ్రులు కూడా పిల్లలపై నిరంతర నిఘా ఉంచాలి. –పీహెచ్డీ రామకృష్ణ, గుంటూరు అర్బన్ ఎస్పీ -
వందేళ్ల కిందటే సెల్ఫీలు...
లండన్: ఈ మధ్య సెలబ్రెటీ కనిపిస్తే సెల్ఫీ ప్లీజ్ అని అడిగేస్తున్నాం. అలాగని సెల్ఫీ ట్రెండ్ లేటెస్ట్ అనుకుంటే పొరపాటే. 100 ఏళ్ల క్రితం బ్రిటిష్ సముద్ర తీర ప్రాంతంలోని ఓ పట్టణంలో సెల్ఫీ తీసుకున్నట్లు ఇటీవల గుర్తించారు. 1915 నాటి సెల్ఫీల్లో కొంతమంది యువతీ యువకులు సిగరెట్ పెట్టుకుని ఫోజులిస్తూ కనిపించారు. -
కత్తిపోట్లకు దారితీసిన సిగరెట్ లొల్లి...
- వైన్స్ సిట్టింగ్ రూమ్‌లో ఘటన - ఉస్మానియాలో చికిత్స పొందుతున్న బాధితుడు చాంద్రాయణగుట్ట: వైన్స్ సిట్టింగ్ రూమ్‌లో సిగరేట్ విషయమై ఇద్దరు యువకుల మధ్య గొడవ జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన యువకుడు మరో యువకుడిపై కత్తితో దాడి చేశాడు. ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. కాగా. నిందితుడు వైన్స్ ఎదురుగా ఉన్న మటన్ షాప్‌కు వెళ్లి కత్తి తీసుకొచ్చి దాడి చేయడం గమనార్హం. ఇన్స్పెక్టర్ ఎన్.లక్ష్మీనారాయణ కథనం ప్రకారం....తలాబ్‌కట్టా ప్రాంతానికి చెందిన అబ్దుల్ నవీద్ (28), తన స్నేహితుడు షరీఫ్‌తో కలిసి మంగళవారం సాయంత్రం గౌలిపురా మార్కెట్ ప్రాంతంలోని మాత వైన్స్‌లో మద్యం తాగేందుకు వచ్చాడు. అదే సమయంలో సుల్తాన్షాహి ప్రాంతానికి చెందిన కొందరు యువకులు మద్యం తాగడానికి అదే వైన్స్‌కు వచ్చారు. అంతా కలిసి సిట్టింగ్ రూమ్‌లో మద్యం తాగుతున్నారు. ఆ సమయంలో ఓ యువకుడు నవీద్‌ను సిగరేట్ అడిగాడు. సిగరేట్ ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అప్పటికే చిత్తుగా తాగి ఉన్న ఆ యువకుడు ఆగ్రహంతో వైన్స్ ఎదురుగా ఉన్న మటన్ షాపు వద్దకు పరుగెత్తికెళ్లాడు. మటన్ వ్యాపారి వద్ద ఉన్న కత్తిని లాక్కొని సిట్టింగ్ రూంలోకి వెళ్లి నవీద్‌పై దాడి చేశాడు. మెడ భాగంలో పొడిచేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో నవీద్ అడ్డుకోవడంతో ఎడమ చంక భాగంలో పొడిచారు. బాధితుడు, నిందితుడు పెనుగులాడుకుంటూ బయటికి వచ్చారు. బయట ఉన్న జనాన్ని చూసి నిందితుడు పారిపోయాడు. ఇది గమనించిన స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఛత్రినాక పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని బాధితుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని పోలీసులు వెల్లడించారు. పోలీసులు మాత వైన్స్‌ను బంద్ చేయించారు. పోలీ సులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.