
న్యూఢిల్లీ: విమానంలో ఏ చిన్న పొరపాటు జరిగినా వందల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అందువల్ల ప్రతి అంశాన్ని క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తారు. అయితే, ఓ వ్యక్తి స్పైస్‌జెట్ విమానంలో దర్జాగా సిగరెట్ తాగాడు. లైటర్‌తో సిగరేట్ వెలిగించుకుంటూ సెల‍్ఫీ వీడియో తీసుకున్నాడు. దానిని సోషల్ మీడియాలో విడుదల చేయటంతో సంచలనంగా మారింది. అసలు విమానంలోకి లైటర్ ఎలా వెళ్లిందనే అంశం కీలకంగా మారింది. వందల మంది ప్రాణాలను ప్రమాదంలో పడేసిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు అధికారులు.
సామాజిక మాధ్యమాల్లో ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి. అందులో గుర్‌గావ్‌కు చెందిన బాబీ కటారియా అనే ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ విమానం సీట్లో పడుకుని సిగరెట్ అంటించాడు. పొగతాగుతున్న సంఘటనను సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అతడికి ఇన్‌స్టాగ్రామ్‌లో 6.30 లక్షల మంది అనుచరులు ఉన్నారు. ఈ వీడియోను పలువురు ట్విట్టర్‌లో షేర్ చేస్తూ విమానయాన శాఖ మంత్రి జోతిరాదిత్య సింధియాకు జత చేశారు. ‘దర్యాప్తు చేపట్టాం. అలా ప్రమాదకరంగా ప్రవర్తించే వారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలేసేది లేదు.’ అని ట్వీట్ చేశారు సింధియా.
‘బల్విందర్ కటారియా అనే వ్యక్తి స్పైస్‌జెట్ విమానంలో దుబాయ్ నుంచి న్యూఢిల్లీకి వచ్చాడు. జనవరి 23న ఢిల్లీలో ల్యాండయ్యాడు. ప్రస్తుతం వీడియో అతడి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ పేజీల్లో లేదు. గతంలోనే విమానయాన భద్రతా విభాగం చర్యలు తీసుకుంది. ’అని పేర్కొన్నారు పౌర విమానయాన భద్రతా విభాగం అధికారులు. మరోవైపు.. ఈ సంఘటనపై మీడియాలో వార్తలు రావటాన్ని తీవ్రంగా ఖండించాడు కటారియా. కేవలం టీఆర్‌పీ రేటింగ్‌ల కోసమే ఇలా చేస్తున్నారని ఆరోపించారు.
New rule for Bobby kataria ? @JM_Scindia @DGCAIndia @CISFHQrs pic.twitter.com/OQn5WturKb
— Nitish Bhardwaj (@Nitish_nicks) August 11, 2022
ఇదీ చదవండి: Allu Arjun: నోట్లో సిగరెట్, చెవికి పోగు.. అల్లు అర్జున్ న్యూ లుక్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment