SpiceJet flight
-
స్పైస్‌జెట్ విమానంలో సిగరెట్ తాగిన పోకిరి.. సెల్ఫీ వీడియో వైరల్!
న్యూఢిల్లీ: విమానంలో ఏ చిన్న పొరపాటు జరిగినా వందల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అందువల్ల ప్రతి అంశాన్ని క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తారు. అయితే, ఓ వ్యక్తి స్పైస్‌జెట్ విమానంలో దర్జాగా సిగరెట్ తాగాడు. లైటర్‌తో సిగరేట్ వెలిగించుకుంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. దానిని సోషల్ మీడియాలో విడుదల చేయటంతో సంచలనంగా మారింది. అసలు విమానంలోకి లైటర్ ఎలా వెళ్లిందనే అంశం కీలకంగా మారింది. వందల మంది ప్రాణాలను ప్రమాదంలో పడేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు అధికారులు. సామాజిక మాధ్యమాల్లో ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి. అందులో గుర్గావ్కు చెందిన బాబీ కటారియా అనే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ విమానం సీట్లో పడుకుని సిగరెట్ అంటించాడు. పొగతాగుతున్న సంఘటనను సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అతడికి ఇన్‌స్టాగ్రామ్‌లో 6.30 లక్షల మంది అనుచరులు ఉన్నారు. ఈ వీడియోను పలువురు ట్విట్టర్లో షేర్ చేస్తూ విమానయాన శాఖ మంత్రి జోతిరాదిత్య సింధియాకు జత చేశారు. ‘దర్యాప్తు చేపట్టాం. అలా ప్రమాదకరంగా ప్రవర్తించే వారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలేసేది లేదు.’ అని ట్వీట్ చేశారు సింధియా. ‘బల్విందర్ కటారియా అనే వ్యక్తి స్పైస్‌జెట్ విమానంలో దుబాయ్ నుంచి న్యూఢిల్లీకి వచ్చాడు. జనవరి 23న ఢిల్లీలో ల్యాండయ్యాడు. ప్రస్తుతం వీడియో అతడి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజీల్లో లేదు. గతంలోనే విమానయాన భద్రతా విభాగం చర్యలు తీసుకుంది. ’అని పేర్కొన్నారు పౌర విమానయాన భద్రతా విభాగం అధికారులు. మరోవైపు.. ఈ సంఘటనపై మీడియాలో వార్తలు రావటాన్ని తీవ్రంగా ఖండించాడు కటారియా. కేవలం టీఆర్పీ రేటింగ్‌ల కోసమే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. New rule for Bobby kataria ? @JM_Scindia @DGCAIndia @CISFHQrs pic.twitter.com/OQn5WturKb — Nitish Bhardwaj (@Nitish_nicks) August 11, 2022 ఇదీ చదవండి: Allu Arjun: నోట్లో సిగరెట్, చెవికి పోగు.. అల్లు అర్జున్ న్యూ లుక్ వైరల్ -
స్పైస్ జెట్ విమానానికి త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
పాట్నా: పైలట్ అప్రమత్తతతో స్పైస్ జెట్ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. విమానంలో సాంకేతిక లోపం కారణంగా బిహటా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. టేకాఫ్ సమయంలో విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో 185 మంది ప్రయాణికులు ఉన్నారు. పైలట్ అప్రమత్తతతో ప్రయాణికులకు ముప్పు తప్పింది. చదవండి: అగ్నిపథ్ అల్లర్లు: 700 కోట్ల ఆస్తి నష్టం.. 718 మంది అరెస్ట్ -
భారత విమానాన్ని వెంబడించిన పాక్ వాయుసేన
న్యూఢిల్లీ : భారత్‌కు చెందిన స్పైస్‌జెట్ విమానాన్ని పాక్ వాయుసేన విమానాలు వెంబడించాయి. ఈ ఘటన సెప్టెంబర్ 23న చోటుచేసుకున్నట్టు సివిల్ ఏవియేషన్ వర్గాల తెలిపాయి. వివరాల్లకి వెళితే.. సెప్టెంబర్ 23న ఢిల్లీ నుంచి కాబూల్‌కు 120 మంది ప్రయాణికులతో స్పైస్‌జెట్ విమానం బయలుదేరింది. మార్గమధ్యలో పాక్ గగనతలంలోకి ప్రవేశించగానే.. ఆ దేశ వాయుసేనకు చెందిన రెండు ఎఫ్-16 జెట్స్ స్పైస్‌జెట్ విమానాన్ని వెంబడించడం ప్రారంభించాయి. ఇరువైపుల నుంచి స్పైస్‌జెట్‌ను ముట్టండించాయి. పాక్ జెట్స్లోని పైలట్లు.. భారత విమానం ప్రయాణిస్తున్న ఎత్తును తగ్గించాలని డిమాండ్ చేశారు. అలాగే ఫ్లైట్ సర్వీసు వివరాలు సమర్పించాల్సిందిగా కోరారు. దీంతో స్పైస్‌జెట్ కెప్టెన్.. ఇది భారత్‌కు చెందిన విమానమని.. ప్రయాణికులతో కాబూల్ వెళ్తుందని వారికి తెలియజేశాడు. పాకిస్తాన్ ఏటీసీ అధికారులు.. స్పైస్‌జెట్ ఫ్లైట్ కోడ్‌ను తప్పుగా అర్థం చేసుకోవడం వల్లనే ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా సమాచారం. సాధారణంగా ప్రతి విమానానికి ఒక కోడ్ ఉంటుంది.. అలాగే స్పైస్‌జెట్‌కు ‘SG’ అని ఉంటుంది. అయితే స్పైస్‌జెట్ కోడ్‌ను ‘IA’గా అర్థం చేసుకున్న పాకిస్తాన్ ఏటీసీ అధికారులు.. దానిని భారత ఆర్మీకి గానీ, వాయుసేనకు చెందినదని భావించారు. వెంటనే ఆ విమానాన్ని పరీక్షించడానికి ఎఫ్-16 విమానాలను రంగంలోకి దించారు. అయితే స్పైస్‌జెట్ కెప్టెన్ పాక్ వాయూసేన అనుమానాలను నివృత్తి చేసిన తర్వాత కూడా.. భారత విమానం పాక్ గగనతలం దాటి అఫ్ఘనిస్తాన్‌లో ప్రవేశించే వరకు ఎఫ్-16 విమానాలు వెనకాలే వచ్చాయి. కాగా, పాక్ గగనతలంలోకి భారత విమానాలపై నిషేధం లేని సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఈ ఘటనపై ఆ సమయంలో ఫ్లైట్‌లో ఉన్న ప్రయాణికుడు ఒకరు తన అనుభవాన్ని ఏఎన్ఐతో పంచుకున్నారు. ‘మేము ప్రయాణిస్తున్న విమానాన్ని వెంబడించిన పాక్ జెట్స్ ఫైలట్లు చేతి సైగల ద్వారా మా విమానాన్ని కిందికి దించాలని డిమాండ్ చేశారు. అలాగే స్పైస్‌జెట్ సిబ్బంది కూడా కిటికీలను కప్పివేయాలని.. నిశ్శబ్ధం పాటించాలని ప్రయాణికులను కోరార’ని తెలిపారు. అయితే ఆ ప్రయాణికుడు తన వివరాలను గోప్యంగా ఉంచాలని కోరాడు. కాబూల్‌లో విమానం క్షేమంగా ల్యాండ్ అయిన తర్వాత తిరుగు ప్రయాణం దాదాపు ఐదు గంటల పాటు ఆలస్యం అయింది. ఈ ఘటనపై కాబూల్‌లోని పాకిస్తాన్ ఎంబసీ అధికారులు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. -
టేకాఫ్ అవుతుండగా పేలిన టైర్
చెన్నై : చెన్నై నుంచి ఢిల్లీ వెలుతున్న స్పైస్ జెట్ విమానానికి గురువారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్ వే నుంచి టేకాఫ్ అవుతుండగా విమానం టైరు పేలినట్టు సిబ్బంది గుర్తించారు. అప్రమత్తమైన పైలట్ విమానాన్ని సురక్షితంగా తిరిగి చెన్నై విమానాశ్రయంలో దించారు. విమానంలోని ప్రయాణికులను సురక్షితంగా కిందికి దించి, తిరిగి టెర్మినల్ బిల్డింగ్‌లోకి తీసుకెళ్లారు. టైర్ పేలిన ఘటనతో రన్ వేను సాయంత్రం 6 గంట వరకు మూసివేశారు. కాగా, మరో ఘటనలో ఇథియోఫియన్ ఎయిర్‌లైన్స్ కు చెందిన కార్గో విమానాన్ని చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. మధ్యాహ్నం 2.44 గంటలకు ఇంధన కొరతతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. -
విమానం సీటు కింద బల్లి.. షాక్ తిన్న హీరోయిన్!
-
విమానం సీటు కింద బల్లి.. షాక్ తిన్న హీరోయిన్!
ఖరీదైన విమానంలో సీటు కింద నుంచి ఓ బల్లి వచ్చి తచ్చాడితే ఎలా ఉంటుంది. ఎవరికైనా ఒకింత వికారంగా, షాకింగ్‌గా ఉంటుంది. ఇలాంటి చేదు అనుభవమే వర్ధమాన నటి రూహి సింగ్‌కు ఎదురైంది. మధుర్ బండార్కర్ ‘క్యాలండర్ గర్ల్స్’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన ఈ భామ ప్రస్తుతం ఓ తమిళ సినిమాలో నటిస్తోంది. తమిళ చిత్రం ప్రమోషన్లో భాగంగా చెన్నైలో గడిపిన ఆమె స్పైస్‌జెట్ విమానంలో ముంబై తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో మండిపడిన ఈ మాజీ మిస్ ఇండియా.. విమానాల్లో ఇంత దారుణమైన అపరిశ్రుభత ఎలా ఉంటుందంటూ విమానంలో బల్లి తచ్చాడుతున్న వీడియను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. స్పైస్‌జెట్ విమానంలో అధిక ధర చెల్లించి తాను ప్రీమియం టికెట్‌ను కొన్నానని, తీరికలేని షెడ్యూల్ నుంచి విశ్రాంతి తీసుకోవడానికి తాను ఈ టికెట్ కొంటే.. అందుకు భిన్నంగా తాను ఓ బల్లితో కలిసి ప్రయాణించాల్సి వచ్చిందని ఆమె తన పోస్టులో వాపోయింది. తన సీటు కింద నుంచి వచ్చిన బల్లి క్రమంగా విండో వద్దకు వెళ్లి అటు నుంచి పైనున్న లగేజ్ క్యాబిన్లోకి వెళ్లిపోయిందని, దీని గురించి తాను క్యాబిన్ సిబ్బందికి వెంటనే ఫిర్యాదు చేసినా.. ఇది సర్వసాధారణ ఘటనలా వారు స్పందించి నవ్వుకోవడం తనను షాక్ గురిచేసిందని పేర్కొంది. విమానం దిగేవరకు బల్లి గురించి తాము ఏమీ చేయలేమని, కాబట్టి వేరే సీటులో కూర్చోవాలని సిబ్బంది చెప్పారని ఆమె వివరించింది. ఎక్కువ డబ్బు చెల్లించిమరీ తాను స్పైస్మాక్స్ సీటు కొనుగోలు చేశానని, కానీ వాస్తవానికి ఓ బల్లి పక్కన తాను కూర్చోవాల్సి వచ్చిందని, విమానంలోని పరిశుభ్రత ప్రమాణాలు తనను తీవ్రంగా ఆందోళనకు గురిచేశాయని చెప్పింది. అయితే, రూహి సింగ్ పోస్టుపై స్పందించడానికి స్పైస్‌జెట్ ఇప్పటివరకు ముందుకురాలేదు. @flyspicejet @spicejetairlines last night on flight SG 612 Chennai to Mumbai, I booked myself a spicemax seat (for which I paid extra money) to be seated next to a lizard! I'm extremely worried about your hygiene standards now, and the fact that the cabin crew laughed it off as if it's a common occurrence got me quite shocked. #Lizardonspicejet A post shared by Ruhi Singh (@ruhisingh12) on May 29, 2017 at 1:00am PDT -
విమానం ఎగరలేదు.. తలుపులు లాక్
విశాఖపట్నం: విశాఖపట్నం విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమానం సాంకేతికలోపం కారణంగా మూడు గంటల నుంచి నిలిచిపోయింది. ఇందులో ప్రముఖ నాయకులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. విమానంలో ఏసీ లేకపోవడంతో ఊపిరి ఆడని పరిస్థితి ఏర్పడింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేస్తారా లేదా అన్న విషయంపై యాజమాన్యం ఎలాంటి ప్రకటన చేయలేదు. విమానం నుంచి దిగి బయటకు వెళ్లిపోదామన్నా తలుపులు లాక్ అయి ఉన్నాయి. లోపల ఉక్కబోత, ఊపిరి ఆడని పరిస్థితి నెలకొంది. ప్రయాణికుల్లో చాలామంది పెద్దవయసు వాళ్లు ఉన్నారు. సాధారణంగానే ఇక్కడ 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. అలాంటిది విమానంలో తలుపులు అన్నీ వేసేసి ఉన్నప్పుడు పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సాంకేతిక లోపం మాత్రమే అని అధికారులు చెబుతున్నారు. అయితే విమానం ఎగరకపోవడం, తలుపులు లాక్ కావడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయో లేదో కూడా చెప్పకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. -
టాయిలెట్ కంపు.. దిగిపోయిన విమానం
సాధారణంగా బస్టాండ్లలో టాయిలెట్లు కంపు కొడితే వాటికి దూరంగా వెళ్లి నిలబడతాం. అదే రైళ్లలో అయితే అటువైపు వెళ్లడం మానేసి ఊరుకుంటాం. కానీ వేలకు వేలు పోసి టికెట్లు కొనుక్కున్న విమానంలోనే టాయిలెట్లు కంపు కొడితే..? లోపల ఉన్నవాళ్లు అసలు భరించే పరిస్థితి ఉండదు. అలాంటప్పుడు తప్పనిసరిగి విమానాన్ని దించేయాల్సి ఉంటుంది. తాజాగా ఓ స్పైస్‌జెట్ విమానంలో ఇలాగే జరిగింది. బెంగళూరు నుంచి ఢిల్లీకి ఓ విమానం బయల్దేరింది. అందులో 188 మంది ప్రయాణికులున్నారు. విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే టాయిలెట్ నుంచి ఘోరమైన దుర్వాసన వస్తోందని చాలామంది ఫిర్యాదు చేశారు. కాసేపటికి అది ఇక భరించలేని స్థితికి చేరుకుంది. చివరకు సిబ్బంది కూడా తమ వల్ల కాదని చేతులెత్తేశారు. దాంతో.. ఇక అక్కడకు సమీపంలోనే ఉన్న హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో విమానాన్ని దించేశారు. ఏకంగా టాయలెట్ నుంచి కాక్‌పిట్ వరకు కూడా దుర్వాసన వచ్చేయడంతో స్పైస్‌జెట్ విమానం బి-737ను హైదరాబాద్‌లో దించేయాల్సి వచ్చిందని స్పైస్‌జెట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. హైదరాబాద్‌లో ల్యాండయిన తర్వాత మొత్తం అంతా శుభ్రం చేసి, బాగా గాలి ఆడనిచ్చి ఆ తర్వాత విమానాన్ని నడిపించినట్లు వివరించారు. -
పగిలిన విండో.. స్పైస్ జెట్‌కు తప్పిన ప్రమాదం
పుణె: పైలట్ పక్కనే ఉన్న అద్దం స్వల్పంగా పగిలినట్లు ముందస్తుగా గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అప్పటికప్పుడు విమానాన్ని ఆపేసి మరమ్మత్తు పూర్తి చేసి తొమ్మిదిగంటలు ఆలస్యంగా ఆ విమానం ఎగిరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ పరిస్థితి ఢిల్లీకి చెందిన స్పైస్ జెట్ విమానానికి ఎదురైంది. లోహెగావ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బుధవారం ఉదయం స్పైస్ జెట్‌కు చెందిన విమానం ఉదయం 7.20గంటలకు ఢిల్లీకి బయలుదేరాల్సి ఉంది. అయితే, ముందస్తు తనఖీలో భాగంగా పైలట్ సీటుపక్కనే ఉన్న కిటికీ అద్దం పగిలి ఉండటం గుర్తించారు. దీంతో దానికి తిరిగి కొత్త అద్దాన్ని ఫిక్స్ చేసిన తర్వాత సాయంత్రం 4.25 గంటల ప్రాంతంలో విమానానికి అనుమతిచ్చారు. ‘పుణె నుంచి ఢిల్లీ మధ్య నడిచే ఎస్జీ999 స్పైస్ జెట్ విమానం బయలుదేరడానికి కాస్త ముందుగా పైలట్ పక్కనే ఉండే కిటికీ అద్దం కొంచెం పగిలి ఉండటం గమనించాం. దీంతో విమానాన్ని ఆపేసి తొమ్మిదిగంటలు ఆలస్యంగా పంపించాం’ అని స్పైస్ జెట్ ఒక ప్రకటనలతో తెలిపింది. -
విమానంలో మహిళ మృతికి కారణాలేమిటి?
ముంబాయి నుంచి వారణాసి వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో ఓ 34 ఏళ్ల మహిళ మృతిచెందింది. విమాన సిబ్బంది నిర్లక్ష్యంతోనే విమానం ఆన్‌బోర్డింగ్ సమయంలో ఆ మహిళ ప్రాణాలు విడిచినట్టు ఆమె కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. మృతిచెందిన మహిళ పేరు సంగీత. వారణాసికి చెందిన ఆమె, తన భర్త, పాపతో కలిసి ఫ్లైట్ ఎస్జీ 704 విమానంలో ముంబాయి నుంచి వారణాసి వస్తున్నారు. మార్గం మధ్యలోకి రాగానే ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం క్షీణించింది.. వెంటనే కుటుంబసభ్యులు విమాన సిబ్బందికి సమాచారం అందించినా వారు వైద్య సహాయం అందించడంలో జాప్యం చేశారని ఆమె భర్త వాపోతున్నారు. వెంటనే వైద్య సహాయం అందించకపోవడంతో తన భార్య మృతిచెందినట్టు భర్త ఆరోపిస్తున్నారు. అయితే సంగీతను విమానంలో డాక్టర్ పరీక్షించారని, కుటుంబసభ్యులు చేస్తున్న ఆరోపణలన్నీ తప్పుడువని స్పైస్ జెట్ ఓ ప్రకటన విడుదల చేసింది. సంగీతకు అవసరమైన వైద్యసహాయమంతా విమాన సిబ్బంది అందించారని పేర్కొంది. క్యాపిటన్ ఏటీసీకి సమాచారం అందించి, ల్యాండింగ్ సమయంలోనూ వైద్య సహాయం అందించారని స్పైస్ జెట్ తెలిపింది. విమానం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన తర్వాత ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించామని స్పైస్ జెట్ చెప్పింది.. అయితే మార్గం మధ్యలోనే సంగీత చనిపోయినట్టు డాక్టర్లు వెల్లడించారు. సంగీత పోస్టుమార్టం రిపోర్టే ఆమె చనిపోవడానికి అసలు కారణాలేమిటో వెల్లడిస్తుందని స్పైస్ జెట్ పేర్కొంటోంది. -
స్పైస్‌జెట్ వివూనానికి తప్పిన ముప్పు
–హైదరాబాద్ నుంచి రేణిగుంటకు వచ్చిన విమానం –72 వుంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది సురక్షితం రేణిగుంటః హైదరాబాద్ నుంచి రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న స్పైస్ జెట్ విమానం ల్యాడింగ్ సమయంలో అదుపు తప్పి రన్‌వేను దాటిపోయింది. శనివారం రాత్రి 8 గంటలకు చేరుకోవాల్సిన వివూనం వాతావరణంలో ప్రతికూల పరిస్థితుల దృష్యా ల్యాండింగ్‌లో విమానం అత్యంత వేగంగా ల్యాడింగ్ కావటంతో నిర్ధేశిత రన్‌వేను దాటి అర్ద కిలోమీటర్ పైగా వెళ్లిపోయింది. వర్షం కురవటంతో విమాన చక్రాలు బురదలో కూరుకుపోయాయి. ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో 72 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ విమానంలో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఉన్నట్లు సమాచారం. నిర్ధేశిత రన్‌వే నుంచి విమానం దూసుకుపోవటంతో ప్రయాణికులు కొన్ని క్షణాలు పాటు తవు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయాందోళనకు గురయ్యారు. వారిని ఎయిర్పోర్ట్ అధికారులు ల్యాండింగ్ ప్రదేశం నుంచి ప్రత్యేక బస్సులు ద్వారా బయటకు తీసుకొచ్చారు. ఎయిర్పోర్ట్ అధికారులు గోప్యతను ప్రదర్శించారు. విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ల్యాండింగ్ తర్వాత తవు కుటుంబీకులతో విషయాన్ని పంచుకోవటం ద్వారా పలు న్యూస్ చానల్స్‌లో కథనాలు వెలువడటంతో ప్రమాద విషయం బయటకు పొక్కింది. పైలట్ నిర్లక్ష్యమా, విమానంలో సాంకేతిక లోపమా, వాతావరణ ప్రతికూల పరిస్థితా అన్న విషయం విచారణలో తేలాల్సి ఉంది. విమానం కూరుకుపోవటంతో దానిని బయటకు తీసేందుకు విమానాశ్రయ సిబ్బంది చర్యలు చేపడుతున్నారు. -
శంషాబాద్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం రాత్రి ఒక విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. చెన్నై నుంచి ఢిల్లీ వెళ్తున్న స్పైస్‌జెట్ విమానంలోని ఒక ప్రయాణికుడికి గుండెపోటు వచ్చింది. దీంతో పెలైట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. సదరు ప్రయాణికుడిని వెంటనే ఎయిర్‌పోర్టులోని అపొలో ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఆప్రయాణికుడు చనిపోయాడు. అతడిని పంజాబ్‌కు చెందిన భగత్సుభేష్గా గుర్తించారు. -
స్పైస్ జెట్ విమానానికి తప్పిన ముప్పు
ఢిల్లీ వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానానికి ప్రమాదం తృటిలో తప్పింది. ఉదయం 8.45 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయల్దేరిన విమానం సాంకేతిక సమస్యలతో కొద్ది నిమిషాలకే వెంటనే మళ్లీ ల్యాండయింది. ఆ విమానంలో పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. విమానం టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే అందులో సాంకేతిక లోపం ఉన్నట్లు పైలట్ గుర్తించారు. దాంతో ఓ ప్రకటన చేసి, విమానాన్ని మళ్లీ ల్యాండ్ చేస్తున్నట్లు చెప్పారు. ఏం జరుగుతోందో తెలియని పరిస్థితిలో ప్రయాణికులంతా టెన్షన్‌కు గురయ్యారు. అయితే కాసేపటికి విమానం సురక్షితంగానే ల్యాండ్ అయింది. వెంటనే ప్రత్యామ్నాయం ఏర్పాటుచేస్తామని విమానయాన సంస్థ వర్గాలు అన్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి ఆదివారం కూడా తిరుపతి వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానంలో ఇలాంటి సాంకేతిక సమస్యే తలెత్తింది. దాంతో దాన్ని కూడా కొద్దిసేపటికే మళ్లీ ల్యాండ్ చేశారు. సోమవారం ఏకంగా వీఐపీలు ఉన్న విమానంలోనే లోపం రావడంతో అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
విశాఖ విమానాశ్రయంలో ప్రయాణికుల పడిగాపులు
గోపాలపట్నం (విశాఖ) : ముంబై నుంచి కోల్‌కతా వెళ్లాల్సిన ప్రయాణికులు విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం అర్థరాత్రి నుంచి పడిగాపులు కాస్తున్నారు. కోల్‌కతాకు వెళ్లాల్సిన స్పైస్‌జెట్‌కు చెందిన విమానం ముంబైలో శుక్రవారం రాత్రి బయలుదేరింది. అయితే కోల్‌కతాలో వాతావరణం అనుకూలించక భువనేశ్వర్‌కు మళ్లించారు. అక్కడ దిగేందుకు వీలుకాక పోవటంతో రాత్రి 11.30 గంటలప్రాంతంలో విశాఖ విమానాశ్రయంలో ల్యాండయింది. అందులోని సుమారు 180 మంది ప్రయాణికులకు స్థానికంగా వసతి కల్పించారు. ఇప్పటికీ కోల్‌కతాలో అనుకూల వాతావరణ పరిస్థితులు లేకపోవటంతో విమానం తిరిగి బయలుదేరలేదు. దీంతో వారంతా విశాఖలోనే ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
జెట్ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం
భోపాల్: జెట్ విమానానికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. స్పైస్‌జెట్ విమానం ఎస్జీ 2458 ల్యాండ్ అవుతుండగా ఓ జంతువు వచ్చి ఢీకొంది. పైలట్ జాగ్రత్తగా ల్యాండ్ చేసినప్పటికీ ముందు భాగం లోని గేర్ ధ్వంసమయింది. ముంబై నుంచి బయలుదేరిన జెట్ విమానం జబల్పూర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే సమయంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోలేదని ఎయిర్ లైన్స్ అధికారి ఒకరు వెల్లడించారు. జెట్ విమానంలో 49 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది సహా 53 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
రన్‌వేపై గేదెను ఢీకొన్న విమానం
-
రన్‌వే మీద గేదెను ఢీకొన్న విమానం
గుజరాత్‌లోని సూరత్ నగరంలో ఓ స్పైస్ జెట్ విమానం 140 మంది ప్రయాణికులతో బయల్దేరింది. అది ప్రయాణం మొదలుపెట్టి రెండు నిమిషాలు కూడా అయ్యిందో లేదో గానీ.. ఉన్నట్టుండి ఆగిపోయింది. ఆగడానికి ముందు ఒక్కసారిగా ప్రయాణికులంతా చిన్నపాటి కుదుపునకు కూడా లోనయ్యారు. ఏం జరిగిందా అని చూస్తే.. రన్‌వే మీదకు వచ్చిన గేదె ఒకదాన్ని ఆ విమానం ఢీకొంది. విమానశ్రయం ప్రహరీ కొంతమేర పడిపోవడంతో.. ఆ ఖాళీ లోంచి గడ్డి మేయడం కోసం ఆ గేదె వచ్చేసినట్లు తెలిసింది. గేదెను ఢీకొనడంతో బోయింగ్ 737 విమానం ఇంజన్ బాగా పాడైపోయింది, అటు గేదె కూడా చనిపోయింది. ఈ వ్యవహారంతో ఒక్కసారిగా అప్రమత్తమైన పౌర విమానయాన మంత్రిత్వశాఖ మొత్తం దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో భద్రత గురించి సమీక్షించాలని ఆదేశించింది. సూరత్ విమానాశ్రయం సమీపంలో పొలాలు ఉండటంతో అక్కడ గేదెలు తిరగడం సర్వసాధారణం. అయితే అలా వచ్చిన గేదెల్లో ఒకటి అనుకోకుండా రన్‌వే మీదకు వచ్చేసిందని అధికారులు చెబుతున్నారు. పైలట్ కూడా ఉన్నట్టుండి ఆ గేదెను చూడటంతో విమానం ఆపేలోపే దాన్ని ఢీకొట్టారు. కొన్ని సెకండ్లు ఆగి ఉంటే విమానం గాల్లోకి ఎగిరిపోయేదని, కానీ ఈలోపే ఈ దుర్ఘటన జరిగిందని ఓ ప్రయాణికుడు చెప్పారు. -
స్పైస్ జెట్ విమానానికి తప్పిన ముప్పు
చెన్నై నుంచి ట్యూటికొరిన్ బయలుదేరిన స్పైస్ జెట్ విమానానికి మంగళవారం తృటిలో ప్రమాదం తప్పింది. ఈ రోజు ఉదయం చెన్నై నుంచి ట్యూటికొరిన్ బయలుదేరిన కొద్ది నిముషాల్లో గమ్యస్థానం చేరుతుందనగా ఇంజన్లో పోగలు వచ్చాయి. దాంతో పైలెట్ అత్యంత చాకుచక్యంగా వ్యవహరించి ట్యూటికొరిన్ విమానాశ్రయంలో దించారు. దాంతో విమానంలో ప్రయాణిస్తున్న 72 మంది సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నారు. అయితే ట్యూటికారిన్ నుంచి చెన్నై తిరిగి వెళ్లవలసిన విమాన సర్వీసును రద్దు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఆ ఘటనపై ఇప్పటికే విచారణకు ఆదేశించినట్లు పౌర విమానాయాన శాఖ డైరెక్టర్ జనరల్ వెల్లడించారు. -
స్పైస్ జెట్ విమానానికి తప్పిన ముప్పు
చెన్నై నుంచి ట్యూటికొరిన్ బయలుదేరిన స్పైస్ జెట్ విమానానికి మంగళవారం తృటిలో ప్రమాదం తప్పింది. ఈ రోజు ఉదయం చెన్నై నుంచి ట్యూటికొరిన్ బయలుదేరిన కొద్ది నిముషాల్లో గమ్యస్థానం చేరుతుందనగా ఇంజన్లో పోగలు వచ్చాయి. దాంతో పైలెట్ అత్యంత చాకుచక్యంగా వ్యవహరించి ట్యూటికొరిన్ విమానాశ్రయంలో దించారు. దాంతో విమానంలో ప్రయాణిస్తున్న 72 మంది సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నారు. అయితే ట్యూటికారిన్ నుంచి చెన్నై తిరిగి వెళ్లవలసిన విమాన సర్వీసును రద్దు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఆ ఘటనపై ఇప్పటికే విచారణకు ఆదేశించినట్లు పౌర విమానాయాన శాఖ డైరెక్టర్ జనరల్ వెల్లడించారు.