స్పైస్ జెట్ విమానానికి తప్పిన ముప్పు | Smoke emanates from Spicejet flight, passengers safe | Sakshi
Sakshi News home page

స్పైస్ జెట్ విమానానికి తప్పిన ముప్పు

Published Tue, Sep 3 2013 12:07 PM | Last Updated on Fri, Sep 1 2017 10:24 PM

Smoke emanates from Spicejet flight, passengers safe

చెన్నై నుంచి ట్యూటికొరిన్ బయలుదేరిన స్పైస్ జెట్ విమానానికి మంగళవారం తృటిలో ప్రమాదం తప్పింది. ఈ రోజు ఉదయం చెన్నై నుంచి ట్యూటికొరిన్ బయలుదేరిన కొద్ది నిముషాల్లో గమ్యస్థానం చేరుతుందనగా ఇంజన్లో పోగలు వచ్చాయి. దాంతో పైలెట్ అత్యంత చాకుచక్యంగా వ్యవహరించి  ట్యూటికొరిన్ విమానాశ్రయంలో దించారు.

దాంతో విమానంలో ప్రయాణిస్తున్న 72 మంది సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నారు. అయితే ట్యూటికారిన్ నుంచి చెన్నై తిరిగి వెళ్లవలసిన విమాన సర్వీసును రద్దు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఆ ఘటనపై ఇప్పటికే విచారణకు ఆదేశించినట్లు పౌర విమానాయాన శాఖ డైరెక్టర్ జనరల్ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement