![SpiceJet flight suffered a tyre burst in Chennai International Airport - Sakshi](/styles/webp/s3/article_images/2018/02/8/chennai.jpg.webp?itok=vYpQDrKU)
టైర్ పేలడంతో చెన్నై విమానాశ్రయంలో నిలిచిపోయిన స్పైస్ జెట్ విమానం
చెన్నై : చెన్నై నుంచి ఢిల్లీ వెలుతున్న స్పైస్ జెట్ విమానానికి గురువారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలోని రన్ వే నుంచి టేకాఫ్ అవుతుండగా విమానం టైరు పేలినట్టు సిబ్బంది గుర్తించారు. అప్రమత్తమైన పైలట్ విమానాన్ని సురక్షితంగా తిరిగి చెన్నై విమానాశ్రయంలో దించారు. విమానంలోని ప్రయాణికులను సురక్షితంగా కిందికి దించి, తిరిగి టెర్మినల్ బిల్డింగ్‌లోకి తీసుకెళ్లారు. టైర్ పేలిన ఘటనతో రన్ వేను సాయంత్రం 6 గంట వరకు మూసివేశారు. కాగా, మరో ఘటనలో ఇథియోఫియన్ ఎయిర్‌లైన్స్ కు చెందిన కార్గో విమానాన్ని చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. మధ్యాహ్నం 2.44 గంటలకు ఇంధన కొరతతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment