ఇటీవలే రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టిన సంగీత జ్ఞాని ఇళయరాజా ఎప్పటిలానే తన చిత్రాలతో, సంగీత కచేరీలతో బిజీగా ఉంటున్నారు. తాజాగా అంగేరి దేశంలో నిర్వహించనున్న సంగీత కచేరిలో పాల్గొనేందుకు దుబాయ్‌కి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం వేకువ జామున రెండు గంటలకు విమానం చెన్నై నుంచి దుబాయ్‌కి బయలుదేరనుండటంతో ఇళయరాజా అంతకుముందే చెన్నై విమానాశ్రయం చేరుకున్నారు. అయితే శనివారం రాత్రి వర్షం కారణంగా విమానయానాలకు అంతరాయం కలిగింది.
ముఖ్యంగా ఇతర దేశాల నుంచి చెన్నైకు రావాల్సిన విమానాలు బెంగుళూరు, హైదరాబాద్ తదితర విమానాశ్రయంలో ల్యాండ్ కావలసిన పరిస్థితి. అదే విధంగా ఇళయరాజా పయనించాలని దుబాయ్‌కి వెళ్లే విమానం బయలుదేరడంలో చిక్కులు ఏర్పడ్డాయి. దుబాయ్‌కి వెళ్లే విమానం కొంత ఆలస్యంగా చెన్నైకు చేరుకుంది. అయితే రన్‌వేలో నీరు చేరుకోవడంతో విమానం బయలుదేరడానికి మరో మూడు గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆ తరువాత ఆకాశం మేఘాలు కమ్ముకోవడంతో మరో రెండు గంటలు అంతరాయం ఏర్పడింది. ఇలా ఏడు గంటల పాటు ఇళయరాజా చెన్నై విమానాశ్రయంలోనే ఉండిపోయారు.
చదవండి: పబ్లిక్‌గా నటికి ముద్దులు.. అమ్మ చూస్తే ఏమంటుందోనంటున్న నటుడు
డేటింగ్ చేసిన వ్యక్తే భర్తగా.. రెండోసారి పిల్లల్ని కనాలంటేనే భయం..
Comments
Please login to add a commentAdd a comment