ఇళయరాజా కూతురి చివరి సాంగ్‌ విడుదల | Ilayaraja's Daughter Bhavatharini Last Song Out Now | Sakshi
Sakshi News home page

ఇళయరాజా కూతురి చివరి సాంగ్‌ విడుదల

Published Fri, May 31 2024 3:00 PM | Last Updated on Fri, May 31 2024 3:09 PM

Ilayaraja's Daughter Bhavatharini Last Song Out Now

ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా వారుసురాలు, గాయనీ, సంగీతదర్శకురాలు భవతారిణి కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే.  కాగా ఆమె చివరిగా అరియమల, పుయలిల్‌ ఒరు ధోనీ చిత్రాలకు సంగీతాన్ని అందించారు. అయితే, అరియమల అనే చిత్రంలో ఆమె ఒక పాటను ఆలపించారు. ఆ సాంగ్‌ అనంతరం భవతారిణి మరణించారు. తాజాగా ఆ చిత్ర మేకర్స్‌ పాటను విడుదల చేశారు.

దర్శకుడు జేమ్స్‌ యువన్‌ దర్శకత్వంలో ఆర్‌ఎస్‌ కార్తీక్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'అరియమల'. ఈ చిత్రంలో మనీషా కథానాయికగా నటిస్తుండగా, మరిముత్తు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో దివంగత ప్లేబ్యాక్ సింగర్ ఇళయరాజా కుమార్తె భవతారిణి పాడిన 'అతిపూవా పోలా' అనే రొమాంటిక్ మెలోడియస్ సాంగ్ ప్రస్తుతం విడుదలైంది. నెట్టింట ఆ సాంగ్‌ తెగ వైరల్‌ అవుతుంది. తెలుగు ఆడియన్స్‌ను కూడా ఆ సాంగ్‌ మెప్పించేలా ఉంది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రంలోని లిరికల్ సాంగ్ ఇప్పుడు విడుదలై అభిమానుల హృదయాలను ఉర్రూతలూగించింది. 

ముఖ్యంగా భవతారిణి వాయిస్‌ని మిస్ అవుతున్నామని అభిమానులు అంటున్నారు. సోదరులు యువన్‌ శంకర్‌రాజా, కార్తిక్‌ రాజాలాగే భవతారణి కూడా తండ్రి ఇళయరాజా వారసత్వాన్ని కొనసాగించారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌గానే కాకుండా సింగర్‌గా కూడా తనదైన ముద్ర వేశారు. తెలుగులో కూడా ఆమె ఒక పాట ఆలపించారు.. 'నను నీతో నిను నాతో కలిపింది గోదారి' (గుండెల్లో గోదారి) చిత్రంతో తెలుగు వారిని కూడా మెప్పించారు.  క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె శ్రీలంకలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటూ మరణించారని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement